Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

డిజిటల్‌ కూడలిలో మహిళ

Family Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cyber.jpg

వందన డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఇంటా బయట చురుగ్గా ఉండే వందన వారం రోజులుగా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టలేకపోతోంది. కారణం, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్‌ ఒక సైట్‌లో కనపడటం ఆమెను కలవరపరుస్తోంది. వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయాలు బయటకు రావడం ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాలను ఇంట్లోవారితో పంచుకోలేక, స్నేహితులతో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. రకరకాల డిజిటల్‌ సమస్యలను ఎదుర్కొనే యువతుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతోంది.  



ఇటీవల కాలంలో మహిళల అవకాశాలు ఇంటర్నెట్‌ ద్వారా విస్తృతమయ్యాయి. ఉపా ధి అవకాశాలను పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని సంపా దించడానికి, జ్ఞానాన్ని, ఆర్థికవృద్ధిని,  మరింత సమగ్రమైన డిజిటల్‌ ప్రపంచాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, సైబర్‌ శాఖ ఆన్‌లైన్‌లో పెరుగుతున్న మహిళా ప్రయోజనాలనే కాదు, వారికి సమస్యగా మారే అంశాలను కూడా పరిశీలిస్తుంది. మహిళలు ఆన్ లైన్ లో తమ సురక్షిత ప్రయాణం సాగించడానికి డిజిటల్‌ భద్రత తెలుసుకోవడం అత్యవసరం. 



డిజిటల్‌ నేరాలలో ప్రధానమైనవి..

డాక్సింగ్‌ : ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన గతంలోని వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్‌ మాధ్యమం ద్వారా బహిర్గతం చేసే చర్య. మోసగాళ్లు సాధారణంగా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్‌లు, గత సోషల్‌ మీడియా పోస్టింగ్‌లు, సోషల్‌ ఇంజనీరింగ్‌ నుండి సమాచారాన్నిపొంది, ఆన్ లైన్‌ షేమింగ్‌ లేదా దోపిడీకి దారితీయవచ్చు.



సైబర్‌స్టాకింగ్‌:  ఇది ఎలక్ట్రానిక్‌ మార్గాలను ఉపయోగించి ఒక వ్యక్తిని పదేపదే ట్రాక్‌ చేయడం.

ఉదాహరణకు: అసందర్భంగా ఫోన్‌ కాల్స్‌ చేయడం, వాయిస్‌ సందేశాలు లేదా మెసేజ్‌లు చేయడం, గూఢచర్యం లేదా సోషల్‌ మీడియా కార్యకలాపా లను పర్యవేక్షించడం లేదా ఇంటర్నెట్‌లో తగని సమాచారాన్ని పోస్ట్‌ చేస్తామని బెదిరించడం.. వంటి సైబర్‌స్టాకింగ్‌ శారీరక, మానసిక క్షోభకు దారితీయవచ్చు.



స్వాటింగ్‌: ఇది పోలీసులను రెచ్చగొట్టడానికి, మనల్ని మోసం చేయడానికి అత్యవసర ఫోన్‌ కాల్స్‌ చేయడం వంటి చర్య.  ఇది సైబర్‌ దోపిడీకి ఒక రూపం. దీని ద్వారా వ్యక్తులు లైంగిక ప్రయోజనాలనుపొందాలని చూస్తారు. లైంగిక వేధింపులు వ్యక్తిగత, సన్నిహిత ఫొటోల పంపిణీకి దారితీయవచ్చు. 



రివెంజ్‌ పోర్న్‌: అసభ్యకరమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్ లైన్ లో అప్‌లోడ్‌ చేసి వేధిస్తారు. ఏ మాత్రం మన అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో షేర్‌ అవుతుంటాయి. ఇవి ఎక్కువగా బాధితురాలి మాజీ జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్‌ ద్వారా జరిగేవి ఉంటాయి. 



లైంగిక వేధింపులు: తెలియకనో లేక ఏదైనా భావోద్వేగ సమయంలోనో లైంగిక అనుకూల రిక్వెస్ట్‌లకు అనుమతి ఇస్తుంటారు. అంటే, ఫొటోలు, కంటెంట్, జోక్స్, మరొక స్త్రీ ద్వేషానికి సంబంధించినవి అయి ఉండవచ్చు. ఇవి ఒకరి ప్రతిష్ఠకు హాని కలిగించే వాస్తవాలు. ఉదాహరణకు.. ‘దొంగ, అబద్ధాలకోరు లేదా అనైతిక ప్రవర్తన’.. వంటివి.



