Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అవరోధాలనే అవకాశాలుగా..!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ram11.jpg

మానవ జీవిత  గమనంలో గమ్యం చేరుకునే దారిలో  అవరోధాలు ఏర్పడటం సహజం. సష్టిలో ఏ ఇద్దరికీ జీవనప్రయాణం ఒకేలా సాగదు. ఏకోదరులకు కూడా ఒకేరకంగా జీవనప్రయాణం ఉండదు. భౌతిక ప్రపంచంలో కష్టాలు మనుషుల్ని బలహీన పరుస్తాయి. కానీ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి అవరోధమూ మన సహనం, విశ్వాసం, అంతర్గతశక్తిని పరీక్షించడానికి దైవం కల్పించిన గొప్ప అవకాశం. 

పురాణ ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలిస్తే పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు, కైకేయికి తండ్రి దశరథమహారాజు ఇచ్చిన వరాల కారణంగా అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. పదునాలుగేండ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. అది శ్రీరాముని జీవితంలో పెద్ద అవరోధం. కానీ స్థితప్రజ్ఞత కలిగిన రాముడు దీనినొక అవకాశంగా చేసుకున్నాడు. 

ధర్మాన్ని కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు. పితృవాక్య పరి΄ాలకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అరణ్యంలోనూ రాముని జీవనం సజావుగా సాగలేదు. సీతాపహరణం తీవ్ర అవరోధంగా పరిణమించింది. అయితే ఈ అవరోధమే  కోదండరామునికి కొత్త సహచరులను పరిచయం చేసింది. వానర, సుగ్రీవ, హనుమ వంటి వీరులతో మైత్రి ఏర్పరిచింది. రావణసంహారం గావించాడు. అసుర చెరనుండి అయోనిజ ని విడిపించాడు. పురుషోత్తమ రాముడయ్యాడు.

సుందరకాండను పరిశీలిస్తే సీతమ్మ జాడకై వెళ్లిన పవనసుతునికి లంకలో అవమానం ఎదురైంది. అసురులు తన తోకకు నిప్పంటించారు. ఈ అవరోధాన్ని ఆంజనేయుడు అవకాశంగా మార్చుకున్నాడు. శత్రుశక్తిని ఆయుధంగా మలిచాడు. మండుతున్న తోకతో మొత్తం లంకానగరాన్ని దహనం చేసాడు. 

అటు మహాభారతంలో ద్యూతక్రీడలో కౌరవులపై ఓటమి చెందిన పాండవులు అరణ్యవాసం, ఆపై అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ అవరోధనా కాలాన్ని, పాండవులు అవకాశంగా మరల్చుకున్నారు. వారు నేర్చుకున్న విద్యలనూ, అభ్యసించిన శాస్త్రాలనూ, ఆయుధవిద్యలో ప్రావీణ్యం సంపాదించుకునే దిశలో వినియోగించుకున్నారు. తమ వీరత్వాన్ని చాటారు.

భాగవతంలో ప్రహ్లాదుడు ఎదుర్కొన్న అవరోధం అసాధారణం. తండ్రి హిరణ్యకశిపుడే శత్రువుగా మారాడు. నిప్పులో వేయించడం, ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి తోయించడం వంటివి అవరోధాలు. కానీ ప్రహ్లాదుడు ఈ అవరోధాలన్నింటినీ తన భక్తిని మరింత దృఢం చేసుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా అతని మనస్సు ఆ పరమాత్మ స్మరణ నుండి తొలగలేదు. అంతిమంగా ఆ పీడనమే నృసింహ అవతార రూపంలో భగవంతుని సాక్షాత్కారానికి దారితీసింది. ఇక్కడ అవరోధం ప్రహ్లాదునికి మోక్ష సాధన మార్గమైంది.

ధ్రువుడు చిన్న వయసులోనే సవతి తల్లి చేతిలో తీవ్ర అవమానాన్ని చవి చూశాడు. ఈ చేదు అనుభవం అతనికి అవరోధం. ఈ అవరోధమే అతణ్ణి మహా భక్తునిగా మార్చింది. నారద మహర్షి మార్గ దర్శకత్వంలో ధ్రువుడు కఠిన తపస్సు చేశాడు. చివరికి మహా విష్ణువు ప్రత్యక్షమై  ధ్రువుని అచంచల భక్తిని సదా జ్వలించే ధ్రువ నక్షత్రంగా స్థాపించాడు. అవమానం అనే అవరోధం విశ్వనక్షత్రమనే అవకాశం గా మారింది.

పురాణాలన్నీ బోధించేది ఒక్కటే. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అవరోధమూ మన ఆత్మశక్తిని, భగవంతునిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. కష్టాలు, సవాళ్లు అనేవి మనల్ని దిగజార్చడానికి కాక  మన అంతరంగం లో నిగూఢమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడానికి, మనల్ని ఉన్నత ఆధ్యాత్మికస్థితికి చేర్చడానికి తోడ్పడతాయి. 

కాబట్టి అవరోధాలను చూసి భయపడకుండా దానిని ఒక ఆశీర్వాదంగా భావించి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వికాసం ఉన్నచోట ఆటంకం కూడా అవకాశంగా కొత్తరూపు  ఏర్పడుతుంది. అదే విజయానికి పునాది అవుతుంది.ఓటమి విజయానికి గెలుపు అనుకుంటే అవరోధమేమే అవకాశానికి తలుపు అవుతుంది.ఆధ్యాత్మిక సాధనతోనే ఇది సాధ్యమవుతుంది. 
– కె.వి.లక్ష్మణరావు 

(చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై.)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
problem
Devotion
opportunities
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శతక నీతి: త్యాగం!

శతక నీతి: త్యాగం!

అంతఃశక్తి... అంతులేని బలం

అంతఃశక్తి... అంతులేని బలం

కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?

కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?

ముహర్రం నెల అల్లాహ్‌ మాసం..

ముహర్రం నెల అల్లాహ్‌ మాసం..

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..

పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.