Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ముసుగు వేయొద్దు మనసు మీద

Family Sakshi User Sakshi Sakshi Time Jan 4, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mask.jpg

మాస్కింగ్‌

‘వాళ్లతో కష్టం లేండి’ అంటుంటారు... ఉన్నదున్నట్టుగా మాట్లాడేవాళ్లను ఉద్దేశించి. సమాజంలో ‘ముసుగు’ వేసుకుని ఉండటం అవసరం. ఇష్టం ఉన్నా లేకున్నా  అనుకూల వైఖరితో వ్యవహరిస్తే యాక్సెప్టెన్స్‌ ఉంటుంది. ఇది పురుషాధిపత్య సమాజం. అందుకే స్త్రీలు ఇంటా, బయట తమకు నచ్చినా నచ్చకపోయినా ‘మనసుకు ముసుగు వేసి’ లోన దుఃఖం ఉన్నా పైకి నవ్వుతూ కనిపించాలి. ఇది ఒక మేరకు మంచిదే అయినా కాలక్రమంలో మనసుకు వొత్తిడి తప్పదంటున్నారు మానసిక నిపుణులు.

చిన్నప్పుడు గుర్తు చేసుకోండి. ఏదైనా నచ్చక ఏడిస్తే పెద్దవాళ్లు తిడతారు. అల్లరి చేస్తే తిడతారు. బంధువులు వచ్చినప్పుడు చనువుగా ఉంటే తిడతారు. లేకపోయినా తిడతారు. దీన్నిబట్టి ‘మెదడు’కు అందే సజెషన్‌ ఏమిటి? నువ్వు నీలా కాదు... ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటమే బెటర్‌ అని. ఆడపిల్లకైతే ఇలా భావాలను లోపల దాచుకోవడం చిన్నప్పటి నుంచే నేర్పుతారు. ఇదే పెరిగి పెద్దదయ్యే కొద్దీ స్వభావంగా మారుతుంది. 

లోక రీతికి తగినట్టుగా, కామన్‌సెన్స్‌తో కొన్ని మనసులో దాచుకొని వ్యవహరించడం ప్రతి ఒక్కరూ చేసేదే. అయితే వ్యక్తిగతానికి వచ్చినప్పుడు... లేదా కుటుంబపరంగా, సామాజికంగా ఒక విషయంపై లోపల ఒక విధంగా ఉన్నా పైకి మరో విధంగా వ్యవహరించాల్సి వస్తే దానిని ‘మాస్కింగ్‌’ అంటారు సైకాలజీ పరిభాషలో. అంటే ముసుగు వేయడం.

పురుషులు తమ లోపల ఉన్న అసూయ, భయం, పిరికితనం, కోపం, అయిష్టాలను పైకి కనిపించనీయకుండా ముసుగు వేస్తారు నిజమే కానీ వారి కంటే స్త్రీలు ఈ విషయాలను ఎక్కువగా దాచుకొని మసలాల్సి వస్తుందని మానసిక శాస్త్ర పరిశోధనల్లో తేలింది. చదువు, పెళ్లి, కాపురం, ఉద్యోగం, స్నేహితులు, బంధువులు, ఆర్థికం... ఇలా అనేక విషయాల్లో స్త్రీలు తమ లోపల ఉన్న భావాలను దాచుకుని ముసుగు వేసుకొని బతుకుతారని, దానికి కారణం ఆ భావాలు బయటకు వెల్లడి చేస్తే మేలు కన్నా కీడు అధికమని అనుకోవడమే. ఇంత ఆధునిక కాలంలో కూడా ‘ఇష్టం లేని పెళ్లి వద్దు’ అని చెప్పే వీలు ఆడపిల్లలకు ఎంతమందికి ఉంది? వద్దని చెప్పినా ఉపయోగం ఉండదని మనసు మీద ముసుగు వేస్తారు.

పరిస్థితులను గట్టెక్కించడానికి ఇలా ‘ముసుగులు వేసుకోవడం’ కొంతవరకూ మంచిదే కాని సుదీర్ఘ కాలం ఇదే వైఖరి కొనసాగితే స్త్రీలలో మానసిక జడత్వం వచ్చే అవకాశం ఉందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆడవాళ్లు మేధో ఆలోచనలు, అత్యద్భుతమైన తెలివితేటలతో పుట్టినా అవన్నీ ఈ ముసుగు వేసే స్వభావం వల్ల సన్నగిల్లుతాయని ఒక రకంగా ‘అన్‌రికగ్నైజ్డ్‌ ఆటిజమ్‌’కు లోనవుతారని అంటున్నారు. అంతేకాక విపరీతమైన అలసట, స్వయంగా ఆపాదించుకునే అనారోగ్యాలు వీరిని బాధిస్తాయట.

మంచీ ఉంది.. చెడూ ఉంది
పిల్లలు లోకం మెచ్చే వైఖరులతో పెరగాలని తల్లిదండ్రులు భావిస్తారు. కొత్త ఆలోచనలు, ప్రయోగాలు, ఇష్టాలు మనసులో ఉన్నా పిల్లలు మాస్క్‌ వేసుకొని, సమాజం ముందు తల్లిదండ్రులకు నచ్చినట్టుగా వ్యవహరించడం మొదలు పెట్టి మెల్లగా ఆ పరిధిలోనే ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఆనందాన్ని ముఖానికి పులుముకుంటే నష్టమేమీ లేదు కదా అని వీరి వాదన. అయితే ఈ ‘మాస్కింగ్‌’ అలవాటైతే కొంతకాలానికి మనిషి రెండు రకాల జీవితాలను జీవించాల్సి వస్తుందని సైకియాట్రిస్టులు అంటున్నారు. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియనంతగా వారు ‘మాస్కింగ్‌’కు అలవాటు పడతారని, ఇది దీర్ఘకాలిక మానసిక సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

ముసుగు వెయ్యకుండా బతికితే...
ఎవరిని వారు ప్రేమించుకొని, గౌరవించుకుంటే ఈ మాస్కింగ్‌ అవసరమే లేదని నిపుణుల మాట. తమలో లేని గుణాల గురించి ఆలోచించడం మానేసి, ఉన్న గుణాల్లో మంచివాటిని మరింత మెరుగుపరుచుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం చేస్తే ముసుగులు వేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే నేర్పాలని అంటున్నారు. సమాజాన్నో, మరెవరినో ఇంప్రెస్‌ చేసేందుకు ముసుగులు వేసుకోవడం మొదలుపెడితే చివరకు మన అసలు ముఖం మరుగునపడి, కనిపించకుండా పోతుందని అంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
mask
Mental stress
Mental health problems
common sense
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రూరల్‌ టీనేజర్లకు టెన్షన్‌

రూరల్‌ టీనేజర్లకు టెన్షన్‌

ఇస్మార్ట్ స్లీప్... హాయి హాయిగా

ఇస్మార్ట్ స్లీప్... హాయి హాయిగా

నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!

నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!

యువతలో మానసిక అనారోగ్యం!

యువతలో మానసిక అనారోగ్యం!

చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య

చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య

మనసు బాగుంటే..మెరుపు గ్యారంటీ!

మనసు బాగుంటే..మెరుపు గ్యారంటీ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.