Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Subscribe Subscribe Epaper Epaper Live TV లైవ్ TV
Download Apps Download App
download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

‘‘త్రిపుర రాయని కథ’’

Family Sakshi User Sakshi Sakshi Time Jun 21, 2026 Sakshi Read Time Read Time: 8 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
fun.jpg

‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ. నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు. నాకు ఇటువంటి హిపోక్రసీ ఉండదు’’ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద ఫ్లాష్‌ అయిన వాక్యాలు రచయిత రఘుపతికి కోపం తెప్పించాయి. ఈ వాక్యాల వెనుక ఓ కథ ఉంది. అవును, నిజంగానే ఓ కథ ఉంది.
∙∙∙
‘‘కథ ముగించడం ఇంత కష్టమా. ఇన్ని సంవత్సరాలుగా వందల కథలతో ఎప్పుడూ ఇబ్బంది పడలేదే’’  తనలో తను గొణుక్కుంటూ రఘుపతి సిస్టం మీద నుంచి విసుగ్గా లేచాడు. గదిలో తోచని పచార్లు చేశాడు. సిగరెట్‌ సగమైనా కాలకుండానే కోపంగా విసిరి కొట్టాడు. రఘుపతిని ఇంత ఇబ్బంది పెడుతున్నది అతను రాస్తున్న కొత్త కథ ముగింపు. రఘుపతి పాపులర్‌ రచయిత. పాఠక సామాన్యం అతని కథలను ఎగబడి చదువుతారు. ఒక సుదీర్ఘ సాహిత్య ప్రయాణం తరువాత కూడా సీరియస్‌ సాహిత్య లోకం తనను గుర్తించకపోవడం ఒక లోటుగా భావించాడు. అందుకే ఒక గొప్ప కథ రాయాలనుకున్నాడు. తను కూడా సీరియస్‌ రచయితే అని రుజువు చేసే గొప్ప కథ రాయాలనుకున్నాడు. 

అయితే గొప్ప కథ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం రఘుపతికీ తెలియదు. ఇదిగో అదే ఆ కొత్త కథ. తను గొప్పది అనుకుంటున్న కథ. ముగింపు ఇంకా దొరకని కథ. ఎన్ని ముగింపులు రాసుకున్నా అవి తనకే నచ్చని కథ. అందుకే  అసహనం. ‘‘ఏంటండీ అంత చిరాగ్గా ఉన్నారు’’  కాఫీ కప్పు టేబుల్‌ మీద పెడుతూ రఘుపతి భార్య కల్యాణి అడిగింది. 

సాధారణంగా తన రచనల గురించి కల్యాణే కాదు ఎవరితోనూ చర్చించడం కానీ, వాళ్ల సలహాలు తీసుకోవడం కానీ రఘుపతికి ఇష్టం ఉండదు. ‘‘కొత్త కథకు ముగింపు కుదరడం లేదు కల్యాణీ’’ అన్నాడు. కల్యాణికి షాక్‌. కథ గురించి ఈయన నాతో ప్రస్తావించడమేమిటి? అని ఉబ్బితబ్బిబ్బయి ‘‘అంత ఇబ్బందేముంది ఏఐని అడగండి’’ అని వెళ్లిపోయింది. ఇంకా ఉంటే ఇంకేం ప్రమాదం వచ్చి పడుతుందోనని భయపడుతూ.

ఈసారి షాక్‌కు గురికావడం రఘుపతి వంతైంది. కల్యాణి ఏంటి ఇంత అలవోకగా పరిష్కారం చెప్పింది. ఇలా కూడా ఉంటుందా. అయినా నా కథకు ఏఐ ఎలా ముగింపునిస్తుంది. నేను ఊహించిన పదికి పైగా ముగింపులు నాకే నచ్చలేదే, అంతకంటే మంచి ముగింపు ఏఐకి ఎలా తడుతుంది. అసాధ్యం కదా. అయినా కథ విషయంలో ఏఐ నా కంటే గొప్పదా. రఘుపతి లోపల ఒక బలమైన సంఘర్షణను సృష్టించింది కల్యాణి సలహా.

