Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పెరటి పంటలు కొత్త పుంతలు

Family Sakshi User Sakshi Sakshi Time Apr 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BALREDDY-SHOBARANI1.jpg

గ్రామంలో ఇళ్ల మధ్యన ఖాళీ స్థలాల్లో సేంద్రియ పెరటి తోటల సాగు

పేడ ద్రావణంతో నేలకు సత్తువ, హోమియో మందులతో పురుగుల నివారణ

ఎవరైనా పట్టుదలతో పనిచేస్తే, ప్రకృతి సేద్యం సహా, ఏ రంగంలోనైనా రాణించవచ్చని రుజువు చేస్తున్నారు కందాడి బాల్‌రెడ్డి. హైదరాబాద్‌ ఐడిపిఎల్‌లో ఉద్యోగం చేస్తూ కార్మిక నేతగా పనిచేసి రిటైరైన తర్వాత ‘మలుపు ప్రచురణలు’ ప్రారంభించి సాహిత్యాన్ని ప్రజలకు అందించే పుస్తక ప్రచురణ రంగంలోనూ విజయం సాధించారు. 

ఆయన స్వస్థలం భువనగిరి పట్టణానికి 2 కి.మీ. దూరంలోని బొమ్మాయిపల్లికి మకాం మార్చిన బాల్‌రెడ్డి, శోభారాణి దంపతులు.. నాలుగేళ్లుగా మక్కువతో సేంద్రియ పెరటి తోటలు సాగు చేస్తూ స్ఫూర్తిదాయకమైన సత్ఫలితాలు సాధిస్తున్నారు. పేడ ద్రావణం, హోమియో మందులు, బ్యాటరీతో నడిచే వీడర్‌/ స్ప్రేయర్లను వాడుతున్నారుఔ 71 ఏళ్ల వయసులో సేంద్రియ సేద్యాన్ని సులభతరం చేసి సరికొత్త పుంతలు తొక్కిస్తున్న బాల్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే..!

300 గజాల మా ఇంటి పెరట్లో అంతా సున్నం నేల. మొక్క బతికేది కాదు. రెండేళ్లలో సారవంతమైంది. ఇప్పుడు పండ్ల చెట్లతో అడవిలా మారింది. మా వూళ్లో ఖాళీగా ఉన్న 250 గజాల మరో రెండు ఇంటి స్థలాలను కూడా తీసుకొని కూరగాయలు సాగు చేస్తున్నాం. ఒక స్థలంలో కాళీఫ్లవర్, క్యాబేజీ, వంగ తదితర అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలను పక్క పక్క సాళ్లలో సాగు చేస్తున్నాం. రెండో దాంట్లో అనేక రకాల 40 అరటి మొక్కలు నాటాం. 

పేడ ద్రావణం
పశువుల/మేకల ఎరువు, పచ్చిరొట్ట­తో నేలను సిద్ధంచేసి విత్తనాలు­/­మొక్కలు నాటిన తర్వా­త.. తరచుగా పేడ ద్రావ­ణం, డీకంపోజర్‌ ద్రావ­ణా­లను ఇస్తున్నాం. 200 లీటర్ల డ్రమ్ములో 10 కిలోల ఆవు పేడ, 10 లీ. మూత్రం, 2 కిలో­ల బెల్లం, 5 కిలోల చెక్క (వేరుశనగ తది­తర), లీటరు డీకంపోజర్‌ ద్రా­వణంతో పాటు డ్రమ్ము నిండుగా నీరు కలిపి.. రోజుకు రెండు సార్లు తిప్పు­తాం. 5/6 రోజుల్లో పేడ ద్రావణం రెడీ. దీనిలో మళ్లీ నీరు కలపకుండానే మొక్కలకు మొదళ్లలో పోస్తాం, వడకట్టి వారం/పది రోజులకోసారి అన్ని పంటలకూ పిచికారీ చేస్తాం. మొక్కల పెరుగుదలకు కార్బోవెజ్‌ 30 పిచికారీ చేస్తున్నాం. వీటితోనే పంటలు బలంగా పెరుగుతున్నాయి. పోషక లోపం రావటం లేదు.

హోమియో పురుగుమందులు
పంటలను పురుగులు, తెగుళ్ల బెడద నుంచి కషాయాలతో కాకుండా కేవలం హోమియో మందులతోనే కాపాడుకుంటున్నాం. కాయ­తొలిచే పచ్చ పురుగు తీవ్రత ఎక్కువగా కనిపించే కాళీ ఫ్లవర్, క్యాబేజీ, వంగ తదితర కూర­గాయ పంటలకు ‘తుజ 30’ హోమియో మందును 20 లీ. నీటికి 40 ఎం.ఎల్‌. చొప్పున కలిపి ప్రతి 5 రోజులకోసారి పిచికారీ చేస్తే అసలు పురుగే రాలేదు. 

బీర, ఆనప వంటి తీగజాతి పంటల్లో పిందె పండు­బారి రాలుతుంటే ‘బావిస్టా30’ మందును వారానికోసారి పిచి­కారీ చేస్తే సమస్య తీరింది. జామ ఆకులపై తెల్లమచ్చలు, తెల్ల­దోమల కనిపిస్తే ‘సోరినమ్‌30’ మందును 5,6 సార్లు పిచికారీ చేస్తే పోయాయి. 20 లీ. నీటికి 100 గ్రాములు ఇంగువ కలిపి మొదళ్ల దగ్గరపోసి, పిచికారీ చేస్తే శిలీంధ్ర తెగుళ్లు, వేరుకుళ్లు నియంత్రణలోకి వచ్చాయి. నా కృషికి తగిన ఫలితం దక్కింది. 

పట్టుదలతో మనసుపెట్టి మక్కువతో చేస్తే... ఎవరైనా సరే పెరట్లో సేంద్రియ కూరగాయలు సు­లువుగా పండించుకోవచ్చు. మా పెరటి తోట చూసి పక్కింటి సుగుణమ్మ (60) 125 గజాల్లో టొమాటోలు పండించి అమ్ముతున్నారు. 
సందేహాలుంటే నాకు ఫోన్‌ చెయ్యండి. నా నంబర్‌: 98665 59868. 
 

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
bal reddy
Organic Farming
Backyard garden
Homeopathic medicines
Organic farming methods
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?

సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?

Sagubadi: హోమియోతో చీడపీడలకు చెక్‌!

Sagubadi: హోమియోతో చీడపీడలకు చెక్‌!

సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ 

సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ 

కశ్మీర్‌ లోయలో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం

కశ్మీర్‌ లోయలో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం

సీతావనం 

సీతావనం 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.