వంచన: మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ సోషల్‌ మీడియా పరిచయాల నుండి డబ్బు అడుగుతారు, ఇది బాధితు లను వేధించడానికి ఇతరులకు ్రపోత్సాహకంగా కూడా ఉపయోగపడుతుంది. ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టడం, జాతి విద్వేషాన్ని ్రపోత్సహించడం లేదా సమర్థించడం, రాజకీయ, కార్పొరేట్‌ లేదా పోటీదారుల పోటీలో పా ల్గొనడం వంటివి ఉంటాయి.  

సేఫ్టీ చిట్కాలు:

సమస్యలు వస్తాయని ఎవరూ తమ ప్రయోజనాలను వదులుకోరు. అయితే, బయట మన క్షేమం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఆన్‌లైన్‌ బజార్‌లోనూ అంతే భద్రంగా ఉండటం ముఖ్యం.



► HTTPS:// (ప్యాడ్‌లాక్‌ సింబల్‌) ఉన్న వెబ్‌సైట్‌లను మాత్రమే బ్రౌజ్‌ చేయండి.

► పెద్ద అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న సంక్లిష్ట పా స్‌వర్డ్‌ను ఉపయో గించండి.

► అన్ని సామాజిక, ఇ–మెయిల్, బ్యాంకింగ్‌ లాగిన్ ల (2ఊఅ) కోసం రెండు–దశల ప్రమాణీకరణను పా టించండి.

► ఎస్సెమ్మెస్, వాట్సప్, సోషల్‌ మీడియా మెసెంజర్‌ల ద్వారా వచ్చిన చిన్న లింక్‌లను ఎప్పుడూ క్లిక్‌ చేయవద్దు.

► సామాజిక మాధ్యమాలలో ఫొటోలను చూస్తున్నప్పుడు లేదా అప్‌లోడ్‌ చేస్తున్నప్పుడు మీ లొకేషన్‌ స్టేటస్‌ను స్టాప్‌ చేయండి. 

► ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్ క్రిప్షన్‌ మెసెంజర్‌లను మాత్రమే ఉపయోగించండి.

► అన్ని సోషల్‌ మీడియా, మెసెంజర్, ఇ– మెయిల్‌ అప్లికేషన్ ల కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్‌ చేయండి.

► సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో  (ఆర్థిక, లాగిన్‌ ఆధారాలు, సంస్థ, వ్యక్తిగత సమాచారం... వంటి) సెన్సిటివ్‌ సమాచారాన్ని  పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

► నిజమైన, తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్‌ అవ్వండి. ప్రత్యామ్నాయంగా, గోప్యతా సెట్టింగ్‌లను ఉపయోగించి మీరు మీ ప్రొ ఫైల్‌లను లాక్‌ చేయడాన్ని ఎంచుకోవచ్చు.

► ఆఫ్‌లైన్, ఆన్ లైన్‌ పరస్పర చర్యలలో సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి.

► మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ప్లగ్‌ ఇన్‌ చేసి  ఉంచవద్దు.

► యాంటీ–వైరస్, యాంటీ–మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌లతో మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను సురక్షితం చేయండి. 

► ఇది సురక్షితమైన నెట్‌వర్క్‌ అని మీరు నిర్ధారించుకునే వరకు పబ్లిక్‌ వై ఫైని ఎప్పుడూ యాక్సెస్‌ చేయవద్దు.

► ప్రసిద్ధ మూలాధారాల నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్‌ చేయండి (ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌  వంటివి).



సైబర్‌  టాక్‌

ఆన్‌లైన్‌లో మహిళా భద్రతకు  సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే సైట్స్‌..

https://securityinabox.org/en/

https://exposingtheinvisible.org/resources/#

filter=.watching-out-yourself

https://ssd.eff.org/

https://hackblossom.org/cybersecurity/

https://www.accessn 




మీరు సైబర్‌ క్రైమ్‌కు గురైతే జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ https://www.cybercrime.gov.in/ కు లాగిన్‌ చేసి,  ఫిర్యాదును ఫైల్‌ చేయండి.  నేషనల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 కి ఫోన్‌ చేసి,  సహాయంపొందవచ్చు. 

- ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల,  డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,  ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Womens safety
Cybercrime
Internet
Social Media
safety
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

ఇరాన్‌ అజేయం.. ట్రంప్‌నకు కునుకు కరువు!

ఇరాన్‌ అజేయం.. ట్రంప్‌నకు కునుకు కరువు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.