Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అభాగ్యులకు అమ్మలా..

Family Sakshi User Sakshi Sakshi Time Jan 16, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
444.jpg

రోడ్లపక్కన జీవిస్తున్న శరణార్థులను చేరదీస్తూ.. 

మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం కల్పిస్తూ.. 

అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తూ..

తల్లిలా సేవలందిస్తున్న ‘మాతృదేవోభవ’ సంస్థ

మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు, అనాథలకు అండగా నిలుస్తోంది.. ఏ చిరునామా లేని అభ్యాగులకు ఓ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.. రుచికరమైన భోజనం వడ్డించడంతో పాటు దుస్తులు, పడుకునేందుకు మంచం, దుప్పటి వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.. తమకు ఎవరూ లేరనే బాధ నుంచి అక్కడ ఉన్నవారంతా తమవారే అన్న భరోసా ఇస్తోంది.. కుల మత, భాషా బేధాలతో సంబంధం లేకుండా అభాగ్యులందరినీ చేరదీస్తోంది. అంతేకాదు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ మానసిక దివ్యాంగుల ఆశ్రమం.  
– బడంగ్‌పేట్‌

ఒక్కరితో 2018లో ప్రారంభమైన ఈ ఆశ్రమ సేవలు ప్రస్తుతం 150 మందికి చేరుకున్నాయి. మధ్య వయసులో మతి స్థిమితం కోల్పోయి.. జుట్టు, గడ్డాలు, మీసాలు పెరిగి గుర్తుపట్టలేని స్థితిలో అర్ధనగ్నంగా వీధుల్లో సంచరిస్తున్న వారితో పాటు నగరంలోని ప్రధాన రోడ్ల వెంట, డ్రైనేజీలు, చెత్త డబ్బాల పక్కన దీనంగా పడి ఉన్న అనాథలను ఆశ్రమానికి తరలిస్తున్నారు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కోలుకున్న వారిని తిరిగి ఇళ్లకు పంపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 280 మందికి పునర్జన్మను ప్రసాదించారు. ఆశ్రమ సేవలు గుర్తించిన సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి వారు కూడా అభాగ్యులకు సేవలు అందిస్తుండటం విశేషం. పండగలు, పర్వదినాలు, పుట్టిన రోజులు ఇలా అన్ని సందర్భాల్లోనూ వారు భాగస్వాములు అవుతున్నారు.

‘ఈయన పేరు డి.శివుడు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామం. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి.. ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఊరే కాదు చివరకు జిల్లా సరిహద్దులు దాటుకుని చివరకు ఉప్పల్‌ చేరుకున్నాడు. రోడ్డు వెంట అనాథగా తిరుగుతున్న ఆయనను మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించి వైద్యం అందించారు. కోలుకున్న తర్వాత బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ వృద్ధాప్యంతో మంచం పట్టిన తల్లికి సపర్యలు చేస్తున్నాడు’   

అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు 
 ఏదైనా ప్రమాదాల్లో చనిపోయిన అనాథ శవాలనే కాకుండా ఆశ్రమంలో ఉంటూ వృద్ధాప్యం, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారికి ఆయా మతాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమ యాత్రలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకుడు గిరితో పాటు అతడి భార్య ఇందిర, అమ్మ ముత్తమ్మ, కొడుకు అభిరాం, కూతురు లోహిత ఆ నలుగురిలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 60 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సేవలను గుర్తించిన పలు సంస్థలు గిరిని గౌరవ డాక్టరేట్‌తో పాటు 300 అవార్డులతో సత్కరించాయి.   

నాడు
‘చిత్రంలోని ఈయన పేరు కావూరి నాగభూషణం. పశి్చమగోదావరి జిల్లా పొలమూరు మండలం నాగిళ్లదిబ్బ గ్రామం. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి బంజారాహిల్స్‌ చేరుకున్నాడు. చినిగిన దుస్తులు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ.. తిరుగుతూ కని్పంచాడు. మాతృదేవోభవ ఆశ్రమం నిర్వాహకులు ఆయనను చేరదీసి, ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా.. ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆయన్ను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం సొంత ఊరిలో రెండు ఆవులను చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు’  
నేడు 

నాడు

‘చిత్రంలో కనిపిస్తున్న ఇతడి పేరు వట్టేం రమేష్‌. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం, శివపురం గ్రామం. నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరకు నగరానికి చేరుకున్నాడు. మాతృదేవోభవ అనాథ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి ఆశ్రమం కల్పించారు. అతడికి మెరుగైన చికిత్సతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడంతో నాలుగేళ్లకు ఆరోగ్యం కుదుటపడింది. కుటుంబ వివరాలు తెలుసుకుని, చివరకు వారికి అప్పగించారు. ప్రస్తుతం సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు’

నేడు 

కొంత స్థలం కేటాయించాలి 
శాశ్వత భవనం లేకపోవడంతో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక షెడ్లు వేసి, వాటిలో వసతి కలి్పస్తున్నాం. స్థలం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందిస్తాం. ఆశ్రమంలో ఉన్న వాళ్లకు వృద్ధాప్య పెన్షన్‌ సహా ఆరోగ్యశ్రీకార్డు, రేషన్‌ బియ్యం ఉచితంగా 
అందజేయాలి.  
– గట్టు గిరి, ‘మాతృదేవోభవ’ఆశ్రమ వ్యవస్థాపకుడు 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ashramam
Hyderabad Vibes
matrudevobava
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

లెట్స్‌ సింగ్‌..ఫుల్‌ స్వింగ్‌..!

సంవత్సరాంతంలో..  సుస్వరాల హేల..!

సంవత్సరాంతంలో.. సుస్వరాల హేల..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.