Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

‘సోషల్‌’ ఘోషలో స్నేహమే సమ్మోహనం

Family Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-1360400024.jpg

‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.

ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.

నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్‌కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్‌లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్‌ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.

గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్‌ ట్రోల్స్, ఇన్‌స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే. 

ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వర్చువల్‌ రియాలిటీ, లార్జర్‌ దాన్‌ లైఫ్, వన్స్‌ ఇన్‌ ఏ లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.

2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్‌ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం.
 

కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. 
 

– ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
New Year Celebrations
Indraganti Mohan Krishna
Film Director
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మెగాఫోన్ ప‌డుతున్న మ‌న హీరోలు!

మెగాఫోన్ ప‌డుతున్న మ‌న హీరోలు!

ఆత్మబంధూ.. సెలవ్‌

ఆత్మబంధూ.. సెలవ్‌

దర్శకుడిగా శేఖర్‌ మాస్టర్‌.. నిజమెంత?

దర్శకుడిగా శేఖర్‌ మాస్టర్‌.. నిజమెంత?

పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్‌ ఎంత?

పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్‌ ఎంత?

4.46 లక్షల చికెన్ బిర్యానీల నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీల వరకు

4.46 లక్షల చికెన్ బిర్యానీల నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీల వరకు

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట తీవ్ర విషాదం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.