Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

గడ్డి పూలతో నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న మహిళా టెక్కీ

Family Sakshi User Sakshi Sakshi Time Aug 3, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Parvathy_20Mohanan_20copy.jpg

ఏవృత్తిలో ఉన్నా మనసుకు నచ్చిన పని, హబీ, లేదా  అలవాటు ఇంకోటి ఉంటుంది.  ఆ అభిరుచిని ఒక్క పట్టాన వదలాలి అని  అనిపించదు. కానీ ఈ విషయంలో  కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు కేరళలోని అలప్పుకు చెందిన పార్వతీ మోహనన్.  మొక్కల్ని  పెంచడం,  అవి పూలో పళ్లో కాస్తో మురిసిపోవడం ఆమెకు చిన్నప్పటినుంచి అలవాటు. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోని టేబుల్‌ రోజ్‌ (మాస్‌ రోజ్‌) అందమైన రంగులతో మమేకమై పోతూ చివరికి దాన్నే వ్యాపారంగా మార్చేసింది. కేరళకు చెందిన పార్వతి మోహనన్‌ సక్సెస్‌స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! 

పార్వతి మోహనన్‌  కాలేజీ రోజుల్లోనే పోర్టులాకా (పతుమణి) అనే  పూల మొక్కలను పెంచడం అభిరుచిగా చేసుకుంది. అయితే ఈ హాబీనే తనకు ఒకరోజు  ఇంత ఆదాయాన్ని తెస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. పార్వతి త్రిస్సూర్‌లో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు, 2020లో కోవిడ్‌ కారణంగా, స్వగ్రామానికి తిరిగి వచ్చి ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేది. ఇంట్లోనే ఉంటూ పోర్టులాకా మొక్కల్ని పెంచడం మొదలు పెట్టింది. వీటి ఫోటలను  ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేది. అందరికీ ఇవి తెగ నచ్చేసేవి. మాకూ కావాలని అడిగేవారు. అలా ఆమె వ్యాపారం మొదలైంది. బ్లాగర్లు, యూట్యూబ్ ఛానెల్‌ల కవరేజీ రావడంతో మరింత  పేరు వచ్చింది.


ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఉండగానే, అలప్పులోని చేరాల ప్రాంతానికి చెందిన పార్వతి తన ఇంటి సమీపంలోని ఒకటిన్నర ఎకరాల భూమిలో పోర్టులాకా మొక్కలను పెంచడం ప్రారంభించింది. అలా కేవలం ఐదు సంవత్సరాలలో తనహాబీని ఒక బిజినెస్‌ వెంచర్‌గా మార్చుకుంది.

ప్రస్తుతం  కక్కనాడ్‌లోని ఇన్ఫోపార్క్‌లోని  ఒ​క  ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా పనిచేస్తు, మరోవైపు  తోట నుండి సంవత్సరానికి లక్షల్లో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తుంది.   అంతేకాదు ప్యాకేజింగ్ , ఆర్డర్‌లను కొరియర్ చేయడం లాంటి పనులకోసం మరో ఇద్దరు మహిళలకు ఉపాధినిస్తోంది. భారతదేశం, థాయిలాండ్, బ్రెజిల్‌లోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 300 రకాల పోర్టులాకా మొక్కలను పెంచుతోంది. పోర్టులాకా మొక్కల కాంబో ప్యాక్  ఆర్డర్‌లు రోజుకు 50-100 ఆర్డర్‌లను పూర్తి చేసే స్థాయికి చేరుకుంది. ఆమె నెలవారీ ఆదాయం.  రూ. 1 లక్షకు పైమాటే. 300 రకాల మొక్కలు ఆమె దగ్గర ఉన్నాయి.

మొక్కల సంరక్షణ  చూస్తున్నపుడు చాలా హాయిగా అనిపిస్తుంది.వారాంతంలో మొక్కలతోనే ఉంటారు. అది మిగిలిన వారానికి సరపడా ఉత్సాహాన్ని శక్తిని సంపాదించుకుంటారు.  ‘నా మొక్కలే నాకు సర్వస్వం’ అంటారు పార్వతి. మంచి ఆదాయాన్ని సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషించేందుకు మన చుట్టూ అపారమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అంతే అంటారామె.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kerala
Woman techie
Flower garden
Income
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.