Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అమ్మ సినిమాలు వాస్తవం తెలిపాయి

Family Sakshi User Sakshi Sakshi Time Nov 8, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
zohran-mamdani-with-parents.jpg

న్యూస్‌మేకర్‌

ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక అమ్మ ఉంటుంది. న్యూయార్క్‌ మేయర్‌గా గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్‌ మమ్దానీ తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు. ‘మా అమ్మ మీరా నాయర్‌ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి’ అన్నారాయన. మీరా నాయర్‌ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు.

‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అంటుంటారు. ఇప్పుడు కాస్త మార్చి ‘న్యూయార్క్‌కు మేయర్‌ అయినా..అమ్మకు కొడుకే’ అనాలేమో. అవును! 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్‌ మహా నగరానికి   మేయర్‌గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా జోహ్రాన్‌ మమ్దానీ (34)  తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్‌ను కూడా వార్తలలోకి ఎక్కించారు. 

మేయర్‌గా గెలిచినందుకు మమ్దానీ ఎంత గర్వపడుతున్నారో అతణ్ణి చూసి మీరా నాయర్‌ కూడా అంతే గర్వపడుతున్నారు. మమ్దానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా. సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు. ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా.  

‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’
న్యూయార్క్‌ మేయర్‌ ఎలక్షన్‌ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మమ్దానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్‌గా అనిపించవచ్చు. కాని అతని గెలుపు సినిమాటిక్‌ కాదు. మమ్దాని ఇచ్చిన నినాదం ‘న్యూయార్క్‌ వలసవాదుల నగరంగానే ఉంటుంది’ అనేది యాదృచ్చికంగా రాలేదు. తల్లి మీరా నాయర్‌ సినిమాల ప్రభావంతో అంది పుచ్చుకున్నది. 

మీరా నాయర్‌ తీసిన ‘సలాం బాంబే’, ‘మిసిసిపి మసాలా’ పరాయి దేశాల్లో, పరాయి నగరాల్లో తమ స్థాయి, స్థానం కోసం పెనుగులాడే వలసజీవుల కథలు. ‘మీరు మావాళ్లు కాదు వెళ్లిపోండి’ అంటే మానవ పరిణామక్రమం, వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే. అందుకే మమ్దాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు. అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా, అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మమ్దాని హామీ ఇవ్వడం మీరా నాయర్‌ ప్రభావమే. యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్‌లలో పని చేసేవారు మమ్దాని. స్వతహాగా అతను రాప్‌ సింగర్‌ కూడా.

వాస్తవ ప్రపంచం
‘అమ్మ సినిమాలు చూడటం అంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే’ అంటారు మమ్దాని. వాస్తవికవాద సినిమాలనే మీరానాయర్‌ తీశారు. ఆమె తీసిన ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్‌’ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే, ‘నేమ్‌సేక్‌’ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది. మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది. 

అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు, ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు, అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మమ్దాని ఏ న్యూయార్క్‌ నగరానికైతే మేయర్‌ అయ్యారో అదే నగరంపై జరిగిన 9/11 దాడి నేపథ్యంలో మీరానాయర్‌ ‘ది రిలక్టెంట్‌ ఫండమెంటలిస్ట్‌’ సినిమా తీశారు. తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం, వ్యక్తిత్వం, సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశా నిర్దేశం చేసిందంటారు మమ్దాని. తండ్రి మహమూద్‌ మమ్దానీ కొలంబియా యూనివర్సిటీలో ్ర΄÷ఫెసర్‌ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జొహ్రాన్‌ మమ్దానీకి లాభించింది.

మమ్దాని సలహా– మీరా ‘ది నేమ్‌సేక్‌’
తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్‌ అంటారు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. ‘ది నేమ్‌సేక్‌’ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో ‘హ్యారీ పోటర్‌–4’కు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్, ప్రపంచ ప్రఖ్యాత నవల, బోలెడంత డబ్బు, పేరు. కానీ అప్పటికే ‘ది నేమ్‌సేక్‌’ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మమ్దానీకి 14 ఏళ్లు. ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా, ’అమ్మా! హ్యారీ పోటర్‌  తీయడానికి చాలామంది దర్శకులున్నారు. కానీ ‘ది నేమ్‌సేక్‌’ సినిమా నువ్వే తీయగలవు’ అని చె΄్పాడు. అది చాలా స్వేచ్ఛాయుతమైన, స్పష్టమైన ప్రకటన అని, అందుకే తాను ‘హ్యారీపోటర్‌’ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు. 
 

‘నేను ముగింపును నమ్మను, ప్రారంభాలను నమ్ముతాను.‘ అంటారు మీరా నాయర్‌. ఆ లెక్కన మమ్దానీకి ఇది ప్రారంభం. మేయర్‌గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి. ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
USA
New York City
mayor
Zohran Mamdani
Mira Nair
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.