Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

కడపుబ్బా నవ్వించే డాక్టర్‌! ఇలా కూడా ఆరోగ్య సూచనలు ఇవ్వొచ్చా?

Family Sakshi User Sakshi Sakshi Time Jan 2, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
US-Doctor-Proved-His-Youtube-Videos.jpg

నవ్వు ఆరోగ్యానికి మంచిది అని అంటుంటారు. మనస్పూర్తిగా నవ్వేవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని కూడా అంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అనేది తప్పని, చాలా రోగాలకు చిరునవ్వు చక్కటి ఔషధం అని విన్నాం. అయితే అది ఎలాగే ప్రూవ్‌ చేసి చూపిస్తున్నాడు ఓ వైద్యుడు. ఏ డాక్టర్‌ చేయని రీతీలో రోగులకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తూనే కామెడీ షో నిర్వహిస్తున్నాడు. వారందర్నీ కడుపుబ్బా నవ్వేలా చేసి ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాడు. అంతేగాదు ఆయన కామెడీ షో వీడియోలను యోట్యూబ్‌లో ఉన్న  క్రేజ్‌ వింటే ఆశ్చర్యపోతారు.  ఆ వైద్యుడు  వైద్యలందరికంటే విభిన్నంగా ఈ జర్నీని ఎలా ఎంచుకున్నాడో తెలుసుకుందామా!

కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ పాల్‌గా పిలిచే పళనియప్పన్‌ మాణిక్కమ్‌ నాన్‌ గవర్నమెంట్‌ ఆర్గనైజషన్‌ కోసం ఆరోగ్యానికి సంబంధించిన కామెడీ వీడియోలను చేశారు. అ తర్వాత అదే తన ప్రోఫెషన్‌గా మార్చుకున్నాడు. అందుకు ప్రధాన కారణం 2020లో వచిన​ కరోనా మహమ్మారి. ఆ టైంలో లాక్‌డౌన్‌లతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ధైర్య చెప్పేలా యూట్యూబ్‌లో ఈ కామెడీ వీడియోలు చేయడం నుంచి మొదలైంది ఆయన జర్నీ. అలా ఆయన తన వీడియోల్లో హాస్యాన్ని జోడిస్తు బరువు తగ్గడం, ఉపవాసం చేయడం తదితర చక్కటి ఆరోగ్య విషయాలను వివరించేవారు.

దీంతో అతని వీడియోలకు భారీ ఫాలోయింగ్‌ రావడం మొదలైంది. ఆయన తొలి వీడియో క్లిప్‌ ఏకంగా ఐదు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇన్‌స్టాగ్రాంలో అయితే మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'మెడ్‌కామ్‌' అనే యూట్యూబ్‌​ ఛానెల్‌లో తన వీడియోలను పోస్ట్‌ చేస్తుంటాడు. అందులో వైద్య సమాచారంతో కూడిన కామెడీ షో ఉంటుంది. అందులో హేమోరాయిడ్స్, అనోరెక్టల్ సమస్యలు, పెద్దప్రేగు పెద్దప్రేగు క్యాన్సర్ గురించి వైద్యుడు పాల్‌ మాట్లాడతారు. ఆ అనారోగ్య సమస్యలను తదదైన శైలిలో సామాన్య రోగికి కూడా అర్థమయ్యేలా చెబుతాడు. ఇక్కడ రోగి భయపడడు కాదుగదా! ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు.

అందువల్లే అతని వీడియోలకు ఇంత క్రేజ్‌ అని చెప్పొచ్చు. ఇక్కడ డాక్టర్‌ పాల్‌ యూఎస్‌లో వైద్యుడిగా చేస్తున్న టైంలో ఏకంగా 110 కిలోల బరువు ఉండేవాడు. గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయోమోనని భయపడేవాడు. అసలు వైద్యుడిగా నేనే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించి తాను చికిత్స అందించే రోగులకు చెబితేనే దాని ప్రభావం ఉంటుందని గ్రహించాడు. చాలామంది రోగులకు బరువుతగ్గాలని, వ్యాయామాలు చేయాలని సూచిస్తామే గానీ వైద్యులే ముందుగా ఇవేమీ చేయరని అన్నారు. ఇలా పాల్‌ ముందుగా తనాఉ చక్కటి జీవనశైలిని అవలంభించి ఆ తర్వాత తన వీడియోలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాడు.

