Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్‌’ వార్నింగ్‌..!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sweets.jpg

దీపావళి అనగానే నోరూరించే వివిధ రకాల మిఠాయిలు గురొస్తాయి. టపాసులు ఎంత ఫేమస్సో.. అంతే రీతిలో స్వీట్లు ఫేమస్‌.. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్‌ ఇచ్చి స్వీట్స్‌ తయారు చేయిస్తున్నారు. ఆది, సోమవారాల్లో నేరుగా వచ్చే వినియోగదారుల కోసం స్వీట్‌ దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

సందట్లో సడేమియా అన్నట్లు డిమాండ్‌ ఉన్నప్పుడే నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. రుచి, వాసన, జిగేల్‌ మని మెరిసే రంగుల కోసం వివిధ రకాల రసాయనాలు వినియోగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుతం మార్కెట్‌లో మిఠాయిలకు ఫుల్‌ డిమాండ్‌ 
కనిపిస్తోంది. పండగ రెండు రోజులు ఎగబడి మరీ కొంటారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు వినియోగిస్తున్నారనేది తెలియదు. ఆహార భద్రత అధికారులు సైతం దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేదు. దీంతో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమయంలో మితంగా తింటే సరే.. అతిగా తిన్నామా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. 

స్వీట్స్‌లో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు దారితీయవచ్చు. పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి అవసరాలకు సరిపడా పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు. తద్వారా కల్తీ ఆహార పదార్థాలు, కలుషిత, నిల్వ ఉంచిన వాటి నుంచి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం.. 
పిండి వంటల తయారీ ప్రక్రియలో నూనె, చక్కెర, రంగులు, డ్రైఫ్రూట్స్‌ ఎలాంటివి వినియోగిస్తున్నారో గుర్తించడం కష్టం. రుచి, వాసన, రంగు కోసం కెమికల్స్‌ వినియోగించే అవకాశం లేకపోలేదు. ఇవి పిల్లలు, గర్భిణులు, వృద్ధులుపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. 

కెమికల్స్, కల్తీ పదార్థాలు తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ కావచ్చు. దీర్ఘకాలంలో కేన్సర్, లివర్, కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వ శాఖాపరమైన పర్యవేక్షణ ఉండాలి. తయారు చేసిన వంటకాల ప్యాక్‌పై వినియోగించిన పదార్థాలు, ఫ్యాట్, ఇతర వివరాలు ముద్రించాలి. 
– కిరణ్‌ కుమార్‌ మాదాల, ఐఎంఏ తెలంగాణ మీడియా కో–కన్వీనర్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
diabetics
Diwali 2025
deepavali
Health Tips
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

యోగాసనం.. ఆరోగ్యశాసనం

యోగాసనం.. ఆరోగ్యశాసనం

హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..

హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..

పీసీఓఎస్‌తో జస్ట్‌ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!

పీసీఓఎస్‌తో జస్ట్‌ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!

జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్‌!

జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.