Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

థైరాయిడ్‌కు.. సేతు బంధాసనం

Family Sakshi User Sakshi Sakshi Time Feb 15, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
setu-bandhasana.jpg

మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా సాధారణంగా కనిపించే సమస్య థైరాయిడ్‌. ఈ సమస్యను సహజంగా నియంత్రించడంలో సేతు బంధాసన (Setu Bandhasana) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘సేతు’ అంటే వంతెన, ‘బంధ’ అంటే బంధించడం.. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉండి, గొంతు, మెడ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల థైరాయిడ్‌ గ్రంథికి రక్త ప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల విడుదల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఛాతీ తెరుచుకోవడం వల్ల శ్వాస లోతుగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.

ఉపయోగాలు..
థైరాయిడ్‌ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది. 
హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. 
మెటబాలిజం మెరుగై, రువు పెరుగుదల తగ్గుతుంది. 
గొంతు, మెడ ప్రాంతం బలపడుతుంది. 
అలసట, నిద్రలేమి తగ్గుతాయి. 
ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. 
ఎండోక్రైన్‌ సిస్టమ్‌ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.  
వెన్ను, నడుము నొప్పులకు ఒక వరం.

జాగ్రత్తలు.. 
మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు ఉన్నవారు డాక్టర్, యోగా గురువు సలహాతో చేయాలి. 
గర్భధారణ సమయంలో ఈ ఆసనం చెయ్యొద్దు. 
తీవ్రమైన నడుము నొప్పి లేదా స్లిప్‌ డిస్క్‌ ఉన్నవారు చెయ్యకపోడం మంచిది.

చేసే విధానం..
స్టెప్‌ 1: ముందుగా వెల్లకిలా (వెనుక భాగం వెనుకకు ఆనించి) పడుకోవాలి.
స్టెప్‌ 2: రెండు మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై నడుముకు దగ్గరగా ఉంచాలి. చేతులను శరీరానికి పక్కన, అరచేతులు నేలను తాకుతూ ఉండాలి.
స్టెప్‌ స్టెప్‌ 3: గాలి పీల్చుకుంటూ, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.
స్టెప్‌ 4: భుజాలను, చేతులను, పాదాలను బలంగా నేలపై ఆనించి, మీ ఛాతిని గడ్డం వైపు తీసుకురావాలి. ఈ స్థితిలో 15–30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండాలి.
స్టెప్‌ 5: శ్వాస విడిచే సమయంలో నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నెముకను నేలపైకి తీసుకువచ్చి, విశ్రాంతి తీసుకోవాలి.

– పాతర్ల అనిత, యోగాట్రైనర్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Thyroid
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అకస్మాత్తుగా బరువు తగ్గారా? గుండె దడ పెరుగుతోందా?

అకస్మాత్తుగా బరువు తగ్గారా? గుండె దడ పెరుగుతోందా?

గాయిటర్‌ అంటే...? లక్షణాలు, చికిత్స!

గాయిటర్‌ అంటే...? లక్షణాలు, చికిత్స!

అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?

అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?

World thyroid day 2024 : థైరాయిడ్‌ గురించి తెలుసుకోవడం  చాలా ముఖ్యం

World thyroid day 2024 : థైరాయిడ్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం

థైరాయిడ్‌ ఉంటే అన్నం తినకూడదా?

థైరాయిడ్‌ ఉంటే అన్నం తినకూడదా?

ఆ పాఠమే చెప్పకపోయి ఉంటే..ఆ స్టూడెంట్‌ ప్రాణాలు..!

ఆ పాఠమే చెప్పకపోయి ఉంటే..ఆ స్టూడెంట్‌ ప్రాణాలు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.