Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్‌ చేస్తాడు.. ఏం చేయాలి?

Family Sakshi User Sakshi Sakshi Time Jul 15, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
addiction.jpg

వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్‌ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్‌ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’

► అపార్ట్‌మెంట్‌లో దాదాపు అన్ని ఫ్లాట్స్‌ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్‌రూమ్‌కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో  పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. 



► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. 



► మల్టిపుల్‌ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్‌ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్‌ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్‌. బాధ్యత తెలిస్తే సెట్‌ అవుతావులే’ అంటుంది. 





► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్‌ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది.



► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్‌ చేయడం వల్ల యాక్సిడెంట్‌ అయ్యింది’ అంటాడు తండ్రి. 



► కజిన్స్‌ రిలేటివ్‌ ఫంక్షన్‌లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్‌ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్‌ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్‌ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. 



వెరీ డేంజర్‌!!

చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్‌ వెరీ వెరీ డేంజర్‌ డిసీజ్‌. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. 

ధైర్యమే ఆయుధం 

వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు.   

కుటుంబం ప్రవర్తన మారాల్సిందే!

కొడుకు/కూతురు/హజ్బెండ్‌/ఫాదర్‌ కి అడిక్షన్‌ పట్ల సపోర్ట్‌ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్‌ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే.



మందలించాల్సిందే! 

ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్‌ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని  వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్‌ రోల్‌ భార్య/తల్లిదే.

ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్‌/ డ్రగ్స్‌ వాడుతున్నాడంటే అతని మైండ్‌ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్‌ మెడిసిన్స్‌ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు.

అవగాహన, బిహేవియరల్‌ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్‌ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్‌ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్‌ని కలవడానికి ఇబ్బంది పడకూడదు.  

 

– డాక్టర్‌ గిడియన్, 

డి–అడిక్షన్‌ థెరపిస్ట్‌ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Alcohol
Addiction
Therapy
Health
consumption
drinking habit
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు

మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.