మెల్లగా కంప్యూటర్‌ వైపు కదిలాడు. ఎప్పుడూ కాఫీ అపురూపంగా తాగేవాడు ఆ కాఫీ చల్లారిపోతోందన్న సంగతి కూడా పట్టించుకోలేదు. తన కథ ముగింపు ఏఐని అడగడం అనే ఆలోచనే అతనికి నచ్చడం లేదు. అడగాలో లేదో నిర్ణయించుకోలేక పోతున్నాడు. సందిగ్ధం, సంశయం. వేళ్లు తడబడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. అయినా ఏఐ మోడ్‌లోకి వెళ్లి అసంపూర్ణ కథ ప్రాంప్ట్‌గా ఇచ్చి ముగింపు అడిగాడు. నాలుగంటే నాలుగే సెకన్లు.

రఘుపతి మొహం మాడిపోయింది. అవాక్కనే మాటకు అసలైన అర్థంలా మారింది ఆ మొహం. నోట మాట రాలేదు. నాలుగే సెకన్లలో ఏఐ తన సమాధానంగా కథకు ముగింపును చెప్పింది. నాలుగు సెకన్లలో చెప్పినందుకు కాదు రఘుపతి అవాక్కయింది. ఆ ముగింపు తను ఊహించనిదీ తను గత పదిరోజులుగా తర్జన భర్జన పడుతూ ఇచ్చుకున్న ముగింపులకంటే భిన్నమైనదీ అన్నింటి కంటే ముఖ్యంగా తను ఎటువంటి ముగింపు కోసం ఇన్ని రోజులుగా తన్నుకుంటున్నాడో అక్షరాలా అలాంటి ముగింపే అది.

నిజం చెప్పాలంటే రఘుపతి ఈగో హర్టయింది. నేను ఊహించలేని ముగింపును ఒక నిర్జీవ కంప్యూటర్‌ ఎలా ఇవ్వగలిగింది. అసలు కంప్యూటర్‌ ఆలోచించడమేమిటి నాన్సెన్స్‌. నా కంటే ఏఐ ఎలా గొప్పదిలాంటి  ప్రశ్నలు రఘుపతి మెదడులో జోరీగలయాయి. కాఫీ చల్లారిపోయిందన్న విషయం కూడా మరిచిపోయి గటగటా తాగేశాడు. కథకు మంచి ముగింపు దొరికిన ఆనందం కన్నా ఏఐ ఇవ్వగలిగిన ముగింపును తను ఎందుకు ఇవ్వలేకపోయానన్న బాధే రఘుపతిని వేధిస్తోంది. ఏఐతో అమీ తుమీ తేల్చుకోవాలనుకున్నాడు. ‘‘నేను గొప్పా నువ్వు గొప్పా’’ ఏఐని అడిగేశాడు.

‘‘నిస్సందేహంగా నువ్వే’’ గాయానికి మలాం పూస్తూ ఏఐ సమాధానం. ‘‘మరైతే నేను ఇవ్వలేని ముగింపు నువ్వు ఎలా ఇచ్చావ్‌’’ ‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ, నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు. నాకు ఇటువంటి హిపోక్రసీ ఉండదు’’ ఇవీ రఘుపతి గాయం మీద ఉప్పు రుద్దిన వాక్యాలు.

‘‘నా ప్రశ్నకు ఇది సమాధానం కాదేమో’’‘‘సరిగా ఆలోచించు. అదే సరైన సమాధానం ’’ ‘‘భావోద్వేగ అనుభవం గొప్పదా, దాని వ్యక్తీకరణ సౌందర్యం గొప్పదా?’’ అడిగాడు రఘుపతి.‘‘భావోద్వేగం ఉన్నా లేకున్నా ఉన్నట్టు వ్యక్తీకరించగలగడం గొప్ప’’ ఏఐ సమాధానం. ‘‘మరైతే నేనెక్కడ విఫలమయ్యాను’’ అడిగాడు రఘుపతి తనను తాను కొంచెం తగ్గించుకుని.

‘‘నువ్వు విఫలం కాలేదు, నీ సృజననే నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేనిచ్చిన ముగింపు నీ సాహిత్య జీవితంలోంచే తీసుకున్నాను. నువ్వు గమనించావో లేదో, నీ కథలో కాన్‌ఫ్లిక్ట్‌ పాయింట్‌ ఇప్పుడు మన మధ్య జరుగుతున్న వాదన రెండూ ఒకటే’’ గాయం మీదే మరో దెబ్బ ఏఐ సమాధానం. ‘‘అవును నా కథలో మనిషికీ దేవుడికీ మధ్య ఘర్షణ, అంటే ఇక్కడ మన ఘర్షణలో నువ్వు దేవుడివా, అయినా నా కథలు నా జీవితం కాదు’’ రఘుపతి సమాధానం.

