Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అద్భుతం.. డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం

Family Sakshi User Sakshi Sakshi Time Apr 21, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Dichpally-Ramalayam.jpg

శతాబ్దాల చరిత్రకు, కళాచాతుర్యానికి, అపురూపమైన శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. నిజామాబాద్‌ జిల్లా (Nizamabad District) డిచ్‌పల్లి మండలం డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం. ఈ ఆలయం క్రీ.శ. 16 వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. డిచ్‌పల్లి గ్రామానికి చివర సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాల మీద ద్రావిడుల సంప్రదాయం కనిపిస్తుంది. ఈ దేవాలయం విజయనగర రాజుల శిల్పకళా రీతిని చూపుతోంది. పదహారో  శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో దీనిని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. మరికొందరు.. ఈ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో నిర్మితం కావచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ కట్టడాన్ని వైష్ణవులు నిర్మించారా?.. శైవులు నిర్మించారా? అన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదు. కాకతీయుల కాలంలోనే వైష్ణవులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని మరికొందరి అభిప్రాయం. గర్భగుడి వద్ద ఉన్న ముఖ ద్వారాలను పరిశీలిస్తే కాళీమాత విగ్రహాలు కనిపిస్తాయి. దీంతో ఈ గుడి శైవులకు సంబంధించిందనే భావన కలుగుతుంది.

ఆలయ గోడలపై గజకేసరి (ఏనుగుపై దాడి చేస్తున్న సింహం) చిత్రాలు మలచబడి ఉన్నాయి. విజయనగర రాజులు, కాకతీయ రాజ్యాన్ని స్వాధీన పరచుకున్నామని చాటడానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించి గజకేసరి విగ్రహాలను చెక్కించారన్నది చరిత్రకారుల అభిప్రాయం.  

డిచ్‌పల్లి రామాలయంలో 1947 వరకు ఎలాంటి విగ్రహాలు ఉండేవి కావు. గ్రామ సర్పంచ్‌ గజవాడ చిన్నయ్య గుప్తా అప్పట్లో రాజస్తాన్‌ నుంచి శ్రీ రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలను తెప్పించి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అప్పటి నుంచి ఈ చారిత్రక శిల్పకళా నిలయం రామాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ  మూల విగ్రహాలను ఇతర దేవాలయాల్లా కాకుండా ఉప పీఠంపై ప్రతిష్టించారు. గర్భగుడి మధ్యలో ఎత్తయిన రాతి సింహాసనం ఉంది. సింహాసనం ఎడమ భాగాన మూల విగ్రహాలను ప్రతిష్టించక ముందు నుంచి.. రెండు విగ్రహాలు ప్రతిష్ఠించడానికి అనువుగా నిర్ధారిత పరిమాణంలో రెండు సాంచలు (రంధ్రాలు) చేసి ఉన్నాయి.  

మొదట్లో దేవాలయం చేరడానికి మెట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. తర్వాత కాలంలో దేవాలయం చేరుకోవడానికి 125 మెట్లు నిర్మించారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. 1971 వరకు డిచ్‌పల్లి సర్పంచ్‌గా పని చేసిన గజవాడ చిన్నయ్య ఆలయం అభివృద్ధికి విశేష కృషి చేశారు. నిత్య నైవేద్యం, పూజలు చేయడానికి అర్చకుడిని ఏర్పాటు చేశారు. అర్చకుడి కుటుంబ జీవనోపాధికి రెండు ఎకరాల భూమిని దేవాలయం పేరిట ఏర్పాటు చేశారు.


ఏటా రెండుసార్లు కల్యాణోత్సవాలు.. 
ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి పాడ్యమి వరకు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. త్రయోదశి రోజు శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీసీతారామస్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇలా ఏటా రెండుసార్లు స్వామి వారి కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆలయం దక్షిణ దిక్కున సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. చెరువు మధ్యలో మండపం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  


రాతి కట్టడం.. 
ఆలయం చుట్టూ చక్కగా మలచిన రాతి స్తంభాలు ఉన్నాయి. స్తంభాల పీఠభాగాలు రెండున్నర మీటర్ల చుట్టు కొలతను కలిగి ఉంటాయి. దేవాలయం నిర్మాణం చాలా వరకు నల్లరాయితోనే చేశారు. ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అప్పట్లో గోపురం ఉండేది కాదు. కొద్ది సంవత్సరాల క్రితం సిమెంట్‌తో గోపురం నిర్మించారు. నిజామాబాద్‌ జిల్లాలోనే ఈ ఆలయానికి శిల్పకళలో అగ్రస్థానం లభిస్తుంది.  


గిచ్చు బొమ్మలు..  
ఈ ఆలయం గోడలపై గిచ్చు (శృంగార) బొమ్మలు చెక్కి ఉన్నాయి. గతంలో నిజాం రాజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని వర్తమానం రాగా, ఆయన ఈ బొమ్మలను చూసి ఎలా స్పందిస్తారోనని స్థానికులు వీటిపై సిమెంట్‌ పూశారు. అయితే పూర్వీకులు ఏ ఉద్దేశంతో వీటిని చెక్కారో తెలియదని, వాటిని అలాగే ఉంచాలని నిజాం రాజు ఆదేశించడంతో సిమెంట్‌ను తొలగించారు.


అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యం 
ఆలయంపై గజకేసరి శిల్పాలతో పాటు ఇతర శిల్ప కళ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. నాట్యమాడుతున్న నెమళ్లు, పోట్లాడుతున్న జింకలు, పడగ విప్పిన నాగరాజు, విష్ణువు దశావతారాలు, ఐదు తలల ఆవు, తాబేలు (Tortoise) ఆకారం ఇలా పలు చిత్రాలు కనువిందు చేస్తాయి.


ఆలయం పక్కనే చెరువు.. మధ్యలో మండపం 
డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం (Dichpally Ramalayam) పక్కనే విశాలమైన చెరువు.. చెరువు మధ్యలో రాతి మండపం ఉన్నాయి. వేసవి కాలంలో చెరువులో నీళ్లు తగ్గిపోయిన తర్వాత.. ఈ రాతి మండపంలో అప్పటి కళాకారుల నృత్య ప్రదర్శనలు జరిగేవని పూరీ్వకులు తెలిపారు. రామాలయం నుంచి మండపానికి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయానికి వెళ్లడానికి సొరంగాలు ఉండేవని ప్రస్తుతం వాటిని మూసివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి కృషితో.. ఆలయ పర్యాటకంలో భాగంగా చెరువులో బోటింగ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టనుంది.

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం ఫొటోల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ramalayam
Dichpally
Nizambad District
Devotion
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శతక నీతి: త్యాగం!

శతక నీతి: త్యాగం!

అంతఃశక్తి... అంతులేని బలం

అంతఃశక్తి... అంతులేని బలం

కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?

కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?

ముహర్రం నెల అల్లాహ్‌ మాసం..

ముహర్రం నెల అల్లాహ్‌ మాసం..

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..

పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.