Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మనసు పిలిచింది

Family Sakshi User Sakshi Sakshi Time Feb 22, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kamalHassan-Rajinikanth.jpg

వీకెండ్‌ విశేషం

47 సంవత్సరాల తర్వాత కమల్, రజనీ కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరు తమిళ నటులు తెలుగువారికి ప్రీతిపాత్రులు. తెలుగు కుటుంబాల గుండెల్లో పాగా వేసిన సూపర్‌స్టార్లు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే తెలుగువారికి ఇద్దరి కథలెన్నో గుర్తుకు వస్తాయి. ఒక నోస్టాల్జియా...

47 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్‌ కలిసి నటిస్తున్నారు. ‘జైలర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ డైరెక్టర్‌. దాని గ్లింప్స్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూపుతోంది. నెల్సన్‌ వారిద్దరి మధ్య పోటీని అలాగే ఉంచుతూ కమలహాసన్‌కు సీనియారిటీ ఇస్తూ తీసిన ‘కెహెచ్‌ అండ్‌ ఆర్‌కె’ స్పెషల్‌ గ్లింప్స్‌ అభిమానులను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. తమిళంలోనే ఈ సినిమా తీస్తున్నా తెలుగువారికి స్ట్రయిట్‌ పిక్చర్‌తో సమానం. ఎందుకంటే వాళ్లిద్దరూ తెలుగువారికీ సూపర్‌స్టార్లే కదా.
  
తెలుగువారికి రామారావు, నాగేశ్వరరావు ఎలా ఇష్టమో తమిళంలో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్‌ కూడా అలాగే ఇష్టం. ఎం.జి.ఆర్‌ తెలుగు ప్రేక్షకులకు నేరుగా తెలియకపోయినా డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుసు. అలాగే తెలుగువారికి కృష్ణ, శోభన్‌బాబు ఎలా ఇష్టమో రజనీకాంత్, కమలహాసన్‌ కూడా అంతే ఇష్టం. వీరిద్దరూ తెలుగువారితో పాటే తమ కెరీర్‌ను కొనసాగించారు. తెలుగువారు తమను మరువకుండా చూశారు. వారికి అలా కలిసొచ్చింది.

‘అంతులేని కథ’ (1974)లో ఇద్దరూ యుక్తవయసులో తొలిసారి తెలుగు తెర మీద కనిపించినా ఆ తర్వాత రకరకాల దారుల్లో తెలుగువారికి దగ్గరవుతూ వచ్చారు. కమలహాసన్‌ ‘మరో చరిత్ర’తో సూపర్‌హిట్‌ కొట్టి తెలుగులో ఎస్టాబ్లిష్‌ అయిపోయాడు. అయితే రజనీకాంత్‌ ‘చిలకమ్మ చెప్పింది’, ‘అన్నదమ్ముల సవాల్‌’ చేసినా సరైన దగ్గరితనం ‘వయసు పిలిచింది’ (1978)తోనే వచ్చింది. 

కమల్, రజనీ కలిసి నటించిన ఈ సినిమా తెలుగునాట మహిళా ప్రేక్షకులు రజనీకాంత్‌ను అభిమానించేలా చేసింది. అతని చిక్‌లెట్‌ మేనరిజం యూత్‌కు నచ్చింది. ఆ రోజుల్లో రజనీ పుణ్యమా అని అందరూ చిక్‌లెట్‌లు తినడమే. మేడ మెట్లు ‘అలా కూడా ఎక్కుతారా’ అని రజనీని చూసి నోరెళ్లబెట్టారు. స్టయిల్‌ను తెలుగువారికీ రజనీయే పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘ఆకలి రాజ్యం’ తదితర సినిమాలతో కమల్‌– ‘టైగర్‌’, ‘రామ్‌ రాబర్ట్‌ రహీం’ సినిమాలతో రజనీ తెలుగు థియేటర్లలో ఆడారు. ఈలోపు వీరి డబ్బింగ్‌ సినిమాలు వచ్చి పోతూ వీరినీ తెలుగు హీరోలుగా వుంచాయి.

‘సాగర సంగమం’ కమల్‌ హాసన్‌కు తెలుగులో శాశ్వత స్థానం సంపాదించి పెట్టింది. ఈ బంగారానికి ‘స్వాతిముత్యం’ తావి మాత్రమే. ఈ సమయంలో రజనీ తెలుగుకు కొంత ఎడంగా ఉన్నా ఒక్కసారిగా ‘ముత్తు’ ఆ తర్వాత ‘బాషా’ సినిమాలతో ‘నేను ఒక్క సినిమా తీస్తే వంద సినిమాలు తీసినట్టే’ అన్నట్టుగా సూపర్‌హిట్‌ కొట్టారు. ‘అందమైన అనుభవం’, ‘అల్లావుద్దీన్‌ అద్భుత దీపం’ (1979) తర్వాత కలిసి నటించడం మానుకున్న కమల్, రజనీ తమ స్టార్‌డమ్, అభిమానుల ఘర్షణల వల్ల ఎడాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. నేడు రజనీ 75కు, కమల్‌ 71కి చేరుకున్నా ప్రేక్షకులు వారిని సూపర్‌ స్టార్లుగానే తప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చూడ నిరాకరిస్తున్నారు.   
కాలం మనుషుల్ని దగ్గర చేస్తుంది తప్పదు. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ ఒకేసారి పక్క పక్కన తెర మీద కనిపించబోతున్నారు. నెల్సన్‌ దర్శకుడు కాబట్టి కామెడీ కూడా ఉంటుంది. ఇద్దరూ కామెడీ చేయడంలో మేటి కదా. ఈ వంకన ఈ రోజు నుంచే సినీ ప్రేక్షకులు వీరి సినిమా కోసం ఎదురు చూడటం మొదలుపెడతారు. ఏ సంక్రాంతికో, దీపావళికో ఈ డబుల్‌ ధమాకా దద్దరిల్లనుంది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Rajinikanth
Kamal Haasan
Nelson
new movie
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా

అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా

రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..!

రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..!

'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్

'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్

హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్

హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్ (ఫొటోలు)

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్ (ఫొటోలు)

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.