Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

నేమ్‌ ప్లేట్‌: ఇంటిపేరు ఆడపిల్ల

Family Sakshi User Sakshi Sakshi Time Feb 18, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
names.jpg

మన దేశంలో ఇంటి పేరు, ఇంటి వాకిలి పేరు నాన్నదే ఉంటుంది. అమ్మ పేరు దాదాపుగా ఉండదు. కూతురి పేరు అసలే కనిపించదు. కూతురూ ఇంటి సభ్యురాలే అనే భావన ఆమెకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అబ్బాయిల వైఖరిలో మార్పు తెస్తుంది. అందుకే నార్త్‌లో చాలాచోట్ల  కుమార్తె నేమ్‌ప్లేట్‌ పెట్టే ఆనవాయితీ మొదలైంది. ఇటీవల నాగ్‌పూర్‌ చుట్టుపక్క పల్లెల్లో 2100 ఇళ్లకు అమ్మాయిల పేర్లు సగౌరవంగా అమర్చారు. ఇంకా ఈ ఆనవాయితీ దక్షణాదికి రాలేదు. వివరాలు

మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో అన్నట్టుగా ఎందుకు ఉండాలి... వారు తమ అస్తిత్వంతో ఎందుకు ఉండకూడదు.. ఆత్మవిశ్వాసంతో ఎందుకు ఉండకూడదు... గుర్తింపుతో ఎందుకు ఉండకూడదు... ఈ ప్రశ్నలు‘మేజిక్‌ బస్‌ ఫౌండేషన్‌’ బా«ధ్యురాలు ధనశ్రీ బ్రహ్మేకు వచ్చాయి. ఐక్యరాజ్య సమితిలో చాలా కాలం పని చేశాక భారతదేశంలో పారిశ్రామికప్రాంతాల్లోని బస్తీల్లో, వెనుకబడిన పల్లెల్లో లైంగిక వివక్షను రూపుమాపి టీనేజ్‌ ఆడపిల్లల వికాసానికి కృషి చేయాలని ధనశ్రీ ‘మేజిక్‌ బస్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు. ఆడపిల్ల తను ఎదిగే వయసులో వెనుకబడితే జీవితాంతం వెనుకబడుతుందని ఆమెకు ఆత్మవిశ్వాసం అవసరమని భావించారు. అందుకే ‘నేమ్స్‌ ఆన్‌ డోర్స్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆడపిల్ల గురించి ఆలోచించరు
మన దేశంలో ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటేప్రాముఖ్యత అంతా అబ్బాయికే ఉంటుంది. అమ్మాయిని మామూలు బడిలో... అబ్బాయిని మంచి బడిలో వేయడం, సౌకర్యాలు, చదువు కొనసాగింపు... ఇవన్నీ అమ్మాయి పట్ల వివక్షను చూపుతాయి. బడి మాన్పించి పెళ్లి చేసే బెడద ఎలాగూ ఉంటుంది. ఆస్తిలో భాగం గురించిన ఆలోచన ఉండదు. వీటన్నింటి దృష్ట్యా పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోవడం తప్ప ఆడపిల్ల వికాసం సంపూర్ణం కాదు. ‘నేనూ ఇంటిలో సమాజంలో భాగమే. నాకంటూ ఒక స్థానం ఉంది. నా బాధ్యతలు నాకున్నా నాకంటూ కొన్ని కలలు ఉంటాయి అని అమ్మాయిలకు అనిపించాలి’ అంటారు ధనశ్రీ.  ‘ఇంటికి అమ్మాయి నేమ్‌ప్లేట్‌ పెడితే కొద్ది మార్పు సాధ్యమే’ అనుకున్నారామె.

