Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మహిళా రైతులకు సౌరశక్తి..!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 27, 2026 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
wat11.jpg

వ్యవసాయంలో గుదిబండగా మారిన పాత పద్ధతులను వదిలించుకొని, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చిన్న సన్నకారు రైతులు, ముందడుగు వెయ్యటం అంత తేలిక కాదు.  కానీ, ఒక ఉత్తరప్రదేశ్‌ గ్రామానికి చెందిన మహిళా రైతులు సాగు నీరు తోడటానికి డీజిల్‌ ఇంజన్లకు బదులుగా సమష్ఠిగా సోలార్‌ పంపు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికాదాయం వచ్చే పంటలపై దృష్టి సారించటంతోపాటు నీటిపారుదల ఖర్చును సగానికి తగ్గించుకుంటున్నారు.

డీజిల్‌ ఇంజన్లతో పంటలకు నీరు పెట్టటం రైతులకు చాలా ఖరీదైన, నిర్వహణ కష్టతరమైన, కాలుష్యకారకమైన పని. ఇది గుర్తించిన ఉత్తరప్రదేశ్‌ మహిళా రైతులు నీటిపారుదల కోసం డీజిల్‌ ఇంజన్లకు స్వస్తి చెప్పి సౌరశక్తితో నడిచే పంపు హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పనిలో పనిగా అధిక విలువ కలిగిన పంటలను పండిస్తూ అధికాదాయం ΄పొందుతున్నారు. పనిలో పనిగా నీటిపారుదల ఖర్చును సగానికి సగం తగ్గించుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలోని రాంవాపూర్‌ గ్రామంలో మహిళా రైతుల బృందం ఎండను ఉపయోగించుకొని సాగు నీటి సమస్యకు పర్యావరణహితమైన మార్గం కనుగొంది. ఉమ్మడి సౌరశక్తి నీటి΄ారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సోలార్‌ పంపు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాగు నీటిపారుదల ఖర్చు తగ్గటం, వ్యవసాయంలో సౌలభ్యం పెరగటం, వాయు కాలుష్యాన్ని తగ్గించటం వంటి ప్రయోజనాలు సాధించారు.  

సౌర విద్యుత్‌తో నడిచే నీటి పంపు వ్యవస్థను ఈ మహిళా రైతుల బృందం కోసం 2023 డిసెంబర్‌లో ఇండస్లాండ్‌ బ్యాంక్‌ మద్దతుతో ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఫ్లాగ్‌షిప్‌ ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ్ర΄ోగ్రామ్‌ కింద ఏర్పాటు చేశారు. మహిళా రైతులు ‘గంగా సించాయ్‌ వికాస్‌ సమితి’ బ్యానర్‌ కింద దీన్ని నిర్వహిస్తున్నారు. 

సౌర నీటిపారుదల వ్యవస్థ 20.6 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నిరంతరాయంగా సాగు నీటిని అందిస్తోంది. దీని వల్ల 19 చిన్నకారు రైతుల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. వారు ఇప్పుడు సాంప్రదాయ మొక్కజొన్న, గోధుమ పంటలతోపాటు పుదీనా, కాకర, అరటి, ముల్లంగి, బెండ వంటి అధిక విలువ కలిగిన కూరగాయ పంటలు పండించగలుగుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ నీటిపారుదల ఖర్చులను 50 శాతానికి పైగా తగ్గించింది. సాగు నీటి మీటర్‌ ఏర్పాటైంది. ప్రతి రైతు తమ పొలానికి ఎంత నీరు వాడుతున్నదీ ఇది నమోదు చేస్తుంది. ఒక యూనిట్‌ లేదా 1,000 లీటర్ల నీటిని రూ. 2 ఖర్చుతో అందిస్తారు. అక్కడి స్థానిక పరిస్థితుల్లో ఒక ఎకరానికి 2,50,000–3,00,000 లీటర్ల నీరు అవసరం. దీని మొత్తం ఖర్చు రూ. 500–600 అవుతుంది. ‘గతంలో, డీజిల్‌తో నడిచే పంపులు నడపడానికి రూ. 1,000–1,250 వరకు ఖర్చయ్యేద’ని ఒక మహిళా రైతు దేవి (60) అన్నారు సంతోషంగా. ఆమె కుటుంబం జీవనో΄ాధి కోసం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడింది.

గంగా సించాయ్‌ వికాస్‌ సమితి కమిటీ అధ్యక్షురాలుగా ప్రేమ్‌నందిని దేవి (45) వ్యవహరిస్తున్నారు. సోలార్‌ పంపు ఆపరేటర్‌ గదిలో నిలబడి ఆమె ఇలా వివరించారు: ‘మా బృందంలో ఇద్దరు మహిళలు నీటి వినియోగ ఛార్జీలను సేకరించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ నిధులను సోలార్‌ పంపుసెట్‌ నిర్వహణ, ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన భూమి అద్దె, అలాగే పంప్‌ ఆపరేటర్‌ జీతం కోసం మేం ఉపయోగిస్తాం’. ఈ సోలార్‌ పంపు నిర్వహణ ఖర్చుల కోసం మహిళా రైతులు ఎవరి సహాయమూ అడగటం లేదు. 

