Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

‘బైక్‌ పింక్‌ సర్వీస్‌': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!

Family Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
women.jpg

ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్‌ ట్యాక్సీ బుక్‌ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్‌ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్‌ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...

‘పింక్‌’ యాప్‌లో బుక్‌ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్‌’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్‌ రైళ్లు, ఎంఆర్‌టీఎస్‌ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్‌ టాక్సీ కోసం బుక్‌  చేస్తే పురుషు డ్రైవర్‌లే ఎక్కువగా వచ్చేవారు. 

వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్‌’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్‌ ట్యాక్సీ అగ్రిగేటర్‌ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్‌ పింక్‌’ను ప్రారంభించింది. ‘బైక్‌ పింక్‌ సర్వీస్‌ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్‌లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్‌లను ‘వుమెన్‌ కెప్టెన్‌’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్‌లుగా ఉపాధి పొందుతున్నారు.

అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్‌ కెప్టెన్‌. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్‌ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్‌ రైడింగ్‌ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్‌ రైడింగ్‌ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్‌ యాప్‌ను ఆఫ్‌ చేస్తుంది. 

ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్‌ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్‌ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని  పద్నాలుగు  సార్లు నా బైక్‌  బుక్‌ చేశాడు.  

అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి  సంస్థకు ఫిర్యాదు చేస్తే  తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్‌.  ‘డ్రైవింగ్‌ సమయంలో మేము అభద్రతగా ఫీల్‌ అయితే  సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే  వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్‌. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. 

‘డ్రైవర్‌ మహిళ అనే విషయం తెలియక బుక్‌ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్‌ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్‌ కెప్టెన్‌ల బండి వేగంగా దూసుకుపోతోంది.
– అస్మతీన్‌ మైదీన్, సాక్షి, చెన్నై 

(చదవండి: అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chennai
Women drivers
pink
service
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

ట్రెక్కింగ్‌ స్టార్‌ @ 52

ట్రెక్కింగ్‌ స్టార్‌ @ 52

అమ్మోనియం గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు మహిళలు మృతి

అమ్మోనియం గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు మహిళలు మృతి

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటించాల్సింది : సమంత

తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటించాల్సింది : సమంత

తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు

తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.