Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అమ్మ చేసిన బొమ్మలు

Family Sakshi User Sakshi Sakshi Time May 30, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tara.jpg

కూతురు ఆడుకోవడానికి అమ్మ చేసిన బొమ్మల ఆలోచన ఇప్పుడు నెలకు రూ. 2 లక్షల వ్యాపారం చేసేలా ఎదిగింది. కూతురికి ఉల్లాసాన్నిచ్చే ఒక సాధారణ ఆలోచన నుండి వీణా పీటర్‌ ‘తారాస్‌ డాల్‌ హౌస్‌’ పేరుతో బెంగళూరులో ఒక ప్రసిద్ధ బ్రాండ్‌గా మారింది. ప్లాస్టిక్‌ బొమ్మల ప్రపంచం నుంచి పిల్లలకు ఆలోచనాత్మక, పర్యావరణ హితమైన బొమ్మలను అందిస్తూ తల్లులకు ప్రేరణగా నిలిచింది.  రెండేళ్ల క్రితం 30 బొమ్మలతో మొదలుపెట్టిన వీణా పీటర్‌ బిజినెస్‌ ప్రయాణం మనల్నీ తన వెంట తీసుకెళుతుంది.

‘‘ముందస్తు వ్యాపార ప్రణాళిక లేదు, ఓ పేరూ లేదు, ధరల వ్యూహం అసలే లేదు. చేతితో తయారు చేసిన, పాతకాలం నాటి వస్తువులను అమ్మే ఓ మార్కెట్‌లో మొదటిసారి నా బొమ్మల  ధరలను నిర్ణయించాను. ప్లాస్టిక్‌తో నిండిన పిల్లల బొమ్మల ప్రపంచంలో ఆలోచనాత్మకమైన, సున్నితమైన ప్రత్యామ్నాయమిది. చెన్నైలో మాస్టర్స్‌ చేసిన తర్వాత కార్పొరేట్‌ కంపెనీలలో దశాబ్దం పాటు ఉద్యోగినిగా కొనసాగాను. కానీ 2015లో నెక్ట్స్‌ ఏంటి అనే ఆలోచన నన్ను కుదురుగా ఉండనిచ్చేది కాదు. నా మార్గాన్ని వెతుకుతూనే నా భర్త ఎడ్యుకేషనల్‌ స్టార్టప్‌లో సాయం చేయడం ప్రారంభించాను.  

డిజిటల్‌ లోకం నుంచి డాల్‌ హౌస్‌కు...
నా కూతురు తారా పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. డిజిటల్‌ లోకం నుంచి తప్పుకున్నాను. నా కూతురుతో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకున్నాను. తారా పెరిగేకొద్దీ, బొమ్మల పట్ల ఆమెకు ప్రేమ పెరగడం గమనించాను. అయితే ఆమె ఆడుకునే బొమ్మల ఎంపిక నాకు ఇబ్బందిగా అనిపించేది. అన్నీ ప్లాస్టిక్, సింథటిక్‌ బొమ్మలు. పైగా అవి ఎక్కువ కాలం ఉండేవి కావు. పర్యావరణ అనుకూలమైనవి అసలే కావు. తారా నా జుట్టును చేత్తో పట్టుకొని పడుకునేది. ఆ అలవాటును ఎలా పోగొట్టాలో తెలిసేది కాదు. ఓ రాత్రిపూట జుట్టున్న బొమ్మను కొంటే..? అనే ఆలోచన వచ్చింది. దాని కోసం చాలా స్టోర్స్‌ వెతికాను. కానీ, అవన్నీ నాణ్యత లేనివి. నేనే ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను.  

వాడిన ఫ్యాబ్రిక్‌తో బొమ్మ
మా అమ్మ పాత కాటన్‌ చీరలను ఉపయోగించి మొదటి బొమ్మను తయారు చేశాను. ఉన్ని దారాలతో జుట్టు కుట్టాను. తర్వాత మరికొన్నింటిని అలాగే కుట్టాను. తారాకు ఆ బొమ్మలు బాగా నచ్చాయి. మా ఫ్రెండ్స్‌ వాటిని చూసి, తమ పిల్లలకు కూడా అలాంటి బొమ్మలను తయారు చేసిమ్మన్నారు. దీంతో ఇది నా వ్యక్తిగతప్రాజెక్ట్‌గాప్రారంభమైంది. ఓ 30 బొమ్మలను తయారు చేశాను. వాటికి ధర ఎలా నిర్ణయించాలో తెలియలేదు. హస్తకళాకృతులు అమ్మే వీకెండ్‌ మార్కెట్‌కు వాటిని తీసుకెళ్లి, అక్కడ ప్రదర్శనకు పెట్టా. ఈవెంట్‌ అయ్యేలోపు బొమ్మలన్నీ అమ్ముడయ్యాయి. దీంతో నమ్మకం వచ్చేసింది. అలా నా కూతురి పేరుతోనే ‘తారాస్‌ డాల్‌ హౌస్‌’ పుట్టింది.

