Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

జెన్‌ జడ్‌.. పదం కాదు.. ఓ తరం.. ఆసక్తికర విషయాలివే..!

Family Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Genz.jpg

జెన్‌ జడ్‌ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన.. ఈ సాంకేతికను అలవర్చుకున్న.. చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్‌ అని.. అంటే జనరేషన్‌ జడ్‌ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా.. కొత్త ఆలోచనలు.. దానికి మించి.. ఆన్‌లైన్‌ సాంకేతికత.. అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్‌ జడ్‌.

ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్‌ జడ్‌ తీరు గురించి మనో వైజ్క్షానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్‌ చేద్దాం.

జన్‌ జడ్‌ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్.., "ఐ జనరేషన్".., "డిజిటల్ స్థానికులు"... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్‌ గ్రూప్‌ పిల్లలు చిన్నప్పుడే మొబైల్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు.

దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్‌ జడ్‌లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్‌ వెదకటం, చాట్‌ జీపీటీని అడగం.. లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే.. దీంతో వారి మనస్సులు.. వారి సామాజిక స్పృహ.. ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు.

జన్‌జడ్‌ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం.. కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా.. ఎక్కువగా ఆలోచిస్తారు.. చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం.. దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Zలో చాలా వరకు వ్యక్తులు  సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం.. సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం.. ఇ-కామర్స్ బ్రాండ్స్‌, డిజిటల్ కంటెంట్‌లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు.

జెన్‌ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.. భయం లేకుండా ప్రవర్తించడం.. కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని.. లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికితీయడానికి ప్రయత్నిస్తారు. జెన్‌జడ్‌ తరం మానసికంగా బలంగా ఉంటారు.. భావోద్వేగాలకు తావు లేకుండా.. బాధను వ్యక్తీకరించడం.. ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా.. వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.

ఆన్‌లైన్‌లో చర్చల ద్వారా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు.. ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన.. చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు.. వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.

వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్‌ ఎక్స్‌పోజర్.. అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం.. ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు.. కలిగి ఉంటారు.

కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ.. బలహీనత కాదు.. అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.. గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి.. కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.. తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
generation
gen z
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పవన్ కామెంట్స్ పై GEN-Z ఫైర్

పవన్ కామెంట్స్ పై GEN-Z ఫైర్

మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!

మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!

జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు

జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు

జెన్‌ జెడ్‌.. కొత్త పాఠాలు 

జెన్‌ జెడ్‌.. కొత్త పాఠాలు 

కామ్రేడ్‌.. జెన్‌ జెడ్‌

కామ్రేడ్‌.. జెన్‌ జెడ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్‌ Z ఇలా ఉ‍ందేంటి?

కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్‌ Z ఇలా ఉ‍ందేంటి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.