Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సాగుబడి: 'ఇప్ప పండు..'తో బోలెడు ఉపయోగాలు!

Family Sakshi User Sakshi Sakshi Time Jun 12, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ippa.jpg

సాగుబడి

నల్లమల అడవుల్లో ఇప్ప చెట్ల సాంద్రత తగ్గింది. ప్రస్తుతం ఈ చెట్లను నరకడంపై పూర్తి నిషేధం ఉంది. ఇప్పపై సమగ్రంగా పరిశోధించి, విలువ ఆధారిత పదార్థాలను ప్రజల చెంతకు చేకూర్చిననాడు, దీని ఉనికికి సార్ధకం చేకూర్చిన వారమవుతాం.

20 మీటర్ల ఎత్తు.. వందేళ్లు!
ఇప్ప ఉష్ణమండలంలోని ఆకులురాల్చే చెట్ల జాతుల్లో ఒకటి. నిటారుగా పెరిగేతత్వం గలది. ఇంచుమించు 16–20 మీటర్ల ఎత్తు వరకు పెరగగలదు. మాను చేవ కలిగి బలిష్ఠంగా ఉంటుంది. దీని ఆవాసం ఇండియా అని చెప్పవచ్చు. కానీ శ్రీలంక, నేపాల్, మయన్మార్‌ మొదలగు దేశాలలో కూడా ఇప్ప చెట్లు కనిపిస్తాయి.

ఎక్కువగా అడవులలో ఉన్నప్పటికీ, మైదాన ప్రాంతాల్లో కూడా విరివిగా పెరుగుతాయి. ఇండియాలో ఇంచుమించు, ఉత్తర, మధ్య, దక్షిణాది రాష్ట్రాలే కాకుండా బీహార్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషాలలోనూ ఉన్నాయి. ఒకప్పుడు నల్లమల అడవులు ఈ చెట్లకు మంచి ఆవాసంగా ఉండేది. వీటి సాంద్రత చాలా వరకు తగ్గినదనవచ్చు. వీటి జీవిత కాలం దాదాపు వంద సంవత్సరాలంటారు. కానీ పూత, కాత మాత్రం అరవై ఏళ్ల వరకు ఉండగలదంటారు. ఇప్ప బహుళ ప్రయోజనకారి. కాబట్టి దీన్ని రక్షించటం అందరి కర్తవ్యం. తెలుగు రాష్ట్రాలు ఈ చెట్టుకు పెట్టింది పేరు. దీని ఉనికి అపారమైనది.

ఇప్ప చెట్టు పేర్లు వివిధ భాషల్లో ... 
అస్సామీ: మహారువ 
ఇంగ్లీష్‌: హానిట్రీ, బట్టర్‌ ట్రీ 
ఉర్దూ: చికన్, గర్, గులు, మహువ 
ఒరియా: మహుల మహ్వా 
కన్నడ: హిప్పే, ఇప్పె 
తమిళం: ఇలుప్పయి, కట్టిరుప్పెయి 
తెలుగు: ఇప్ప, విప్ప, మధుకము 
బెంగాలీ: మౌల్, మహూయ 
మరాఠీ: మౌహ, మవద, కట్‌ – ఇల్లిపి 
మలయాళం: ఇరిప్ప, ఇలుపు 
హిందీ: మహువ, మొహవ, మొవరి, 
గిలౌడ్, గర్, వన్‌ ప్రస్త్‌ 
సంస్కృతం: మధుక, మధుకం, మోహ అని అంటారు.


ఇప్ప ఉపయోగాలు:

  • ఏ చెట్టుకూ లేని ఉపయోగాలు ఇప్ప చెట్టుకు ఉన్నాయి.

  • ఒక చెట్టు నుంచి ఏడాదికి 60–80 కిలోల గింజలు పొందవచ్చు. అదే పెద్ద చెట్టులో ఒక క్వింటాలు వరకు పూమొగ్గలను పొందవచ్చు.

  • విత్తనాలలో 30–35% వరకు నూనె ఉంటుంది.

  • విత్తనాలలో 14–16% వరకు ప్రోటీనులు ఉంటాయి.

  • విప్ప పువ్వుల నుండి తీసిన నూనె వంట కోసం ఉపయోగిస్తారు. దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

  • గింజల నుండి తీసిన నూనెను చర్మ రక్షణ తైలంగా, కీళ్ళనొప్పులకు మర్దన తైలంగా కూడా వాడుతారు. శుద్దీకరించిన నూనెను వనస్పతి, సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటి ఆమ్లాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు.

  • గిరిజనులు ఇప్ప పూల అంబలి తయారు చేసి వాడుతారు.

  • దేశవాళి సారాయి (ఇప్పసార)ని తయారీకి ఉపయోగిస్తారు. ఒక టన్ను ఇప్ప పూల నుంచి దాదాపు 400 లీటర్ల పైననే సారాయి వస్తుందని అంచనా.

