Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మిస్టర్‌ వరల్డ్‌ పోటీలు: మిస్టర్‌ గ్లో..మిస్టర్‌ స్లో..

Family Sakshi User Sakshi Sakshi Time Jun 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mister_0.jpg

అందాల ప్రపంచంలో అతివలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. పురుషులకూ అంతే ప్రాధాన్యత ఉంది. మోడలింగ్‌ కావచ్చు, గ్లామర్, సినీ రంగాల్లో రాణించాలనుకునే యువతికైనా, యువకుడికైనా బ్యూటీ కాంటెస్ట్‌లు చక్కని ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తాయి. అయితే మహిళల అందాల పోటీలు రోజురోజుకూ విస్తరిస్తుంటే మగవాళ్ల అందాల పోటీల విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. భాగ్యనగరంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు సందడిగా ముగిసిన నేపథ్యంలో మిస్టర్‌ వరల్డ్‌ పోటీలను సిటీ మోడలింగ్‌ రంగం గుర్తు చేసుకుంటోంది. 

ప్రపంచ సుందరి పోటీలు ఎంత పాపులరో, ప్రపంచ సుందరాంగుడు పోటీలు అంత తక్కువ పాపులర్‌ అని చెప్పొచ్చు. మిస్‌ వరల్డ్‌ పోటీలను 1951లో ప్రారంభిస్తే.. చాలా ఆలస్యంగా.. 45ఏళ్ల తర్వాత 1996లో మిస్టర్‌ వరల్డ్‌ పోటీలను ఎరిక్‌ మోర్లే ప్రారంభించారు. అందం, శారీరక సామర్థ్యం, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని బట్టి పురుషులను విజేతలుగా ఎంపిక చేసే ఈ పోటీ లండన్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మిస్‌ వరల్డ్‌ పోటీలకు సారథ్యం వహిస్తున్న జూలియా మోర్లేనే ఈ పోటీలకు సైతం అధ్యక్షురాలిగా ఉన్నారు. 

మూడు దశాబ్దాల్లో.. పదకొండు సార్లు.. 
మిస్‌ వరల్డ్‌ పోటీల్లానే.. ఏటా నిర్వహించాలని ప్రారంభంలో అనుకున్నా.. స్పందనను బట్టి ఈ పోటీలను నిర్ణిత వ్యవధి అనేది లేకుండా నిర్వహిస్తున్నారు. తొలిసారి 1996లో బెల్జియం వాసి టామ్‌ నుయెన్స్‌ ఈ పోటీలో గెలుపొందగా, 1998లో వెనిజువెలా వాసి సాండ్రో ఫినోగ్లియో, 2000లో ఉరుగ్వే వాసి ఇగ్నాసియో క్లిచె, 2003లో బ్రెజిల్‌ వాసి గుస్తావో గియానెట్టి, 2007లో జువాన్‌ స్పెయిన్‌ కు చెందిన గార్సియా పోస్టిగో, 2010లో ఐర్లాండ్‌కు చెందిన కమాల్‌ ఇబ్రహీం, 2012లో కొలంబియా నివాసి ఫ్రాన్సిస్కో ఎస్కోబార్, 2014లో డెన్మార్క్‌ నుంచి నిక్లాస్‌ పెడర్సెన్, 2016లో మొదటి ఆసియన్‌ విజేతగా భారత్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్‌వాల్, 2019లో ఇంగ్లాండ్‌ వాసి జాక్‌ హెసెల్‌వుడ్‌ గెలుపొందారు. చివరి సారిగా 2024లో ఈ పోటీ నవంబర్‌ 23న వియత్నాంలోని ఫాన్‌ థియెట్‌లో జరిగింది. డానియెల్‌ మేజియా మిస్టర్‌ వరల్డ్‌ పోటీలో, స్పోర్ట్స్‌ టాలెంట్‌ విభాగాల్లో విజేతగా నిలిచారు. అతను 60 మంది ఇతర పోటీదారులతో పోటీపడి, మొదటి స్థానం దక్కించుకున్నారు. 

వివిధ విభాగాల్లో.. 
మిస్టర్‌ వరల్డ్‌ పోటీలో పాల్గొనేవారు వివిధ విభాగాల్లో పోటీ పడతారు, వారి శారీరక సామర్థ్యం పరీక్షించడానికి స్పోర్ట్స్‌ ఛాలెంజ్, ప్రతిభను ప్రదర్శించే టాలెంట్‌ రౌండ్, సామాజిక మాధ్యమాల్లో పట్టును చూపించే మల్టీమీడియా, వ్యక్తిగత శైలి ఫ్యాషన్‌ సెన్స్‌ చూపే ఫ్యాషన్‌ రౌండ్‌.. ఈ పోటీలు పాల్గొనేవారి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రూపొందించారు. 

ఇండియాకు టైటిల్‌ తెచ్చిన నగరవాసి..
2016లో, రోహిత్‌ ఖండేల్వాల్‌ మిస్టర్‌ వరల్డ్‌ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు, ఆసియన్‌ కూడా. ఈ పోటీ జులై 19, 2016న ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగింది. రోహిత్, మిస్టర్‌ వరల్డ్‌ మల్టీమీడియా అవార్డు కూడా గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే రోహిత్‌ ఖండేల్వాల్‌ నగరానికి చెందిన యువకుడు కావడం. 

ఈ నేపథ్యంలో మిస్టర్‌ వరల్డ్‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి మన హైదరాబాద్‌ పూర్తిగా సరైన ఎంపిక అని పలువురు నగర మోడల్స్‌ అభిప్రాయపడుతున్నారు. మిస్‌ వరల్డ్‌ లాగే మిస్టర్‌ వరల్డ్‌ పోటీదారులు కూడా హైదరాబాద్‌ నగరంలో సందడి చేస్తారేమో వేచి చూద్దాం..   

(చదవండి: మిస్‌ యూనివర్స్‌ సన్నాహకం..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
beauty competition
Male
Hyderabad Vibes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పురుషుల ప్రైవేట్‌ పార్ట్స్‌పై ప్రేలాపనలు : సేజల్‌ పవార్‌కు భారీ షాక్‌

పురుషుల ప్రైవేట్‌ పార్ట్స్‌పై ప్రేలాపనలు : సేజల్‌ పవార్‌కు భారీ షాక్‌

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

కేరళలో కొత్త ట్రెండ్.. పురుష ప్రయాణికుల అవస్థలు

కేరళలో కొత్త ట్రెండ్.. పురుష ప్రయాణికుల అవస్థలు

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.