Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు

Family Sakshi User Sakshi Sakshi Time Mar 14, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
charitra.jpg

మార్పు

తమిళనాడులోని పురాతన నృత్య–నాటక రూపం

‘కట్టై కుట్టు’లో మహిళల ప్రాతినిధ్యం ఏ రకంగానూ ఉండేది కాదు.

‘కట్టై కుట్టు’ అంటే ‘పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం’గా

ఉన్న పేరును భారతి తమిళవనన్‌ బృందం మార్చే ప్రయత్నం చేస్తోంది.

‘కట్టై కుట్టు’కు సంబంధించి నటన, సాంకేతికత, సంగీతం, దర్శకత్వం లాంటి వివిధ

విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తోంది. ఎంతో మంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇస్తోంది....




కాంచీపురంలో 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘కట్టై కుట్టు సంఘం’ పురాతన కళాసంప్రదాయం అయిన కట్టై కుట్టును సజీవంగా ఉంచడానికి అంకితం అయింది. ఆ పురాతన కళారూపాన్ని ఈ తరానికి పరిచయం చేయడంతోపాటు ‘ఈ కళలో మహిళలు అద్భుతాలు సృష్టించగలరు’ అని నిరూపించింది.

‘కట్టై కుట్టు నేర్చుకోవడానికి ఆడా, మగా తేడా లేదు. కులం, మతం అడ్డు కాదు అని చెప్పాలనుకున్నాం’ అంటారు కట్టై కుట్టు నిర్వాహకులు.



 ‘కట్టై కుట్టు’ ప్రదర్శన ఆషామాషీ కాదు. ఖరీదైన అలంకరణతో కూడిన ఓపెన్‌–ఎయిర్‌ ప్రదర్శన.సంగీతం, పాటలు, మాటలను ఏకతాటిపైకి తెచ్చి ప్రేక్షకులను రంజింప చేయాలి.

‘ఇంత క్లిష్టమైన కళకు మహిళలు అర్హులు కాదు’ అనే భావనను ‘కట్టై కుట్టు సంఘం’ తొలగించింది. మహిళల అద్భుత కళాప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. మొదట్లో మహిళలను రంగస్థలం మీదికి తీసుకురావడం అనేది అంత తేలిగ్గా జరగలేదు. పురుషులతో కలిసి నటించడానికి కొందరు మహిళలు నిరాకరించారు.  కొందరు ఒప్పుకున్నా వారి తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు.



‘ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా! తినడానికి తిండి కూడా దొరకదు’ అని కొందరు నిట్టూర్చారు.

అయితే ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ  కళాప్రియులైన మహిళలను రంగస్థలం మీదికి తీసుకురాగలిగారు. వారిలో నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగారు.

‘మీరొక చారిత్రక ఘట్టంలో భాగం అవుతున్నారు’ అని చెప్పారు.



ఆ మహిళా కళాకారులు చారిత్రక ఘట్టంలో భాగం కావడమే కాదు చరిత్రను తిరగ రాశారు.‘కట్టై కుట్టు’కు కొత్త వెలుగు తీసుకుచ్చారు.

‘కట్టై కుట్టు’ సంఘంలోని వారందరూ వివాహిత మహిళలే. డిగ్రీ పూర్తి చేసిన వారే.



‘బాడీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్, ఒక పెద్ద డైలాగ్‌ను సంగీతంతో మిళితం చేసే విధానంతో కూడిన కట్టై కుట్టు కళారూపాన్ని మహిళా కళకారులు కూడా అద్భుతంగా చేయగలరని నిరూపించాం’ అంటుంది భారతి తమిళవనన్‌. ఆమె గత పన్నెండు సంవత్సరాలుగా ‘కట్టై కుట్టు’ ప్రదర్శనలు ఇస్తోంది. ఎంతోమంది మహిళలకు నేర్పిస్తోంది.

భారతీ కళాకారుల కుటుంబం నుంచి రాలేదు. తన స్వగ్రామం వేలూరులో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగింది,



‘ప్రదర్శన కోసం వేరే గ్రామాలకు వెళ్లినప్పుడు పురుషులు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వారికి మేము మా ప్రతిభతోనే తగిన సమాధానం చెబుతాం. మహిళలు చేయలేరు అన్నవారే ప్రదర్శన తరువాత మమ్మల్ని ప్రశంసించడం మరిచిపోలేని విషయం’ అంటుంది తమిళి జ్వాననన్‌. వివాహ సమయంలో తప్ప ప్రదర్శనకు  ఎప్పుడూ సెలవు ఇవ్వలేదు తమిళి జ్వాననన్‌.



ప్రముఖ కళాకారిణి సంగీత ఈశ్వర్‌ దగ్గర కట్టై కుట్టు, భరతనాట్యం నేర్చుకున్న తిలగావతి పళని ‘శ్రీకృష్ణ కట్టై కుట్టు కుజు’ పేరుతో స్వంత కట్టై కుట్టు పాఠశాలను నడుపుతోంది.

‘కట్టై కుట్టు కళాకారులు నిరక్షరాస్యులు , మహిళలు ఈ కళారూపానికి తగరు...లాంటి ఎన్నో అపోహలను బద్దలు కొట్టాం’ అంటుంది పళని. ప్రస్తుతం ఆమె తన పాఠశాల ద్వారా 65 మంది విద్యార్థులకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది.



ప్రతిష్ఠాత్మకమైన ‘కట్టై కుట్టు గురుకులం’ ద్వారా గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది కట్టై కుట్టు సంఘం. వీరిలో నుంచి భారతిలాంటి ఎంతో మంది అద్భుత కళాకారులు రంగస్థల ప్రపంచానికి పరిచయం కావచ్చు. ప్రతి సంవత్సరం ‘కట్టై కుట్టు సంఘం’ కాంచీపురంలో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల ఉన్న కళాభిమానులను ఈ ఉత్సవం ఆకట్టుకుంటోంది.

 

ఎన్నో అవరోధాలు అధిగమించి...

మా ఊళ్లో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగాను. నేను కూడా వారిలాగా చేయాలి అని కలలు కనేదాన్ని. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో కట్టై కుట్టు రంగస్థలంపై అడుగు పెట్టడానికి ఎన్ని అవరోధాలు ఉన్నాయో తెలిసింది. అయినా సరే,  ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాను. తల్లిదండ్రులు ప్రోత్సహించారే తప్ప అభ్యంతర పెట్టలేదు. ఈ పురాతన కళారూపంలోకి మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను.

– భారతి తమిళవనన్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
tamil nadu
Bharti
Folk Artist
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.