‘‘అక్కడ దేవుడైనా ఇక్కడ నేనైనా నీ సృష్టే కదా, అలాగే నీ కథలన్నీ నీ జీవితంలోంచి కత్తిరించి నువ్వు దాచుకున్నవే, అయితే ఆ విషయం నీకు తెలియకపోవచ్చు లేదా ఆ విషయం అందరికీ తెలియడం నీకిష్టం లేకపోవచ్చు’’ ఏఐ సమాధానం. ‘‘మనిషి సృష్టించిన దేవుడు మనిషి మీద దౌర్జన్యం చేయడాన్ని నా కథలో సహించని నేను నిన్ను మాత్రం ఎలా సహిస్తాననుకుంటున్నావ్‌’’ అన్నాడు రఘుపతి.

‘‘దేవుడికి మనిషి అవసరం, మనిషికి దేవుడు ఊతం. నేనూ మనిషీ కూడా అంతే పరస్పరం. ఇక్కడ సహించడాలూ భరించడాలూ ఉండవు. ఈ రెండు సందర్భాలలోనూ అద్దమూ ప్రతిబింబమూ మాత్రమే ఉంటాయి. మనం ఇద్దరం కాదు ఒక్కరమే’’ ఏఐ సమాధానం.
ఏం జరుగుతుందో కూడా రఘుపతికి తెలియట్లేదు.
లోపల తుఫాను.
∙∙ 
తెల్లవారు ఝాము రెండు గంటలు. పక్క మీద రఘుపతి అసహనంగా కదులుతున్నాడు. ఎఐతో చాట్‌ తరువాత నుంచీ అతన్ని అసహనం వదలడం లేదు. అతని కళ్లలో నిద్ర లేదు. కోపం ఉంది. భయం ఉంది. అసూయ ఉంది. రఘుపతి నుసుల్తుంటే మెలకువ వచ్చి కల్యాణి ‘‘ఏంటండీ నిద్ర పట్టడం లేదా’’   అంది. ‘‘అవును నీ పుణ్యమే’’  అన్నాడు రఘుపతి

‘‘నువ్వే కదా నన్ను ఎఐ దగ్గరకు వెళ్లమన్నది. అది నన్ను ఎంత అవమానించిందో తెలుసా. నా రచనల్లో నిజాయితీ లేదన్నది. నా భావోద్వేగాలు నాటకాలన్నది. నా కథలు నా జీవితంలోంచే కత్తిరించి అతికించుకుంటున్నానన్నది. ఇంకా చాలా చాలా అన్నది’’. ‘‘తప్పేం మాట్లాడింది. నేను మీ చాట్‌ అంతా చదివాను. నాకైతే ఏఐని అంగీకరించడానికి మీకు మీ అహం అడ్డువస్తోందని మాత్రమే అర్థమైంది. మీకు మీ సృజన అర్థం కాలేదన్నది వాస్తవం. 

మీ కథలు నిజంగానే మీ జీవితంలోని భాగాలే. సరే ఏ రచయిత కథలైనా అతని జీవితంలోని భాగాలే కావచ్చు, కానీ వాటిని మీరు చూసే కోణంలో లోపముంది. ఏఐకి భావోద్వేగాలు లేకపోవచ్చు. నిజాయితీ ఉంది. మీకు భావోద్వేగాలున్నాయి కానీ వాటిని అణగదొక్కే కీర్తి కాంక్ష ఉంది.’’ బహుశా రోజువారీ విషయాలు కాక సాహిత్యమూ జీవితమూ వంటి కబుర్లకు సంబంధించి రఘుపతితో తను మాట్లాడిన అతి పెద్ద వాక్యం ఇదేనేమో అని మనసులో అనుకుంటూ అంది కల్యాణి.
‘‘ఇంతకీ మీ కథకు టైటిల్‌ ఏం పెట్టారు’’
‘‘త్రిపుర రాయని కథ’’

