Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మళ్లీ మళ్లీ వస్తున్నాయి

Family Sakshi User Sakshi Sakshi Time Jan 25, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
5888.jpg

నా వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మళ్లీ మళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. డాక్టర్‌ మందులు ఇస్తే తగ్గుతుంది. కాని, కొంతకాలానికి మళ్లీ వస్తుంది. ఈ మధ్య దగ్గు వచ్చినప్పుడు లేదా బలంగా నవ్వినప్పుడు మూత్రం లీక్‌ అవుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? సరైన పరీక్షలు, చికిత్స ఏమిటో చెప్పండి.
– రాధ, అనంతపురం. 

మీకు తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, ప్రతిసారి ఒకే రకమైన మందులు వాడితే శరీరానికి అవి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో మందులు తక్కువగా పనిచేయడం, ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సారి ఇన్ఫెక్షన్‌  ఎందుకు వస్తోంది అనే కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగడం, మలబద్ధకం, దగ్గు ఎక్కువగా ఉండడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం ఇవన్నీ సమస్యను పెంచుతాయి. రోజూ సరిపడా నీరు తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. మసాలా, కారం ఎక్కువగా ఉన్న ఆహారం, చల్లని పానీయాలు, టీ, కాఫీ తగ్గించాలి. మలబద్ధకం, దగ్గు ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోవాలి.

దగ్గు లేదా నవ్వినప్పుడు మూత్రం లీక్‌ అవడం అనేది మూత్రాశయ కండరాల బలహీనత వల్ల కావచ్చు. దీనివల్ల మూత్రాశయం, మూత్రనాళం సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా మూత్రాశయంలో ఒత్తిడి ఎలా ఉంది, కండరాల పని తీరు ఎలా ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షను సాధారణంగా బయట చికిత్స విభాగంలోనే చేస్తారు. పెద్ద నొప్పి ఉండదు, అవసరమైతే మత్తు మందుతో చేస్తారు. అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. అయితే, ఈ పరీక్ష చేయడానికి ముందు ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌  లేదని నిర్ధారించాలి. 

ఒకవేళ ఇన్ఫెక్షన్‌  ఉంటే ముందుగా దానికి మందులు ఇవ్వాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా కండరాల వ్యాయామాలు, మందులు లేదా ఇతర చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మూత్రం లీక్‌ అవుతోంది అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా చేస్తే సమస్యకు సరైన చికిత్స తీసుకుని, సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు.

నా వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు. గర్భసంచి గడ్డల కారణంగా గర్భసంచి తీసివేయాలని డాక్టరు చెప్పారు. కాని, అండాశయాలను మాత్రం తీసివేయొద్దు అని అంటున్నారు. అండాశయాలు తీసివేస్తే బరువు పెరుగుతుందని కూడా చెప్పారు. ఇందులో సరైన నిర్ణయం ఏంటి?
– లలిత, శ్రీకాకుళం. 

గర్భసంచి గడ్డల వల్ల శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అండాశయాలను తీసివేయాలా లేక ఉంచాలా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి మహిళలో ఒకేలా ఉండదు. మీ వయస్సు, సమస్య స్వభావం, కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర, స్కాన్‌  నివేదికలు ఇవన్నీ చూసి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. క్యాన్సర్‌ అనుమానం ఉన్నప్పుడు, లేదా భవిష్యత్తులో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా అండాశయాలను కూడా తీసివేయాలని సూచిస్తారు. అలా చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఆపరేషన్‌  అవసరం లేకుండా ఉంటుంది. కానీ క్యాన్సర్‌ ప్రమాదం లేని పరిస్థితుల్లో, అండాశయాలను ఉంచితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అండాశయాలు ఉంచితే శరీరంలో సహజ హార్మోన్లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.

 దీని వల్ల ఒక్కసారిగా వేడి దడలు, ఎక్కువ చెమటలు, మూడ్‌ మార్పులు, డిప్రెషన్‌ , జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా కొంతవరకు తగ్గుతుంది. అండాశయాలు తీసివేస్తే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే లక్షణాలు ముందుగానే వస్తాయి. వేడి దడలు, నిద్రలేమి, తలనొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకలు పలుచబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో బరువు పెరగడం కూడా జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా జరుగుతుందనే కాదు. కొన్ని ఎంపిక చేసిన పరిస్థితుల్లో హార్మోన్‌  ప్రత్యామ్నాయ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. 

మాత్రలు లేదా ప్యాచ్‌ల రూపంలో ఈ చికిత్స ఇస్తారు. అయితే ఇది అందరికీ సరిపోదు. వైద్యుడు పూర్తిగా పరిశీలించిన తర్వాతే సూచిస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో అండాశయాలు ఉంచినా, తరువాత పొత్తికడుపు నొప్పి లేదా ఇతర సమస్యల వల్ల మళ్లీ శస్త్రచికిత్స అవసరం రావచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అండాశయాలు ఉంచడం వల్ల నొప్పి కొనసాగవచ్చు. కాబట్టి గర్భసంచి శస్త్రచికిత్స సమయంలో అండాశయాలు తీసివేయాలా వద్దా అన్న నిర్ణయం మీ వైద్యునితో పూర్తిగా చర్చించి తీసుకోవాలి. మీకు ఉన్న సమస్య, భవిష్యత్తు ప్రమాదాలు, లాభనష్టాలు అన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Urinary Problems
Urinary Tract Infection
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి

Urine Eye Wash: ప్లీజ్‌ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Urine Eye Wash: ప్లీజ్‌ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

World Kidney Cancer Day 2025 :  ఆ సమస్య తొలి సంకేతం కావచ్చు!

World Kidney Cancer Day 2025 : ఆ సమస్య తొలి సంకేతం కావచ్చు!

మూత్రంలో రక్తపు చార కనిపిస్తోందా?

మూత్రంలో రక్తపు చార కనిపిస్తోందా?

నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్‌ కాంబ్లీ

నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్‌ కాంబ్లీ

Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్‌!

Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.