బొమ్మల తయారీ కళను నేర్చుకోవడం
2023ప్రారంభంలో మొదలుపెట్టిన ఈ వ్యాపారం కొన్ని నెలల వ్యవధిలో నెమ్మదిగా ఊపందుకుంది.  ముందుగా ముడి బొమ్మలను తయారుచేయడాన్ని బాగా అధ్యయనం చేశాను. ప్రతి బొమ్మను కాటన్‌ పై ఒక ట్రేస్డ్‌ ప్యాటర్న్‌ తోప్రారంభించి, కత్తిరించి, అవుట్‌ లైన్ల వెంట కుట్టి,. తర్వాత దానిని లోపలి వైపుకు తిప్పి, కాటన్‌–పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్‌తో నింపుతాను. దానివల్ల ఇది ఒకసారి ఉతికిన తర్వాత కూడా ముడుచుకుపోదు. బొమ్మల ముఖాలను ఫాబ్రిక్‌ మార్కర్లతో గీసి, విడిగా డ్రెస్సులు కుట్టి ఇస్తాను. పిల్లల చేతే బొమ్మలకు ఆ డ్రెస్సులు వేయిస్తే, వారికి సరదాగా ఉంటుంది. మొదట్లో ఈ పనిని ఒక్కదాన్నే చేసేదాన్ని. డిమాండ్‌ పెరిగేకొద్దీ, మరో ముగ్గురిని నియమించుకున్నాను.  

ఒకేసారి 100 బొమ్మలు
బొమ్మల తయారీలో అసెంబ్లింగ్‌ విధానాన్ని రూ΄÷ందించాను. మొదట్లో ఒక బొమ్మకు రెండు రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఒక రోజులో 100 బొమ్మలను తయారు చేస్తున్నాం. బొమ్మలతో పాటు వాటికి వేసే నైట్‌ సూట్లు, గౌన్లు, సాంప్రదాయ దుస్తులు వంటి వివిధ రకాల దుస్తులను కూడా డిజైన్‌ చేస్తాం. మిగిలిపోయిన అతి చిన్న బట్టలను బొమ్మల పడకలు, దిండ్లు, ఇతర ఉపకరణాలలో తిరిగి ఉపయోగిస్తాం. ఏదీ వృథా కాదు.  పిల్లలు ఈ బొమ్మలతో ఆటలో నిమగ్నమవ్వడం మాకు అతిపెద్ద బహుమతి. పిల్లలు బొమ్మలను కౌగిలించుకోవడం, వాటికి పేర్లు పెట్టడం వంటి ఫోటోలను చూసినప్పుడు అది నా బాధ్యతను మరింత గుర్తు చేసినట్లవుతుంది.  
ప్రతి బొమ్మకు మోడర్న్, ట్రెడిషనల్‌ రెండు డ్రెస్‌ డిజైన్లు చేసి ఇస్తాం. ఒక చిన్నారి పంజాబీ ఇంటి నుండి వచ్చినట్లయితే, ఆ బొమ్మకు ఘాగ్రా ఉంటుంది. దక్షిణ భారతదేశ పిల్లలకు లంగా వోణి ఎంపిక కావచ్చు. చిన్న డిజైన్ లకు ధర రూ.500, అదనపు దుస్తులతో వచ్చే 12 అంగుళాల బొమ్మకు రూ. 1,000, వార్డ్‌రోబ్, పరుపులతో పూర్తి చేసిన డీలక్స్‌ డాల్‌హౌస్‌ సెట్‌లకు రూ. 3,500 వరకు ధరలు ఉన్నాయి. కుట్టుపని చేసిన మొదటి రోజు నాటి నుండి ఇప్పుడు నెలకు 200 బొమ్మలు అమ్మే వరకు, తారాస్‌ డాల్‌ హౌస్‌ నెలకు రూ. 2 లక్షల ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారంగా ఎదగడం చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది’’ అని తన బొమ్మల ప్రయాణాన్ని మురిపంగా వివరించింది వీణ.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
veena
bangalore
toys
making
Handmade
dolls
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రూ. 50 రైడ్‌కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్‌ ఘరానా దందా

రూ. 50 రైడ్‌కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్‌ ఘరానా దందా

సీక్రెట్‌ పెళ్లి, ఫస్ట్‌ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!

సీక్రెట్‌ పెళ్లి, ఫస్ట్‌ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!

స్నాక్‌ సెంటర్‌: నోరూరించే.. వెరైటీ వంటకాలు!

స్నాక్‌ సెంటర్‌: నోరూరించే.. వెరైటీ వంటకాలు!

ఫ్రమ్‌ నూడుల్స్‌ టు పేపర్‌..!

ఫ్రమ్‌ నూడుల్స్‌ టు పేపర్‌..!

40ల తరువాత అల్ట్రామారథాన్‌ : తృటిలో తప్పిన ముప్పు

40ల తరువాత అల్ట్రామారథాన్‌ : తృటిలో తప్పిన ముప్పు

సిటీలో ఆటో గ్యాస్‌ బంద్‌

సిటీలో ఆటో గ్యాస్‌ బంద్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.