Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

క్లిక్‌ @ కిక్‌

Family Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
githika.jpg

మూడోసారి

ఫొటో జర్నలిస్ట్‌గా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలను ఒక్కసారి కవర్‌ చేయడమే విశేషంగా భావిస్తారు. అస్సాంకు చెందిన గీతికా తలుక్దార్‌ మన దేశం నుంచి వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్‌ కప్‌ను కవర్‌ చేసే అవకాశం పొందిన ఏకైక ఉమెన్‌ ఫోటో జర్నలిస్ట్‌గా ప్రత్యేకత సాధించారు. వరుసగా మూడుసార్లు పురుషుల ఫిఫా వరల్డ్‌ కప్‌కు అధికారిక గుర్తింపు పొందిన గీతిక అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ రంగానికి సంబంధించి రిపోర్టింగ్, ఫొటోగ్రఫీలో అపారమైన అనుభవం ఉన్న మీడియా నిపుణుల ప్రత్యేక బృందంలో చేరారు.

గీతికా తలుక్దార్‌కు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను కవర్‌ చేయడంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2018లో రష్యా, 2022లో ఖతార్‌ తర్వాత ఇది ఆమెకు వరుసగా మూడవ ఫిఫా ప్రపంచకప్‌ అసైన్‌మెంట్‌.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జన్మించారు గీతిక. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెరిగారు. కేంద్రీయ విశ్వవిద్యాయంలో చదువుకున్నారు.
దక్షిణ కొరియాలోని ‘సియోల్‌ నేషనల్‌ యూనివర్శిటీ’లో గ్లోబల్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చేశారు. దక్షిణ కొరియా క్రీడా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి స్కాలర్‌షిప్‌ అందుకున్నారు. ‘సియోల్‌ నేషనల్‌ యూనివర్శిటీ’లో చదువుకోవడం ఆమె ప్రాపంచిక దృక్పథాన్ని విశాలం చేసింది.

ఈశాన్య ప్రాంత ప్రతిభ ఏ అంతర్జాతీయ వేదికపైనైనా పోటీపడగలదనే ఆమె నమ్మకాన్ని బలపరిచింది. ఆ తరువాత క్రీడా జర్నలిజం వైపు అడుగులు వేసి ఫొటోగ్రఫీని తన కెరీర్‌గా ఎంచుకున్నారు గీతిక.

మానవీయ కోణంలో....
ఒక ఫొటో న్యూస్‌ ఏజెన్సీతో గీతిక కెరీర్‌ మొదలైంది. ఆ తరువాత పూర్తిస్థాయిలో స్పోర్ట్స్‌ జర్నలిజం, స్పోర్ట్స్‌ ఫొటోగ్రఫీ వైపు వచ్చారు. స్పోర్ట్స్‌ ఫొటోగ్రఫీ అంటే కేవలం ప్లేయర్స్‌ గోల్స్‌ కొడుతున్నప్పుడు ఫొటోలు తీయడం మాత్రమే కాదు. ఇలా కనిపించి అలా క్షణాల్లో మాయమయ్యే ఒత్తిడి, ప్రతిచర్యలు, భావోద్వేగాలను వేగంగా బంధించడం కూడా. ఆ కళలలో ఆరితేరారు గీతిక. ఆటలను చూసే క్రమంలో అభిమానుల స్పందన, అథ్లెట్ల సంబరాలు, ఒత్తిడిలో ఉన్న జట్టు... ఇలా క్రీడలు, క్రీడా కార్యక్రమాల చుట్టు ఉన్న వాతావరణాన్ని, క్రీడలలోని మానవీయ కోణాన్ని డాక్యుమెంట్‌ చేస్తాయి ఆమె తీసిన ఫొటోలు. గణాంకాలు ఎప్పటికీ తెలియజేయలేని కథలను గీతిక తీసిన ఫొటోలు చెబుతాయి.

అత్యంత పోటీలో... అరుదైన అవకాశం
రష్యా, ఖతార్‌లలో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌తోపాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌లు, టోక్యో ఒలింపిక్స్, పారిస్‌ ఒలింపిక్స్, ఐపీయల్‌ సీజన్‌లు, కామన్‌వెల్త్‌ గేమ్స్, ఐసీసీ టోర్నమెంట్స్‌ కవర్‌ చేశారు గీతిక. ఆమె కెరీర్‌లో ఫిఫా అక్రిడిటేషన్‌లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ టోర్నమెంట్‌లలో ప్రవేశం పొందడం అత్యంత పోటీతో కూడుకున్నది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు దరఖాస్తు చేసుకుంటారు.

కెరీర్‌లో మైలురాయి
ఫిఫా వరల్డ్‌ కప్‌ కోసం అంతర్జాతీయ మీడియా కవరేజ్‌ బృందంలో మూడోసారి ఎంపిక కావడాన్ని తన కెరీర్‌లో ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ, తనకు మద్దతు ఇచ్చిన ఫిఫా, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య, ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్యలకు గీతిక ధన్యవాదాలు తెలియజేశారు.

స్పోర్ట్స్‌ ఫొటోగ్రఫీ ఇప్పటికీ పురుషాధిక్యతతోనే ఉంది. నిరంతర ప్రయాణాలు, ఎక్కువ పనిగంటలు అవసరమయ్యే ప్రపంచస్థాయి టోర్నమెంట్‌లలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్‌లని ప్రోత్సహించడంలో భాగంగా 2024లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, పారిస్‌ ఒలింపిక్స్‌ను కవర్‌ చేయడానికి గీతికకు నేరుగా గుర్తింపు ఇచ్చింది. భారతదేశం నుండి ఈ గుర్తింపు పొందిన తొలి, ఏకైక మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు గీతిక.

ఇదొక సుదీర్ఘ ప్రయాణం
ఏదీ ఒక్కరోజులోగానీ, ఒక్క ప్రయత్నంలోగానీ రాలేదు. ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం. నా అభిరుచి, నేను ఎంచుకున్న ప్రొఫెషన్‌లో పడిన కఠోరశ్రమ, అంకితభావం ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇచ్చింది. అవకాశాలను అందించింది. నా ప్రయాణంలో నాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన వారికి, విలువలు నేర్పిన కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
– గీతికా తలుక్దార్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Photo journalist
football world cup
assam
Geetika
arunachal pradesh
itanagar
FIFA World Cup 2026
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్‌ (ఫొటోలు)

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ ఓటమి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్‌ వీడ్కోలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్‌ వీడ్కోలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.