Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సాహిత్యమే పిల్లలకు మంచి చెప్పాలి

Family Sakshi User Sakshi Sakshi Time Jun 20, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shivakumar111.jpg

– సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కార విజేత గంగిశెట్టి శివకుమార్‌

న్యూస్‌మేకర్‌

‘మేము చదువుకునే సమయంలో రోజూ మోరల్‌ ఇన్‌స్ట్రక్షన్‌ (ఎం.ఐ.) అనే క్లాస్‌ ఉండేది. పిల్లల్ని కూచోబెట్టి సార్లు ఒక కథ వినిపించి అందులోని నీతి వివరించేవారు. అసలు నేడు పిల్లలకు ఇంటా బయటా మౌలిక భావాలు ఎవరు చెబుతున్నారు? పెద్దవాళ్లకా టైమ్‌ లేదు. మరి పిల్లలకు పరోపకారం చేయాలని, దేశభక్తి కలిగి ఉండాలని, మూఢ భావాలు ఉండకూడదని, అందరి పట్లా సమ భావన కలిగి ఉండాలని, ఆధునిక భావాలు కలిగి ఉండాలని... ఎవరు చె ప్పాలి? బాల సాహిత్యమే చె ప్పాలి. 

పిల్లల చేత పుస్తకాలు చదివిస్తే తప్ప ఇవాళ వారిలో కనిపిస్తున్న దుర్లక్షణాలు పోవు’ అన్నారు గంగిశెట్టి శివ. 71 ఏళ్ల శివకుమార్‌ దాదాపు యాభై ఏళ్లకు పైగానే బాల సాహిత్యం రాస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయన పుస్తకం ‘కబుర్ల దేవత’కు బాల సాహిత్యం కేటగిరిలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ‘సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి’తో శివకుమార్‌ సంభాషణ...

→ బాల సాహిత్యంలోకి ఎలా వచ్చారు?
శివకుమార్‌: మాది నెల్లూరు జిల్లా రాపూరు. మా నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు. తరుచూ బాలమిత్ర, చందమామ ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో వాటిని చేత్తో తాకడమే పెద్ద సంబరం. 13 ఏళ్ల వయసులో అవి చదివి అలా నేను కూడా కథలు రాయాలనుకునేవాణ్ణి. 14వ ఏట మొదటి కథ పోస్ట్‌ చేశాను. అప్పటి నుంచి పిల్లల కథలు రాసి పత్రికలకు పంపించడం మొదలుపెట్టాను.

→ కథల్లో పిల్లలకు ఏం చెబుతుంటారు?
జ: నేను కొడవటిగంటి కుటుంబరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనలాగే పిల్లల్లో ఆలోచన, విచక్షణ పెరిగే సాహిత్యం ఉండాలని కోరుకుంటాను. మంత్రాలు, తంత్రాలు కాకుండా హేతువుకు ప్రాధాన్యం పెరిగేలా రాశాను. బాలసాహిత్యం చదివిన పిల్లలు తమకు తాము మేలు చేసుకోవాలి, సమాజానికి మేలు చేయాలి. ఇవి చేయడానికి వీలు కల్పించని సాహిత్యం మంచి బాల సాహిత్యం కాదు. ఇవాళ్టి పిల్లలు రేపటి ΄ పౌరులు మాత్రమే కాదు మహా పురుషులు కావాలి. కాని ఏ మహాపురుషుడి గురించి వీరు తెలుసుకుంటున్నారు... చదువుతున్నారు? మనందరం గాంధీ, నెహ్రూ గాథల నుంచి కదా ఇన్‌స్పయిర్‌ అయ్యింది?

→ ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు రాశారు?
జ: పది పుస్తకాలు రాశాను. కథలు వందల కొద్దీ రాశాను. నేను బి.ఎస్సీ చదివి తెలుగు ఎం.ఏలోకి వచ్చాను భాష మీద ప్రేమతో. ఇవాళ ఎంతమంది అలా  వస్తున్నారు? భాష, సాహిత్యాలకు బడులలో ప్రాధాన్యం లేదు. మార్కులు, ర్యాంకులు ప్రధానమయ్యాయి తల్లిదండ్రులకు. వ్యక్తిత్వం మార్కులతో, ర్యాంకులతో రాగలదా? వ్యక్తిత్వ నిర్మాణమే దేశ నిర్మాణం అని తెలుసుకోవాలి. ఇవాళ టీచర్ల మీద దాడి చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులను ఆదరించని పిల్లలు ఏ సంస్కృతికి ప్రతిఫలం? ఇలాంటి పిల్లలు గొప్ప సాహిత్యం, నైతిక విలువలు  పాదుకొలిపే పుస్తకం ఒక్కటి కూడా చదివి ఉండరు. వీరి చేత చదివించని పెద్దలు వీరి నుంచి మంచి నడవడికను మాత్రం ఆశిస్తారు. అదే విచిత్రం.

→ ‘కబుర్ల దేవత’ పుస్తకానికి మీకు పురస్కారం వచ్చింది. ‘కబుర్ల దేవత’ కథ పేరు. అందులో ఏముంది?
జ: కొంతమంది మాటలు చెప్పి బతగ్గలరు. అదొక స్కిల్‌. అది అందరికీ రావాలని లేదు. అంతమాత్రాన పనిమంతుడికి విలువ తగ్గదు. పని తెలిసినవాడు తన పని తాను చేసుకెళ్లాలి. దానికీ ఫలితం ఉంటుంది. మాట్లాడేవాళ్లను చూసి బెదరిపోవద్దు అనే వ్యక్తిత్వ వికాస కోణంలో ఆ కథ పిల్లలకు చె ప్పాను.

→ మీకు నచ్చిన బాల సాహిత్యకారులు?
జ: కలువకొలను సదానంద గారు మంచి సాహిత్యం రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే శైలి వారిది. కె.సభా కూడా మంచి బాల సాహిత్యం రాశారు. 

→ మీ ఇతర వివరాలు
జ: నేను నెల్లూరు జిల్లాలోనే వివిధ చోట్ల ఉ పాధ్యాయునిగా పని చేసి రిటైర్‌ అయ్యాను. మ అబ్బాయి చెన్నైలో, అమ్మాయి నెల్లూరులో స్థిరపడ్డారు. రిటైరయ్యాక కూడా ఒక స్కూల్‌ బాధ్యతలు చూస్తున్నాను. పిల్లలను కంట్రోల్‌ చేయడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. పిల్లలు ఇలా ఎందుకు ఉన్నారో అందరూ కలిసి ఆలోచించాలి. పిల్లల బాధ్యత సమాజం బాధ్యత అనుకోనంత వరకూ బాలల వికాసం పరిపూర్ణంగా జరగదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
shiva kumar
childrens
Award Winner
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.