Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

రోజుకింత 'పీచు' చాలు..!

Family Sakshi User Sakshi Sakshi Time Aug 10, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fiber.jpg

షుగర్‌ ఉన్నవారు, లేదా షుగర్‌ వచ్చే దశకు (ప్రీడయాబెటిస్‌) చేరుకున్నవారు నిరంతరం జాగ్రత్తగా ఉండటం అవసరం. మందులు సక్రమంగా వేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తరచు షుగర్‌ టెస్ట్‌ చేయించుకుంటుండాలి. ఇదంతా కూడా ఒక ప్రణాళికలా ఉంటుంది. అయితే ఆ ప్రణాళికను పాటిస్తూనే, మీ షుగర్‌ను మీరు నియంత్రణలో ఉంచుకోటానికి ఒక తేలికైన మార్గం కూడా ఉంది. 

అదేమిటంటే, ఆహారంలోకి మీరు తీసుకునే పీచుపదార్థాలను (డైటరీ ఫైబర్‌) మరికాస్త ఎక్కువ చేయటం! ‘అమెరికన్‌ డయబెటిస్‌ అసోసియేషన్‌’ (ఎ.డి.ఎ.) తాజాగా పూర్తి చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. షుగర్‌ ఉన్నవారు లేదా షుగర్‌ వచ్చే దశలో ఉన్నవారు డైటరీ ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని వెల్లడైంది.  

డైటరీ ఫైబర్‌ అంటే?
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు వంటి శాకాహారాల్లో కనిపించే ఒక రకమైన కార్బోహైడ్రేటే.. డైటరీ ఫైబర్‌. ఇతర కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల) మాదిరిగా ఈ డైటరీ ఫైబర్‌ మీ శరీరంలో త్వరగా జీర్ణం కాకపోగా, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. మీ రక్తప్రవాహంలోకి చక్కెర ప్రవేశించే వేగాన్ని నెమ్మదింపజేస్తుంది జీర్ణకోశంలోని మంచి బాక్టీరియాకు దన్నుగా ఉంటుంది. 

అధ్యయనంలో ఏం తేలింది?
అధ్యయనం కోసం ఎ.డి.ఎ. పరిశోధకులు డయాబెటిస్‌ లేదా ప్రీడయాబెటిస్‌ ఉన్న 3,000 కంటే ఎక్కువమంది అమెరికన్‌ల ఆరోగ్య వివరాలను అనేక ఏళ్ల పాటు నిశితంగా పరిశీలించారు. వారు ఎంత ఫైబర్‌ను తీసుకున్నారు, వారిలో ఎంతమంది ఎంతకాలానికి మరణించారు, మరణించినవారు ఏదైనా ఇతర కారణం వల్ల మరణించారా లేదా గుండె జబ్బుల వల్ల మరణించారా అన్నది చూశారు. 

ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. వాటి ప్రకారం, ఎక్కువ ఫైబర్‌ తీసుకున్న వ్యక్తులు ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే వారు ప్రతిరోజూ తీసుకునే ప్రతి అదనపు గ్రాము ఫైబర్‌కు, వారు మరణించే అవకాశం దాదాపు 2 శాతం తగ్గింది. 

ఫైబర్‌తో గుండె ఆరోగ్యం
హృద్రోగ మరణాల విషయానికి వస్తే... ఫైబర్‌కు, గుండె ఆరోగ్యానికి మధ్య సంబంధం కొంచెం సంక్షిష్టంగానే ఉంది. ఎక్కువ ఫైబర్‌ తీసుకోవటం వల్ల మరణ ప్రమాదం తగ్గింది కాని, అయితే అది ఒక నిర్దిష్ట పరిమితి వరకే. ఫైబర్‌ వల్ల గుండెకు చేకూరే ప్రయోజనాలు రోజుకు దాదాపు 26 గ్రాముల ఫైబర్‌తో ఆగిపోయాయి. 