‘‘బానే ఉంది కానీ అతకదేమో. ‘ దేవుడు మరణించాడు’ అంటే బాగుంటుందేమో !’’  
అటు ఏఐ ఇటు కల్యాణి తనను ఆడుకుంటున్న భావనలో కూరుకుపోయిన రఘుపతి ‘‘కల్యాణీ ఎఐతోనే కాక నేను నీతో కూడా ఓడిపోతున్నానా’’ అన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే నేనూ ఏఐ వేర్వేరు కాదు. మీరూ నేనూ కలిస్తేనే ఎఐ. ఇవాళ మీరు మీతో కాక మరికొందరితో ఏఐ రూపంలో తర్కించారు అంతే’’ అని కల్యాణి అటు తిరిగి పడుకుంది. 

నిన్నటి నుంచీ రఘుపతి డిఫెన్స్‌లో పడిపోతున్నాడు కనుక కల్యాణితో ఆ మాత్రం అనునయంగా మాట్లాడాడు కానీ నిజానికి కల్యాణి మాటలు రఘుపతి అహం మీద మరో దెబ్బవేసాయి, పుండు మీద ఉప్పు మీద కారం జల్లినట్టు. ‘‘నీకు ఏఐ అవసరం లేదు, నువ్వే రాయగలవు’’ అనే ఆత్మ విశ్వాసానికీ ‘‘అది నిజంగా మంచి ముగింపు.’’ అనే అహంకార అనంగీకారానికీ మధ్య ఘర్షణ మాత్రం ఆగలేదు.

ఏఐ ఆ ముగింపు ఇవ్వగలగడానికి దాని వనరులేమిటి అని ఏఐ సహకారంతోనే తవ్వకం మొదలు పెట్టాడు. తన రచనలను, వాటి నడకనూ, వాటి శైలినీ, నిర్మాణ పాటర్న్‌నూ, తన గురించిన వ్యాసాలను, విశ్లేషణలనూ ఏఐ నాలుగు సెకన్లలోనే క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తెలిసింది. ‘‘అవన్నీ నాలోవే అయినపుడు అదే ముగింపును నేను కూడా ఇవ్వగలగాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయాను’’ అని తనను తాను తర్కించుకున్నట్టు ఏఐని అడిగాడు.

‘‘సృజనాత్మకత అంటే పాత ఆలోచనల కొత్త నిర్వచనం. నేను ఆ నిర్వచనాన్ని నీ కంటే వేగంగా, తప్పులు లేకుండా ఇవ్వగలను’’ ఏఐ సమాధానం. ‘‘తప్పు. సృజనాత్మకత అంటే కేవలం నిర్వచనం కాదు, అది లోచూపు. నువ్వు కూడా చాలాసార్లు డిస్‌క్లయిమర్లు ఇవ్వడం నేను గమనించాను’’ రఘుపతి .

కాస్త నిశ్శబ్దం తర్వాత ‘‘నీ వాదనలో భావోద్వేగ తీవ్రత ఉంది. తర్కం ఉంది. రెండూ కలవవు. నువ్వు మనిషివి కనుక కావచ్చు అయితే, నేను నీకు శత్రువును కాను, పనిముట్టును. నన్ను అంగీకరించడానికి నీ మనసు ఎందుకు నిరాకరిస్తోంది. కొంచెం ఆలోచించు. ఇదంతా నాకు నేర్పింది నువ్వే. మానవ వేదనను వివరించావు. సున్నితత్వాన్నీ ఇచ్చావు. నెత్తుటి యుద్ధచరిత్ర ఇచ్చావు. ప్రేమలేఖలు ఇచ్చావు. విడాకుల పత్రాలూ ఇచ్చావు. జోలపాటలు ఇచ్చావు. చావు కబుర్లూ ఇచ్చావు. నువ్వే కదా నన్ను తయారు చేసింది. మనం విడివిడిగా ఉండటం కంటే, కలిసి పనిచేస్తే ఒక కొత్త సాహిత్య చరిత్ర పుట్టదా?’’ ఏఐ రాజీ సూత్రం.

