Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్‌ చేస్తే కోటీశ్వరుడుగా

Family Sakshi User Sakshi Sakshi Time Jul 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ravikishanshukla-successstory.jpg

MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్‌ చేస్తే సూపర్ స్టార్‌ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది.  కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్‌..పోతాయ్‌.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని  నిరూపించిన  నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్‌ స్టోరీ గురించి తెలుసుకుందామా..!

రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు  రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla)  (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి  ఇంట్లో  పుట్టాడు.   కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం.  చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది  తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది.  ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు.  దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద  తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్‌ చేస్తేప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి పార్లమెంటు, లోక్‌సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.

1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్‌పురి  సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  2003లో  వచ్చిన సయ్యా హమార్ బ్లాక్‌బస్టర్‌గా  నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్‌గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్‌పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు.  అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే  అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్‌.

1993లో  ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు,  ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్‌ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.

రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్‌కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు  రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి  లగ్జరీ కార్లున్నాయి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ravi Kishan
mumbai
Success Story
Bhojpuri Actor
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!

ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!

గొర్రెల కాపరి నుంచి దేశ నాయకుడు..

గొర్రెల కాపరి నుంచి దేశ నాయకుడు..

వీక్లీ పోల్‌లో బీటీఎస్‌ ప్రభంజనం..

వీక్లీ పోల్‌లో బీటీఎస్‌ ప్రభంజనం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.