Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సానుకూల దృక్పథం

Family Sakshi User Sakshi Sakshi Time May 27, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-1408703103.jpg

మంచిమాట

అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు. 

రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు.     

ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి. 
కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి. 

ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.

ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు.

 ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్‌ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి. 

సంతోషం, ఆనందం  బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు.  

– డా. ఎన్‌. అనంత లక్ష్మి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
positive attitude
Life
difficult
Habit
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

ప్రయాణంలో సరైన బ్యాగ్‌ ఎంపిక..

ప్రయాణంలో సరైన బ్యాగ్‌ ఎంపిక..

బొంగరపు ఆట నేర్పే జీవిత‌ సత్యాలు!

బొంగరపు ఆట నేర్పే జీవిత‌ సత్యాలు!

సత్యమే శివం.... సుందరం

సత్యమే శివం.... సుందరం

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?

చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు

చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.