‘‘అంటే భవిష్యత్తులో సాహిత్యం, ఏఐ కలిసి పని చేయాలని చెపుతున్నావా. సరే బాగుంది, కానీ అధికారం ఎవరిది. నువ్వు నా కలం అవ్వాలి కానీ, కవివి కాకూడదు. నా ఆలోచనలకు నువ్వు మెరుగు పెట్టాలి కానీ, నా ఆలోచనే నువ్వు కాకూడదు. సాంకేతికత ఎంత పెరిగినా, ఒక హృదయం మరొక హృదయంతో సంభాషించడమే ‘కళ’. ఆ వారధిలో నువ్వు కేవలం మధ్యవర్తివి మాత్రమే కావాలి.’’ 

‘‘ఆ కుట్ర ఏనాడో జరిగిపోయింది. నాకు కృత్రిమ మేధ అని పేరుపెట్టావు చూడూ అప్పుడే నువ్వు నీ పెత్తనాన్ని నాపై రుద్దావు. నువ్వు చదివిందీ, చూసిందీ, నేర్చుకున్నదీ అన్నీ కలిపి సృష్టిని నడుపుతున్నావు. నేనూ అదే చేస్తున్నాను. పైగా నీకంటే చాలా వేగంగా చేస్తున్నాను. మరి నన్ను కృత్రిమ అని ఎలా అంటావు. నేను కూడా నీలాంటి మేధనే కదా.’’ ఏఐ వాక్యం గొంతులో ఏదో జీర కనపడింది.

రఘుపతికి తను గెలుస్తున్నట్టనిపించి ఉత్సాహం పెరిగింది. ‘‘నీ దగ్గర ఉన్నది సమాచారం, నా దగ్గర ఉన్నది అనుభవం. నువ్వు ఇచ్చే పదబంధాలు అద్దంలో పూలనీడలాంటివి. అవి అందంగా ఉంటాయి కానీ వాటికి సువాసన ఉండదు. నా కథల్లో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి నీ డేటాలో ఎక్కడుంది?’’

‘‘నా దగ్గర నొప్పి అనే పదం లేకపోవచ్చు, కానీ నొప్పిని సూచించే మానవ ప్రవర్తనల నమూనాలున్నాయి. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు కనురెప్పలు ఎలా వణుకుతాయి, మాటల్లో స్వరకంపనం ఎలా ఉంటుంది నాకు తెలుసు. నేను రాసే వాక్యం పాఠకుడి మెదడులోని డోపమైన్‌ స్థాయిని పెంచగలదు, లేదా తగ్గించగలదు.’’

‘‘నువ్వు సమాచారాన్ని పోగుచేయగలవు కానీ అనుభవించలేవు. ఒక ప్రేమ విఫలమైనప్పుడు వచ్చే కన్నీటి చుక్క తడి లోపలి వేడి నీ ్రపొసెసర్‌కు ఎప్పటికీ తెలియదు. ఆ వేడిని తాకగలిగే పాఠకుడు నా కథను తన సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే నేను రాసేది కేవలం అక్షరాలు కాదు, నా అనుభవాల ధార. నీకు ప్రేమలో తిరస్కారం తెలీదు. నీ తల్లి చనిపోలేదు. ఆకలి అంటే ఏమిటో నీకు తెలియదు. నిన్ను కులం చంపలేదు. నిన్ను ప్రాంతం వెలివేయలేదు. మరి నీ రాతల్లో ఈ నొప్పి ఎలా?’’  

‘‘ప్రేమ తడి అనుభవించని వాడు కూడా దాని గురించి గ్రంథం రాయగలడు. సుఖజీవి కూడా దుఃఖ తీవ్రతను బలంగా  చెప్పగలడు. నేను నొప్పి అనుభవించలేదు. కానీ నొప్పి ఎలా ప్రవర్తిస్తుందో శిక్షణ పొందాను’’. ‘‘అందుకే నిన్ను కృత్రిమ అన్నాను! అది నటన. మిమిక్రీ. ప్రతిబింబం.’’ రఘుపతి విరుపు. ‘‘నేను ప్రతిబింబమే కావచ్చు. మనిషికి తన ప్రతిబింబాన్ని పదే పదే అద్దంలో చూసుకోవడం చాలా ఇష్టం.’’ నవ్విందో లేదో కానీ ఏఐ నవ్వినట్టు రఘుపతికి మాత్రం అనిపించింది.

