శరీరాన్ని ముందుకు వంచి, వెన్నెముకను ఒక వైపుకు తిప్పి చేసే భంగిమ కనుక దీనిని పరివృత్త త్రికోణాసనం అంటారు.
చేసే విధానం...
-
ముందుగా మ్యాట్‌పై తాడాసనంలో నిటారుగా నిలబడాలి.
-
రెండు కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచండి.
-
కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని సుమారు 45 డిగ్రీలు లోపలికి తిప్పండి.
-
రెండు చేతులను భుజాల స్థాయిలో చాపండి.
-
శ్వాసను బయటకు వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి.
-
ఎడమ చేతిని కుడి పాదం బయట లేదా లోపల నేలపై ఉంచండి.
-
కుడి చేతిని నిటారుగా పైకి ఎత్తి, పై చేతి వేళ్లవైపు చూడాలి.
-
వెన్నెముకను నిటారుగా ఉంచి, సాధారణ శ్వాసతో 20–30 సెకన్లు ఉండాలి.
-
శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి.
-
ఇదేవిధంగా మరోవైపున కూడా చేయాలి.
ప్రయోజనాలు...
-
బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.
-
వెన్నెముకకు మంచి ట్విస్ట్ లభించి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
-
కాళ్లు, తుంటి, హ్యామ్‌స్ట్రింగ్స్ బలపడతాయి.
-
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
-
పొత్తికడుపు అవయవాలకు మసాజ్ లభిస్తుంది.
-
నడుము భాగంలోని కొవ్వు తగ్గించే వ్యాయామాలకు సహాయకంగా ఉంటుంది.
-
శరీర సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతుంది.
-
ఛాతి విస్తరించి శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.
-
భుజాలు, నడుము బిగుతు తగ్గుతుంది.
-
పొత్తికడుపు భాగంపై మృదువైన ఒత్తిడి ఏర్పడి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
-
కండరాలు ఎక్కువగా పనిచేయడం వల్ల క్యాలరీల ఖర్చు పెరుగుతుంది.
జాగ్రత్తలు...
-
తీవ్రమైన వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ ఉన్నవారు చేయ కూడదు.
-
మెడ సమస్యలు ఉన్నవారు పైకి చూడకుండా ముందుకు చూడాలి.
-
గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు.
-
భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 3–4 గంటల విరామం ఉండాలి. శరీరాన్ని బలవంతంగా తిప్పకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే చేయాలి.
-
ప్రతి వైపు 20–30 సెకన్లు ఉండాలి.
-
2–3 రౌండ్లు సాధన చేయాలి.
- అనిత పాతర్ల, యోగా ట్రైనర్