Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

వచ్చాడు బసవన్న

Family Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gangireyddu-111.jpg

ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’

గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే  గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...

కొత్త కాలానికి... కొత్త చరణాలు
కాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్‌.

పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్‌ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. 

గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.

– బోణం గణేష్, సాక్షి, అమరావతి

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sankranti 2025
sankranti festival 2023
Basavanna
gangireddulu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..

ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..

 'మన శంకర వరప్రసాద్‌గారు'  ప్రీరిలీజ్‌లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)

'మన శంకర వరప్రసాద్‌గారు' ప్రీరిలీజ్‌లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)

ఈ సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే!

ఈ సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే!

ఏటేటా పెరుగుతున్న బసవన్న.. ఒక్కసారి లేచి రంకె వేస్తే..!

ఏటేటా పెరుగుతున్న బసవన్న.. ఒక్కసారి లేచి రంకె వేస్తే..!

కైకలూరు కోడి పందేల్లో ఆర్జీవీ హీరోయిన్‌ అప్సర రాణి సందడి (ఫొటోలు)

కైకలూరు కోడి పందేల్లో ఆర్జీవీ హీరోయిన్‌ అప్సర రాణి సందడి (ఫొటోలు)

‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్‌ ఫైవ్‌ ఇవేనా?’

‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్‌ ఫైవ్‌ ఇవేనా?’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.