గుండెకు స్టంట్‌ వేయించుకుంటే సరిపోదు, బరువు పెరగకుండా చూసుకోవడమూ చాల ముఖ్యం అని అంటున్నారు వైద్యుడు పాల్‌. ఆయన తన వీడియోల్లో చాల వరకు ప్రతి ఆరోగ్య సమస్యకు ఇప్పటి వరకు శాశ్వత నివారణ లేదని చెబుతారు. ఇక్కడ కేవలం వైద్యుడి మీద రోగికి గల నమ్మకం, అతడి మానసిక స్థితి తదితరాలే వ్యాధిని నయం చేయగలవని అన్నారు. అందుకే తాను నమ్మకంగా చెప్పగలను పెదాలపై ఉండే చిరునవ్వు రోగి ఆయుర్ధాయాన్ని పెంచగలదని. అందుకే తాను ఇలా హాస్య భరితంగా ఆరోగ్య సలహలు ఇస్తున్నాని అన్నారు డాక్టర్‌ పాల్‌. దీని గురించే చాలామంది రోగులు ఆయన స్టాండప్‌ కామెడీ షోకి వస్తారు. అక్కడ ఆయన చెప్పే ఆరోగ్య చిట్కాల తోపాటు హాస్య భరితంగా సాగే ఆరోగ్య సలహాలను మనసారా ఆశ్వాదిస్తారు.

తన కామెడీలో శర్వణ కుమార్ అనే కాల్పనిక పాత్రతో హాస్యం పండిస్తారు. ఆ పాత్ర అతిగా అల్పాహారాలు, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ తినే వ్యక్తి. ఇలా శరవణ్‌ కుమార్‌ 'తినడం' అనే వీక్‌నెస్‌ అతని ఆరోగ్యానికి ఎలా చేటు తెస్తుందో హాస్యంతో వివరించడం విశేషం. ఇలాంటి శరవన్‌ కుమార్‌లు మనలో ఎందరో ఉన్నారని చెబుతుంటారు పాల్‌. తినాలనే కోరిక మిమ్మల్ని ఎలాంటి వాటిని తినేలా ప్రోత్సహిస్తుందో గమనించాలి అంటారు. అంతేగాదు డైటింగ్‌, ఉపవాసాల పేరుతో నోరు కుట్టేసుకోకుండా ప్రతి ఫంక్షన్‌కి హాజరయ్యి ఎలా తక్కువుగా తినాలో వివరిస్తారు. అక్కడ ఉండే ప్రతి ఒక్క పదార్థంతో అరటి ఆకు ప్లేట్‌ని నింపేలా కొద్ది కొద్దిగా వడ్డించుకోండి. ఇక్కడ మీ లోపల ఉన్న అంతరంగిక వ్యక్తి కోరిక తీరుతుంది. అన్ని రుచులు ఆశ్వాదిస్తూ తక్కువగా కడుపు ఫుల్‌ అయ్యేలా తినగలుగుతారని అంటారు డాక్టర్‌ పాల్‌ . మీరు కూడా అతని వీడియోలు చూసి మనసారా నవ్వుకుని హాయిగా జీవించండి.

(చదవండి: న్యూమోనియాతో పోరాడుతుండగానే కరోనా బారినపడ్డ నటుడు విజయ్‌కాంత్‌!అలా కాకుండా ఉండాలంటే..)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Laughter
doctor
Youtube video
Health
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..

మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.