ఫైబర్‌ అంతకు మించితే ప్రయోజనం లేకపోగా, ప్రమాదం పెరిగే అవకాశం కనిపించింది. అయినప్పటికీ ఇది పూర్తిగా నిర్ధారణ కాని విషయంగానే మిగిలింది. దీనిని బట్టి ఫైబర్‌ గుండెకు మంచిదే అయినప్పటికీ, ఎక్కువ తీసుకోవడం అన్నది అంత మంచిది కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇలా చేయండి

  • మీకు ఫైబర్‌ను తీసుకునే అలవాటు లేకపోతే, కడుపులో అసౌకర్యాన్ని నివారించటం కోసం మొదట కొద్ది మొత్తంలో ఫైబర్‌ను మీ ఆహారంలో చేర్చుకోండి. 

  • మీ జీర్ణ వ్యవస్థలోకి చేరిన ఫైబర్‌ క్రియాశీలం అవటానికి నీరు తాగటం అవసరం.

  • ఫైబర్‌ ఫలితాన్ని సంపూర్ణంగా పొందటానికి పండ్ల రసాలు కాకుండా పండ్లుగా తినండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. 

  • తృణధాన్యాలను ఎంచుకోండి. తెల్ల బియ్యం, బ్రెడ్‌ నుండి బ్రౌన్‌ రైస్, హోల్‌–వీట్‌ బ్రెడ్‌కు మారండి.
    ∙చిక్కుళ్లను మీ ఆహారానికి జోడించండి. బీన్స్‌, కాయధాన్యాలు, సెనగల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. మాంసకృత్తులు కూడా దండిగా ఉంటాయి. 

తీసుకోవలసిన జాగ్రత్తలు

ఒకేసారి ఎక్కువ ఫైబర్‌ తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా కడుపులో గ్యాస్‌ వస్తుంది. కనీసం ఫైబర్‌ మీకు అలవాటయ్యే వరకైనా పూర్తి మొత్తం ఫైబర్‌ను తీసుకోకండి.   

అధిక మోతాదులో ఫైబర్‌ తీసుకోవడం వల్ల కాల్షియం లేదా ఇనుము వంటి కొన్ని ఖనిజాల శోషణ (శరీరం పీల్చుకోవటం) తగ్గుతుంది. కాబట్టి సమతులం అన్నది కీలకం.

డయాబెటిక్‌ గ్యాస్ట్రోపరేసిస్‌ (తిన్న తర్వాత కడుపు ఎంతకూ ఖాళీ అయినట్లు ఉండకపోవటం) వంటి కొన్ని పరిస్థితులు ఉన్నవారు ఫైబర్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే వైద్యుడిని సంప్రదించాలి. 

ఎంత ఫైబర్‌ తీసుకోవాలి?
తాజా అధ్యయనం ఆధారంగా, రోజుకు 25 నుండి 26 గ్రాముల ఫైబర్‌ తీసుకోవటం సురక్షితం, ప్రభావవంతం అని తెలుస్తోంది. అనేక ఆరోగ్య సంస్థల సిఫారసులకు అనుగుణంగా ఈ మోతాదును నిర్ణయించారు. డయాబెటిస్‌ లేదా ప్రీడయాబెటిస్‌ ఉన్నవారు తమ ఆహారంలోకి ఫైబర్‌ను తగినంతగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్‌ నియంత్రణ ఒక సహజ ప్రక్రియగా జరిగిపోతుంది.

కొంతమందికి సాధారణ స్థాయిలో ఫైబర్‌ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ మోతాదులో ఫైబర్‌ను తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించటం తప్పనిసరి. నేడు మీరు ఫైబర్‌ తీసుకుంటే అది మీ రేపటి జీవితానికి ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి.  
సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

(చదవండి: కొరకరాని గింజలే గాని...)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Fiber
vegetables
Health Tips
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

యోగాసనం.. ఆరోగ్యశాసనం

యోగాసనం.. ఆరోగ్యశాసనం

హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..

హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..

పీసీఓఎస్‌తో జస్ట్‌ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!

పీసీఓఎస్‌తో జస్ట్‌ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!

జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్‌!

జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.