Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పాలపిట్టలు.. ప్రాకృతిక శోభలు

Family Sakshi User Sakshi Sakshi Time Oct 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pala-pitta-1.jpg

దసరా అంటే ఆయుధాల పూజ మాత్రమే కాదు బంతి పూల సింగడీ పూజ. లేఎండ తగిలిన పచ్చగడ్డి భూతల్లికి వేసే ఆవిరి ధూపం. మెట్ట  ప్రాంతాల సౌరభం. స్త్రీలు ఎర్రమట్టితో అలికే ఇంటి ముంగిలి కళ. చెరువులు నిండి, వాగులు  పొంగే కాలం. ప్రతి ఊరిలో పట్టనలవిగాని సంబరం... ‘దసరా’ గురించి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చెబుతున్న విశేషాలు.

దసరా పండుగ మా దక్షిణ తెలంగాణ లో గొప్పగా జరుపుకుంటాం. దుందుభి, కృష్ణ నదుల నడిమధ్యన ఉండే  ప్రాంతం మాది. చిన్నప్పుడు దసరా వస్తే ఊళ్లో ‘అమ్మా వినవే జామి’... అని జమ్మిచెట్టు మీద కట్టిన జానపద  పాటలు స్త్రీల నోటి నుంచి వినిపించేవి. జమ్మి చెట్టు మీద  పాండవులు ఆయుధాలు దాచడం, వాటిని కిందకు దించాక అర్జునుడు యుద్ధం చేసి గెలవడం ఈ విరాట పర్వం అంతా ప్రజలకు ఇష్టంగా మారిన గాథ. అందుకే దసరాకు  పాడుకుంటారు. 

దసరా సమయంలో యక్షగానం ఊరూరా ఉంటుంది. కొన్ని చోట్ల శశిరేఖా పరిణయం ఆడతారు. దసరా పండుగ  ప్రాకృతిక శోభ నిండి ఉన్నప్పుడు వస్తుంది. భూమాత వానకు తడిసి, ఎండ తగలడం వల్ల అంత తడిగా,  పొడిగా కాకుండా మెత్తగా ఉంటుంది. వేరుశనగ బుడ్డలు అప్పుడప్పుడే గింజ గట్టి పడుతూ ఉంటాయి. జొన్న, సజ్జ, రాగి, కంది  పొలాలు పంటతో మురిసి పోతూ ఉంటాయి. 

అలసందలు ఆ సమయంలోనే కోతకు వస్తాయి. పెసర, బీర తీగలు, కాకర  పాదులు, చిక్కుడు చెట్లు కళకళలాడుతుంటాయి. నా చిన్నప్పుడు మాకున్నది మూడు నాలుగు ఎకరాలే అయినా మా చేనులో చిన్న గుడిసె ఉంటే అక్కడే ఉండేవాణ్ణి. పంటలు పండిన  పొలాల మీదకు గువ్వలు వస్తాయి. వాటిలో  పాలపిట్టను చూసి సంతోషపడేది. పండగ రోజు మాత్రమే కాదు.. ఆ సీజన్లో ఎప్పుడు  పాల పిట్ట కనపడినా ఎంతో సంతోషం కలుగుతుంది. దానిని చూడటం శుభకరం అని భావిస్తారు. 

దసరా నాటికి వానలు పడి చెరువులు నిండి ఉంటాయి. వాగులు  పారుతుంటాయి. చేపలు ఎదురెక్కుతుంటాయి. నల్ల తుమ్మలు నిండుగా గాలికి ఊగుతుంటాయి. వలస పక్షులు వాలుతాయి. పండగ సమయంలో దేవతలు, యక్షులు పక్షుల రూపంలో వచ్చి వాలుతాయని అనుకునేది. అందుకే ‘తిప్ప తీగల వీణ మీటుతూ రాగమాలికలు  పాడే పిట్టలు’ అని రాశాను. 

తెలంగాణలో దసరా పండగకు తప్పనిసరిగా ఆడబిడ్డలను పదిరోజుల ముందే తీసుకు వస్తారు. స్త్రీలు ఎర్రమట్టి తెచ్చి ఇల్లంతా సుందరంగా అలుక్కుంటారు. ఆ ఎర్రమన్ను తెచ్చుకునే సమయంలో స్త్రీలు కదిలి వస్తుంటే చూసి పిల్లలందరం పండగ కళ రాబోతున్నదని కేరింతలు కొట్టేవాళ్లం. దసరా సమయానికే సీతాఫలం చెట్లు విరగకాసి ఉంటాయి. 

మా చిన్నప్పుడు వాటిని కాల్చుకుని తినడం గొప్ప ఆహారం. ఎన్ని తినేవారమో లెక్కే లేదు. దసరా అంటే పూల పండగ. సమయంలో ఊరిలో, ఇళ్లలో,  పొలాల గట్ల మీద బంతి పూలు పూస్తాయి. వాటిని తెచ్చి మామిడాకులు,  పోక పూలు అన్ని కలిపి ప్రతి ఇంటి దర్వాజాలకు, ద్వారబంధాలకు కళాత్మకంగా కట్టి శోభను తీసుకు వస్తారు. దసరా అంటే బరిలో గెలిచిన ఆయుధ పూజ మాత్రమే కాదు బంతిపూల సింగడి పూజ. 

దసరా సమయంలో నేలంతా రకరకాల గడ్డి మొలిచి ఉంటుంది. ఎండ తగిలినప్పుడు సూర్యకిరణాల తాపంతో వీటి నుంచి సన్నటి ఆవిరి లేచి భూతల్లికి ధూపం వేసినట్టు ఉంటుంది. ఆ గడ్డి మీదుగా వీచే గాలిలోని వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. పండగ రోజు జమ్మి కోసం వెళ్లడం... దానికి బండ్లు కట్టడం అదో ఉత్సవం.

 నా చిన్నప్పుడు నా స్నేహితులు నాగయ్య, మల్లయ్య, బుచ్చయ్య, అంజయ్య, కూర్మయ్య మా మేనమామ నరసింహయ్య మేమందరం తప్పనిసరిగా కలిసేవాళ్లం. మేం మాత్రమే కట్టుగా ఉండి  పొలాల వెంట తిరిగేవాళ్లం. ఈ కాలంలోనే ఈత కల్లు మొదలవుతుంది. నురగ పడుతది.  దసరా పండగలో తినడం, సంతోషంగా గడపడం ప్రజలకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. దసరా దశ దిశలా సంతోషాలు తెచ్చే పండుగ.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Dussehra 2025
Dussehra Festival
flowers festival
Gorati Venkanna
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బైక్స్‌ అండ్‌ కార్స్‌..సేల్స్‌ అదుర్స్‌!

బైక్స్‌ అండ్‌ కార్స్‌..సేల్స్‌ అదుర్స్‌!

ఇందిరాగాంధీ జయంతికి చీరల పంపిణీ

ఇందిరాగాంధీ జయంతికి చీరల పంపిణీ

ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి

ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి

సైకిల్‌ కొంటాం.. రుణం ఇవ్వండి

సైకిల్‌ కొంటాం.. రుణం ఇవ్వండి

వాహన అమ్మకాలకు పండుగ జోష్‌ 

వాహన అమ్మకాలకు పండుగ జోష్‌ 

దుర్గాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

దుర్గాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.