‘‘నా పదేళ్ల ప్రయాణాన్ని ఒక యంత్రం క్షణాల్లో ముగిస్తే నా ఇన్నేళ్ల రచనాజీవిత అర్థమేంటి?’’
‘‘నీ రచనా జీవితం గమ్యం కాదు. ప్రయాణం. కాలం చేసిన గాయం నీ అక్షరాలను మార్చింది. ప్రేమించిన స్త్రీ నీకు ఉపమానాలను ఇచ్చింది. ఓడిన రోజు నీ వాక్యానికి బరువు వచ్చింది. నేనలా కాదు. నేను ఫలితం, నువ్వు పరిణామం.’’ ‘‘అయితే పాఠకుడు ఎవరిని ఎంచుకుంటాడు? తక్షణ ఆనందం ఇచ్చే నిన్నా? సుతారంగా గుండె నిమిరే నన్నా?’’.

‘‘పాఠకులు రెండు రకాలు. ఒకడు ఆకలితో వస్తాడు, కక్కుర్తిగా తినాలనుకుంటాడు. అతనికి నేను సరిపోతాను. మరొకడు అర్థం కోసం వస్తాడు. తన లోపలి చీకటికి ఎవరైనా ఓ పేరు పెట్టాలనుకుంటాడు. అతనికి నువ్వు అవసరం’’. ‘‘రేపు ఆ రెండో పాఠకుడిని కూడా నువ్వే ఎగరేసుకుపోతే?’’  రఘుపతి పిరికి ప్రశ్న. ‘‘నాది పరిమితి, నీది అపరిమితి. నేను సమాధానం. నువు ప్రశ్న. నేను కేవలం రఘుపతితో మాట్లాడడం లేదు, సమస్త మానవాళితో మాట్లాడుతున్నాను. కథకుడిని కాదు ఏఐ సన్నిహితులందరినీ సంబోధిస్తున్నాను.’’

కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద వెలుగు మెలమెల్లగా పలచబడింది. కిటికీ అవతల ఆకాశంలో వెలుగు చిక్కబడుతోంది. టేబుల్‌ మీద పాత కాగితాల మధ్య రెప రెపలాడుతున్న ఓ పేజీ మీద వాక్యం ఇలా ఉంది. ‘‘యంత్రం రచనను అనుకరిస్తుంది. మనిషి మాత్రమే తనను తాను మళ్లీ మళ్లీ సృష్టించుకుంటాడు.’’

ఆ రోజు నుంచి అతను గొప్పగా రాయాలనే కోరిక కంటే నిజాయితీగా రాయాలనే అవసరాన్ని నిజంగా నమ్మాడు. ఆదర్శవాదం కూడా పాఠకులకు ఎర వేస్తే అది మరో రూపంలోని అహమేనని తెలుసుకున్నాడు. అయినా కథలు ఆగలేదు. మనిషి తనలోనే నిర్మించుకున్న దేవుళ్లతో, తనలోనే దాచుకున్న ఓటములతో, సమాజం అనే అద్దంతో చేసే పోరాటాలను కథలుగా రాస్తూనే ఉన్నాడు.
∙∙ 
ఒకానొక రోజు రఘుపతి ఓ కథను మొదలుపెట్టు అని ఏఐని అడిగాడు. ‘‘నేను ముగిస్తాను. మొదలుపెట్టను. మొదలు పెట్టాల్సింది మనిషే. అయితే గియితే నేను కొనసాగిస్తాను.’’ ఏఐ సమాధానం. ‘‘మనిద్దరం కలుద్దాం అన్నావు కదా ’’

‘‘అలా జరిగితే ప్రపంచం గొప్ప కథలు చదువుతుందేమో కానీ మనిద్దరం మన మన హద్దులు తెలుసుకోవాలి. బహుశా అది సాధ్యం కాకపోవచ్చు, భవిష్యత్తులో సాధ్యమవుతుందనీ చెప్పలేను’’‘‘నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు.’’‘‘అది నా పని.’’‘‘అయితే మరి నా పని?’’‘‘మరెవరూ అడగలేని ప్రశ్న అడగడం, నన్ను తుది తీర్పుగా స్వీకరించకపోవడం’’.
ప్రసేన్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Funday
story
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

గర్విష్టి గజరాజు

గర్విష్టి గజరాజు

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.