Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పచ్చని విరులు.. ఆరోగ్యపు సిరులు..

Family Sakshi User Sakshi Sakshi Time Jul 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nursery.jpg

ప్రతి ఒక్కరూ పచ్చని ప్రకృతిని చూస్తే పరవశించిపోతారు. అలాంటి పచ్చని ప్రకృతి మన ఇంట్లోనే ఉంటే ఇటు కంటికి.. అటు ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్షాకాలం కావడంతో నగరంలో నర్సరీలు పూలు, పండ్లు, ఆయుర్వేదం మొక్కలతో అమ్మకాలకు సిద్ధమయ్యాయి. అదే తరహాలో కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలు పెంచేందుకు రంగు రంగుల కుండీలు సైతం ఆకర్షిస్తున్నాయి. హఫీజ్‌పేట డివిజన్‌ పరిధిలోని కొత్తకుంట చెరువు కట్టపై ఆర్టీసీ కాలనీ వద్ద, జాతీయ రహదారి జెనిసిస్‌ స్కూల్‌ వద్ద నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇవి మొక్కల ప్రేమికులను, కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి అమ్మకందారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా కూకట్‌పల్లిలోని హౌసింగ్‌ బోర్డులో నర్సరీలు ఏర్పాటు చేసేవారు మొక్కల అమ్మకాలకు డిమాండ్‌ ఏర్పడటంతో మియాపూర్, హఫీజ్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లోనూ విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలకు నర్సరీలే జీవనాధారం. ఈ నర్సరీల్లో 500ల రకాల వరకూ వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తారు. అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేదం, పండ్ల జాతులు అమ్మకాలకు ఉంచుతారు.  

ఇతర ఉత్పత్తులు.. 
మొక్కల పెంపకానికి కావాల్సిన వివిధ రకాల మోడళ్లలో రంగు రంగుల కుండీలు, సేంద్రీయ ఎరువులు, వర్మీ కంపోస్టు, కోకోపిట్, ఆయుర్వేదం, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలకు కావాల్సిన పురుగు మందులు, ఇళ్లలోకి కీటకాలను నివారించే మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పాటు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసే లాన్‌ కూడా సప్లై చేస్తున్నారు. కుండీలు రూ.20 నుంచి రూ.350 వరకూ అమ్ముతున్నారు. 

పూల మొక్కలకు గిరాకీ.. 
గులాబీ, చామంతి, మందారం, అలంకరణ పూలు వంటివి సుమారు 300 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌ అండ్‌ అవుట్‌ డోర్‌ మొక్కలు, తులసిలో లక్ష్మీ, కృష్ణ, శివుడి పూజకు బిల్వపత్రం, శంకం పూలు, పారిజాతం, ఉసిరి, జమ్మి వంటి మొక్కలు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో రూ.30 నుంచి రూ.350 వరకూ ధరల్లో విక్రయిస్తున్నారు. 

ఆయుర్వేదం, పండ్ల మొక్కలు.. 
వివిధ రకాల రోగాలను నియంత్రించడంలో ఉపయోగపడే ఆయుర్వేదం మొక్కలైన తులసి, కలబంద, నల్లేరు, రణపాల, గరిక, తిప్పతీగ, మారేడు మొక్కలతోపాటు పండ్ల మొక్కలైన సపోట, దానిమ్మ, జామ, మామిడి, అంగూర్, నిమ్మ తదితర హైబ్రిడ్‌ మొక్కలు అలరిస్తున్నాయి. దోమలను నివారించే లెమన్‌ గ్రాస్, లావెండర్, పుదీన, సిటోన్రెల్లా వంటి అనేక మొక్కలు ఉన్నాయి. 

నర్సరీ ఏర్పాటు సంతోషకరం..
కొత్తకుంట చెరువు కట్టపై నర్సరీ ఏర్పాటు సంతోషకరం.. కాలనీ వాసులు ఇష్టానుసారం చెత్త వేస్తున్న నేపథ్యంలో అదే స్థలంలో మొక్కలు పెంచడం మంచిపరిణామం. చెరువు నీరు మొక్కల ఎదుగుదలకు ఉపయోగం. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. 
– సురేష్‌ మదీనాగూడ
ఆయుర్వేద మొక్కలకు గిరాకీ.. 
ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఆయుర్వేద మొక్కలకు గిరాకీ పెరిగింది. దీంతో పాటు కీటకాలను నివారించే కొన్ని రగకాల గడ్డిజాతి మొక్కలకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. 
– రాజు, నర్సరీ నిర్వాహకుడు  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nursery
Hyderabad
Kadiam
rajamundhry
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.