ఈ ప్రాజెక్ట్‌ పనితీరుకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంది. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలు, పంట దిగుబడి, నష్టాలు, యూనిట్‌ నిర్వహణ ఖర్చు అవసరాల గురించి వారు చర్చిస్తారు. కుటుంబాల సంక్షేమం, విద్య, జీవనోపాధి సమస్యలపై కూడా మాట్లాడుకొని ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటారు. వారి కుటుంబాల్లోని పురుషులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదు. గేటు బయట నిలబడి చూస్తారంతే. 

అయితే, ఈ మార్పు అంత సులభం కాదు. సాంప్రదాయ డీజిల్‌తో నడిచే పంపు సెట్లను తొలగించడంలో మహిళలే కీలకపాత్ర వహించారు. డీజిల్‌ పంపులతో నీరు తోడటానికి కుటుంబంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు మగ వాళ్లు పనిచేయటం అవసరం. ఇంజిన్‌ను క్రాంక్‌ చేయడంతోపాటు డీజిల్‌ను సేకరించడం కూడా పురుషుల బాధ్యత. 

సాంప్రదాయ పంపు సెట్ల నిర్వహణ ఖర్చులూ ఎక్కువే. 20 ఎకరాలకు నీరు తోడితే దాదాపు 1,372 కిలోల వరకు కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు విడుదలవుతాయి. రాంవాపూర్‌లో ఇప్పుడు మూలనపడి ఉన్న ఆయిల్‌ ఇంజన్లను చూస్తే.. ఒకప్పుడు ఆ గ్రామంలో స్వాతంత్య్రం లేక నిద్రాణంగా మిగిలిన మహిళలు గుర్తుకొస్తారు. ఇప్పుడు వారే క్రియాశీలంగా ఉన్నారు. 

సౌర నీటిపారుదల పథకం విషయంలో తమ కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చిందని, ఇది అయ్యేపనేనా అనే సందేహాలను ఎదుర్కొన్నామని కమిటీ సభ్యులు అంటున్నారు. కొంతమంది పురుషులు ఇది ఎక్కువ కాలం నిలవదని నమ్మారు. మరికొందరు మహిళలతో సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘ఈ ప్రయత్నం విజయవంతమైన తర్వాత, ప్రతి ఒక్కరూ ఇది తాము ఊహించినదేన’ని అంటున్నారని రైతు దేవి (65) అన్నారు. ‘ఇప్పుడు మా వ్యవసాయానికి డీజిలే కాదు, పురుషుల సహాయమూ అవసరం లేదు’ అన్నారామె.

గంగా సించాయ్‌ సౌర నీటిపారుదల ప్రాజెక్ట్‌ సభ్యులైన మహిళా రైతులకు మిగులు ఆదాయం రావటంతో వేరే పనుల్లో పెట్టుబడి పెడుతున్నారు. కుష్మా దేవి (54) సోలార్‌ పంపు నీటితోనే తన సొంత నర్సరీని ప్రారంభించింది. టమోటా, మిరప, పొట్ల, దోస మొదలైన మొక్కల నారును కొబ్బరిపొట్టులో పెంచుతున్నారు. ఒక్కో మొక్క రూ. 5–10కి ఇతర రైతులకు విక్రయిస్తున్నారు. 

‘ఏదీ అసాధ్యం కాద’ని ప్రేమ్‌నందిని దేవి అనే మరో రైతు అన్నారు. ‘మా సమష్టి యాజమాన్యంలో నడిచే సోలార్‌ నీటి పంపే దీన్ని నిరూపించింది. ‘కమిటీలోని ప్రతి ఒక్క మహిళా రైతు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సమావేశాల్లో మాట్లాడే ఉత్సాహం ఒకప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు తమ భర్త పేర్లను సైతం స్వేచ్ఛగా ప్రస్తావించటం వరకు ఎదిగారు. గంగా సించాయ్‌ వికాస్‌ సమితి మహిళలు భవిష్యత్‌ తరాలకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. తమ కుటుంబాల సంక్షేమం తాము ఆధారపడిన సహజ వనరుల రక్షణతో ముడిపడి ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే కదూ.. నిజమైన అర్ధంలో సాధికారత అంటే?
– నిర్వహణ: 
పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌ 

(చదవండి: వర్జిన్‌ కోకోనట్‌తో వండర్స్‌..!)
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
solar energy
water
sagubadi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!

ఆ పువ్వులు, డిస్టిల్డ్‌ వాటర్‌తో ముడతలు మాయం..!

ఆ పువ్వులు, డిస్టిల్డ్‌ వాటర్‌తో ముడతలు మాయం..!

భారత్‌లో ‘వాటర్ పాజిటివ్’గా అమెజాన్

భారత్‌లో ‘వాటర్ పాజిటివ్’గా అమెజాన్

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.