  • ఇప్ప సారాను సేవిస్తే త్వరగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉంటాయని గిరిజనుల నమ్మకం.

  • ఇప్ప పూల ఔషధాలను పక్షవాతం నయం చేయటానికి ఉపయోగిస్తారు. ఇప్ప పూలతో పండ్లు తోముకుంటే దగ్గు సమస్యలను నివారించవచ్చు.

  • ఇప్ప పూల తైలానికి ఆయుర్వేదంలో మంచి విలువ ఉంది.

  • ఇప్ప పూలతో లడ్డూలు, పచ్చళ్లు తయారు చేస్తారు.

  • ఇప్ప గింజల (5.1%) నూనె నుంచి బట్టర్‌ను తయారు చేస్తారు.

  • ఇప్ప పూలను పశువులకు మేతగా వేస్తారు. పశువులు ఇష్టంగా తింటాయి.

  • ఇప్ప పండు తొక్కను తింటారు. పండు కింది పొరను పొడిచేసి కేక్‌ల తయారీకి ఉపయోగిస్తారు.

  • ఇప్ప గింజల నూనె దీపాలకు కూడా వాడుతారు.

  • నూనె తీయగా వచ్చిన చెక్కను ఎరువుగా వాడుతారు.

  • ఇప్ప ఆకులను కరువు కాలంలో పశువులు తింటాయి.

  • పూలలో ఉండే చక్కెర, విటమిన్లు, క్యాల్షియం, నూనె ఎంతో ఉపయోగకరమైనవి.

  • ఆకులను,పూలను బ్రొంకైటీస్‌కు వైద్యంలో ఉపయోగిస్తారు.


ఇప్పపూల లడ్డు..
పదార్ధాల మోతాదు:
ఇప్పపువ్వు – కిలో, మొలాసిస్‌ – 400 మిల్లీ లీటర్లు. రాగిపిండి–500 గ్రా., జీడిపప్పు– 100గ్రా., నువ్వులు 50 గ్రా., సోంపు పొడి 10 గ్రా., కొబ్బరిపొడి– 100 గ్రా., సిట్రిక్‌ ఆసిడ్‌–4 గ్రా., మెంతిపొడి–10 గ్రా., నెయ్యి 100 మీ.లీ. సొంఠి పొడి 5 గ్రా.
తయారీ విధానం:
- పొయ్యి మీద పాత్రలో మొలాసిస్‌ను 400 మి.లీ. నీళ్ళల్లో వేడి చేసి, దానికి 2 గ్రాముల సిట్రిక్‌ ఆమ్లాన్ని కలపాలి.
- అది జిగటగా మారగానే నెయ్యిలో వేయించిన రాగి పొడిని అందులో కలపాలి.
- ముందే నెయ్యిలో వేయించిన ఇప్ప పూలను అందులో కలపాలి.
- ఆ తరువాత నువ్వులు, జీడిపప్పు, శొంఠి పొడి, మెంతి పొడి, సోంపు పొడిని కలుపాలి.
- అన్నీ బాగా కలియ బెట్టాలి.
- ఈ విధంగా చిరుమంటపై ఉంచి, పైన తెలిపిన పదార్థాలన్నీ దోరగా, చిక్కగా అయిన తర్వాత మంట ఆర్పివేయాలి.
- వేడి తగ్గిన తర్వాత కొబ్బెర తురుముతో కలిపి లడ్డూల రూపం వచ్చే విధంగా గుండ్రంగా చేయాలి.
- ఈ విధంగా తయారు అయిన లడ్లు చాలా రుచిగా ఉంటాయి.
- మీరు చేసి చూడండి. ఏమైనా మార్పులు–చేర్పులు చేసి ఇంకా రుచికరంగా తయారుచేసే విధానాన్ని రూపొందించండి.


ఇప్ప కలప గట్టిది..
ఇప్ప చెట్టు కలప చాలా గట్టిది. దూలాలకు మిద్దె ర్యాప్టర్లకు, పలకలకు, ఫర్నీచర్‌ తలుపులు, కిటికీల ఫ్రేములకు, బ్రిడ్జిలు వేసేటప్పుడు సప్పోర్ట్‌ దిమ్మెలుగా, బండ్ల మణిగం, పలుగడి, పడవల చెక్కలు, ఓడల దిమ్మెలు, వ్యవసాయ పనిముట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్ప చెట్టు కలప, పూలు, కాయలు, పండ్లల్లో ఎన్నో తెలియని ఉపయోగాలున్నాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్, ఆమ్లాలను మందుల తయారీలో వాడుతారు. దీని ఉపయోగాలపై ప్రయోగాలు చేసి, ఆ విషయాలను రైతుల చెంతకు చేర్చితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. - డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
sagubadi
pantangi RamBabu
mahua tree
Fruits
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

Sagubadi: నేల వైద్యుడు జీలుగ!

Sagubadi: నేల వైద్యుడు జీలుగ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.