Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సాఫ్ట్‌వేర్‌.. కేరాఫ్‌ హైదరాబాద్‌..

Family Sakshi User Sakshi Sakshi Time Jan 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1212.jpg

నగరంలో విస్తరిస్తున్న మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు 

దేశంలోని మిగిలిన సిటీల కన్నా మన దగ్గరే అధికం 

అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ సహా మరెన్నో ఏర్పాటు 

త్వరలోనే నగరానికి సమీపంలో ఏఐ డేటా సెంటర్‌

దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1990లో,  దేశంలో తన మొదటి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుండి విండోస్‌ సృష్టికర్త, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరిస్తోంది. నగరంతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, కోల్‌కతా, ముంబై, పూణేతో సహా 10 నగరాల్లో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపుగా సగం మంది నగరంలోనే ఉండడం గమనార్హం. ఐటీ ఉద్యోగాలు, కార్యకలాపాలపైనే ఈ కథనం.. 

ఉద్యోగుల సంఖ్యలో మాత్రమే కాదు, హైదరాబాద్‌ చాలా కాలంగా మైక్రోసాఫ్ట్‌ ఇష్టపడే నగరంగా ముందంజలో ఉంది. నగరంలో మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం 1998లో  ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ) స్థాపనతో ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాకు ఆవల మైక్రోసాఫ్ట్‌కి ఉన్న అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఏదంటే.. అది 54 ఎకరాలలో  విస్తరించిన ఐడీసీ హైదరాబాద్‌ మాత్రమే.  

అడ్వాంటేజ్‌ తెలంగాణ ఒప్పందం.. 
తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ గత ఏడాది జరిగిన తెలంగాణ గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌లో  అడ్వాంటేజ్‌ తెలంగాణను ప్రారంభిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రోగ్రామ్‌ 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తన విస్తరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు భారత పర్యటనలో భాగంగా ఇటీవలే  హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన, జనరేటివ్‌ ఏఐ, క్లౌడ్‌ డెవలప్‌మెంట్‌తో సహా రాష్ట్ర సాంకేతిక ప్రాధాన్యతలపై చర్చించారు. ఏడాది వ్యవధిలో  భారత్‌కు ఆయన రావడం ఇది వరుసగా రెండోసారి. దేశంలోని మొదటి మైక్రోసాఫ్ట్‌ తన ఓపెన్‌ ఏఐ కార్యాలయాన్ని కూడా నగరంలోనే  ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.

మేకగూడలోనూ మైక్రోసాఫ్ట్‌.. 
మైక్రోసాఫ్ట్‌ తన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి నగరాన్ని కేంద్రంగా మార్చుకుంది. దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌లను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇటీవల నగరానికి సమీపంలోని మేకగూడలో  181.25 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గత సంవత్సరం, కూడా నగరంలో దాదాపు 267 కోట్ల రూపాయలతో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రదేశాల్లో కొత్త డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది.

అనుకూల వాతావరణం.. 
మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే నగరంలో, పూణెలో నిర్వహిస్తున్న రెండు డేటా సెంటర్లలో ప్రస్తుతం 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2026 చివరి నాటికి ఈ సంఖ్య 289 మంది కావచ్చని సమాచారం. ‘హైదరాబాద్, పూణేలలో ఐటీకి మంచి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధాన వాతావరణాలు ఉన్నాయి. అలాగే డేటా సెంటర్‌ పెట్టుబడులకు అనువుగా ఉండే టాలెంట్‌ కారిడార్‌లకు ఇవి సమీపంలో ఉన్నాయి’ అని అనరాక్‌లోని ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్‌ డేటా సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దేవి శంకర్‌ అంటున్నారు. ఇటీవలి తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్‌ ఏఐ చీఫ్‌ ముస్తఫా సులేమాన్‌ బెంగళూరు హైదరాబాద్‌ కార్యకలాపాలు తమ కంపెనీకి బలం అని పేర్కొన్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
working
soft
Corner
Hyderabad Vibes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

వారానికి 4 రోజులే పని.. భారత్‌లో త్వరలో సాకారమయ్యే ఛాన్స్

వారానికి 4 రోజులే పని.. భారత్‌లో త్వరలో సాకారమయ్యే ఛాన్స్

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.