Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

రుతుక్రమ సమస్యలకు సీడ్‌ సైకిల్‌

Family Sakshi User Sakshi Sakshi Time Nov 28, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
monostro.jpg

పోషకాహారం

ఈ రోజుల్లో మహిళల రుతుక్రమంలో సమస్యలు తలెత్తడం ఎక్కువ కనిపిస్తోంది.. హార్మోన్ల హెచ్చుతగ్గులు వీటికి ప్రధాన కారణంగా ఉంటుంటాయి. ఈ సమస్యను సరిదిద్దడానికి మన ప్రాంతీయ సంప్రదాయ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. సమతుల ఆహారంతో పాటు సీడ్‌ సైక్లింగ్‌ థెరపీ పీసీఓఎస్‌ సమస్యలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.  

30 నుంచి 50 ఏళ్లు పైబడిన మహిళలు ... పీసీఓఎస్, థైరాయిడ్, మెనోపాజ్‌ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు రోజువారీ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది.  

→ మెటబాలిజంను బ్యాలెన్స్‌ చేసే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీలను ఆహారంలో చేర్చాలి. ఇవి ఈస్ట్రోజెన్‌ హార్మోన్లను వృద్ధి చేస్తాయి. క్యాన్సర్‌ కారక రిస్క్‌ను కూడా తగ్గిస్తాయి.

→ సాల్మన్‌ ఫిష్, చియా, అవిశ గింజలలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. చియా, అవిశ గింజలను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవచ్చు. చియా సీడ్స్‌ మజ్జిగ, నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. 

→ హోల్‌ గ్రెయిన్స్‌లో ఫైబర్‌ ఎక్కువ ఉంటుంది. కూరగాయలు, శనగలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్, బ్రౌన్‌ రైస్‌ తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్‌ స్థాయులను సమం చేస్తాయి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ సరిగ్గా పనిచేస్తే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తగ్గి, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ బ్యాలెన్స్‌ అవుతాయి. 

→ పప్పులు, శనగలు, బొబ్బర్లు.. వంటి వాటిలో బి12 ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో బి12 లోపం చాలా మందిలో కనిపిస్తుంది. ఈ పప్పులను చేర్చడం వల్ల బి12తో పాటు హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. పప్పులను ఉడికించి రోజూ ఒక కప్పు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

→ బాదంపప్పు, వాల్‌ నట్స్‌లలో మెగ్నిషియం లభిస్తుంది. నట్స్‌ అండ్‌ సీడ్స్‌ రోజూ మూడు నెలల పాటు రోజూ తీసుకుంటే హార్మోన్ల హెచ్చుతగ్గులు బ్యాలెన్స్‌ అవుతాయి. 

→ గట్‌ హెల్త్‌ని సపోర్ట్‌ చేసే పెరుగు, యోగర్ట్, మజ్జిగ.. వంటివి ఆహారంలో చేర్చాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం తగ్గడం సమస్య కూడా ఉంటుంది. థైరాయిడ్, హార్మోన్లకు సపోర్ట్‌ చేసే ఎగ్‌ లేదా టోఫూ వంటివి ఉపయోగించాలి. 

→ కల్తీ నూనెలు కాకుండా ఫ్లాక్స్‌ సీడ్, అవకాడో, ఆలివ్‌ ఆయిల్స్, స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. ఆకుకూరలు, చిలకడ దుంప, నట్స్‌ .. మెగ్నిషియం ఉండే పదార్థాలను చేర్చుకుంటే పిఎమ్‌ఎస్‌ లక్షణాలు తగ్గుతాయి. 

గింజలను పొడులు చేసి, నేరుగా తీసుకోవచ్చు. లేదంటే పెరుగు, ఓట్స్‌లో కలుపుకోవడం ద్వారా లేదంటే చిన్న చిన్న లడ్డూలు కట్టి కూడా తీసుకోవచ్చు. ఇతర జంక్‌ఫుడ్‌ తిని సీడ్‌ సైక్లింగ్‌ పాటించడం వల్ల ఉపయోగం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సీడ్‌ సైక్లింగ్‌ పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ, రోజువారి జీవనశైలి బాగుండేలా చేసుకుంటే ఇవి సాయపడతాయి. ప్రభావం వెంటనే కనిపించలేదు అనుకోకుండా 2–3 నెలల పాటు ప్రతిరోజూ వాడితే మంచి ఫలితాలు వస్తాయి. 
నిల్వ ఉండే పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ కాకుండా మన సంప్రదాయ ఆహారం ద్వారానే హార్మోన్లు బ్యాలెన్స్‌ అవుతాయి. నెలసరి సమస్యలు దరిచేరవు.

సీడ్‌ సైక్లింగ్‌
పీసీఓఎస్‌ ఫేజెస్‌ను బట్టి సీడ్‌ సైక్లింగ్‌ విధానం ఎంతో మేలు చేస్తుంది. హార్మోన్ల సపోర్ట్‌ కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. రుతుక్రమం సరిగా రాని వాళ్లకు ఈ విధానాన్ని ఆవలంబించమని నిపుణులు చెబుతుంటారు. సీడ్‌ సైక్లింగ్‌ మెథడ్‌ను రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి తిరిగి రుతుక్రమం ప్రారంభమయ్యే రోజు వరకు పాటించాలి.

పారిక్యులర్‌ ఫేజ్‌
ఇది సీడ్‌ సైక్లింగ్‌లో మొదటి ఫేజ్‌. రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి 14వ రోజు వరకు ఒక దశ. దీనిలో గుమ్మడి గింజల పొడి 1–2 టీ స్పూన్లు, అవిశ గింజల పొడి 1–2 టీ స్పూన్లు రోజూ తీసుకోవాలి. దీనివల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల పనితీరు బాగుంటుంది. నెలసరి సమస్యలు తగ్గుతాయి.

లూటియల్‌ ఫేజ్‌ 
రుతుక్రమం ఆగిపోయిన 15వ రోజు నుంచి 28వ రోజు వరకు సన్‌ఫ్లవర్‌ గింజలు, నువ్వులు ఉపయోగించాలి. సన్‌ఫ్లవర్, నువ్వులలో విటమిన్‌–ఇ ఉంటుంది కాబట్టి హార్మోన్‌ బ్యాలెన్స్‌ చేయడానికి ఉపయోగపడతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే క్రాంప్స్, యాక్నె, నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌ .. వంటివి కూడా తగ్గుతాయి. మెనోపాజ్, థైరాయిడ్‌ సమస్యలకు ఈ విధానం సరైన పరిష్కారం.

డా. సుజాతా స్టీఫెన్, న్యూట్రిషియనిస్ట్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
womens
Menstrual time
Hormonal imbalance
PCOS problem
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు

అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు

అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు

అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు

ఉమెన్‌ సివిల్‌ పవర్‌

ఉమెన్‌ సివిల్‌ పవర్‌

మహిళలకు మోసం? బాబు డ్రామాలపై జగన్ ఫైర్!

మహిళలకు మోసం? బాబు డ్రామాలపై జగన్ ఫైర్!

నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!

నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.