ఎందుకు పెట్టాలి?
మహారాష్ట్రలోని నాగపూర్‌ శివార్లలో ఉన్న కలమేశ్వర్‌ పారిశ్రామిక వాడను ఆనుకుని 108 గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటిలో రోజు కూలీలు, కార్మికులే ఉంటారు. వీరికి ఆదాయం చాలా తక్కువ. అందువల్ల ఆర్థిక దృష్టికోణంలో అబ్బాయికి ఇచ్చేప్రాధాన్యం అమ్మాయికి ఇవ్వరు. అందుకే అమ్మాయిలు తెర వెనుకే ఉండిపోతారు. వారికి ఆత్మవిశ్వాసం కల్పించేందుకు 12 నుంచి 16 ఏళ్లు వయసున్న అందరు అమ్మాయిల డేటా తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి మీ అమ్మాయి నేమ్‌ప్లేట్‌ ఇంటికి పెట్టండి అని ఫౌండేషన్‌ కార్యకర్తలు అడిగితే అందరి నుంచి ఎదురైన ప్రశ్న ‘ఎందుకు పెట్టాలి’ అని. ఎందుకంటే ఇంటికి నేమ్‌ప్లేట్‌ తండ్రిదే ఉంటుంది. లేదంటే కొడుకుది. కూతురిది ఉండదు. ‘అయితే ఇంటికి కూతురు కూడా హక్కుదారని... ఆమె పెరిగే ఇంటికి ఆమె పేరు పెట్టుకునే హక్కు ఉంటుందని కార్యకర్తలు గట్టిగా చెప్తారు’ అని తెలిపారు ధనశ్రీ. అంతేకాదు ఊరి పెద్దలతో, పంచాయితీ పెద్దలతో, స్కూలు టీచర్లతో చెప్పించి ఒప్పించారు.

పెనుమార్పు
కలమేశ్వర్‌ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో 12 నుంచి 16 ఏళ్లు ఉన్న ప్రతి అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్‌ తయారు చేయించి వాటిని ఇంటి వాకిలికి అమర్చే ఏర్పాటు చేశాక ఆడపిల్లల్లో వచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇదో కొత్త గుర్తింపు గౌరవం అయ్యింది. ‘మా అన్నయ్య నాతో నీ పేరు ఎందుకు పెట్టాలి అనడిగాడు... నీ పేరు నువ్వు పెద్దయ్యాక నీ ఇంటికి ఎలాగూ పెట్టుకుంటావు... ఇప్పుడు నా పేరు పెట్టకపోతే ఎక్కడా ఎప్పుడూ పెట్టరు అని సమాధానం ఇచ్చాను’ అని 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అంది. ఈ 18 పల్లెల్లో 2100 గడపలకు అమ్మాయిల నేమ్‌ప్లేట్లు ఇవాళ కళకళలాడుతూ కనపడుతున్నాయి. ‘ఈ నేమ్‌ప్లేట్లు పెట్టాక తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలని, మా మాటకు విలువ ఇవ్వాలని, మాకూ గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు’ అన్నారు అమ్మాయిలంతా. ‘చుట్టుపక్కల పల్లెల వాళ్లు ఈ పల్లెలకు వచ్చి నేమ్‌ప్లేట్లు చూసి మేమూ పెట్టిస్తాం అని వెళుతున్నారు’ అని వారు తెలిపారు. 
అదే అమ్మాయి... కాని ఒక చిన్న గుర్తింపుతో అడుగున నిలబడే దశ నుంచి సమాన దశకు వచ్చి నిలబడేలా చేసింది ఈ నేమ్‌ప్లేట్‌.
దక్షిణాదిలో ఇవాళ్టికీ జరుగుతున్న కొన్ని వివక్షలను గమనిస్తే ‘నేమ్స్‌ ఆన్‌ డోర్స్‌’ ఎక్కువ అవసరం అని భావించడంలో తప్పు లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
nagpur
Doors
daughters
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ

నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ

మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో నీట్‌ సెంటర్‌

మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో నీట్‌ సెంటర్‌

ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!

ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!

షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!

500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!

ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం

ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.