Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంతే..!

Family Sakshi User Sakshi Sakshi Time Mar 3, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
edari.jpg

ఇదో ప్రకృతి కళాఖండం. ఉత్తర ఆఫ్రికాలో ఇథియోపియా ఈశాన్య ప్రాంతంలోని దీన్ని దానకిల్‌ డిప్రెషన్‌ అంటారు. 1,36,956 చదరపు కిలోమీటర్ల మేర కళ్లు చెదిరేంత అందంతో రంగులీనుతుంది ఈ ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే వేరే గ్రహం మీద అడుగుపెట్టినట్లుంటుంది. ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ భూమి నుంచి నిత్యం నిప్పులు ఎగసిపడతాయి. ఇక్కడ నీళ్లు కుతకుతా మరుగుతాయి.

అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఆమ్లవర్షం కురుస్తుంటుంది. మనిషి మనుగడకు అనుకూలం కాని ఈ ఎడారిలో చూడతగ్గ అందాలెన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా నీడలా పొంచే ఉంటాయి. భూమి లోపల అల్లకల్లోలం ఏర్పడినప్పుడల్లా నిప్పులుచిమ్మే లావా ఎగసిపడుతుంది. అది ధారలా పొంగి, కనుచూపు మేర రంగురంగుల కథలెన్నో చెబుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ భూభాగం ఎన్నో మార్పులకు గురైంది. దీనిలోని వైవిధ్యభరితమైన మార్పులను గుర్తించి, దీనికి ‘దానకిల్‌ డిప్రెషన్‌’ అని పేరు పెట్టారు.

దానకిల్‌ చుట్టుపక్కల పెద్దపెద్ద లోయలు, ఎతై న పర్వతాలు, ఉప్పు గోపురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడికి వెళ్లే పర్యాటకులంతా స్థానిక గైడ్‌ అడుగుజాడల్లోనే నడుచుకోవాలని సూచిస్తుంటారు. సురక్షితమైన పాదరక్షలు ధరించి మాత్రమే నడవాలంటారు. చేతులతో ఏదిపడితే అది తాకి చూడటం ప్రమాదమని హెచ్చరిస్తారు. గ్రహాంతర ప్రదేశంలా ఉండే ఈ దానకిల్‌లో వేడి నీటి బుగ్గలు, ఆమ్ల కొలనులు, సరస్సులు మైమరిపిస్తుంటాయి. అయితే ఈ ఎడారి ఎందుకు ఇంత వేడిగా ఉంటుంది? భూమి లోపల ఏం జరుగుతూ ఉంటుంది? లాంటి వివరాలను శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోయారు. దాంతో భూమి మీద ఈ ప్రదేశం మిస్టీరియస్‌గానే మిగిలిపోయింది.

ఇథియోపియాలో కొన్ని శతాబ్దాల క్రితం ఉప్పును కూడా కరెన్సీగా ఉపయోగించేవారట. అందుకోసం ఉప్పును సేకరించేందుకు ఈ ప్రదేశానికి వెళ్లేవారట. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎర్ర సముద్రంలో భాగంగా ఉండేది. కాలక్రమేణా అగ్నిపర్వతాల విస్ఫోటాల కారణంగా.. కొంతభాగం సల్ఫ్యూరిక్‌ సరస్సులా మారింది. మరికొంత భాగం లావాతో బీటలువారి ఎడారిని తలపిస్తుంది. శిలాద్రవంలోని ఖనిజాలు, సముద్రపు ఉప్పు నీరు, ఆమ్ల వర్షపు నీరు కలసి పసుపు, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులతో ఈ ప్రాంతమంతా మెరుస్తుంది. ఇక్కడ కొంత సురక్షితమైన భూభూగానికి పర్యాటకులు తరచుగా వెళుతుంటారు. చూడటానికి ఈ పరిసర ప్రాంతాలన్నీ చాలా వింతగా ఉంటాయి. ఒక చోట వేడి నీరు.. పొగలు కక్కుతుంటే, పక్కనే మరో చోట చల్లటి నీటి కొలను సేదతీరుస్తుంది. మనుషులను మునిగిపోనివ్వకుండా తేలియాడిస్తూ ఆటలాడిస్తుంది. 

--సంహిత నిమ్మన

(చదవండి: కాదేది రికార్డుకనర్హం! అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..!)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hottest
hill
north east
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌

కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌

ధ్యాన ప్రయాణం

ధ్యాన ప్రయాణం

కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి

కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి

హాటెస్ట్‌ కర్రీ చాలెంజ్‌.. ఈ బ్రో తిప్పలు చూడండి!

హాటెస్ట్‌ కర్రీ చాలెంజ్‌.. ఈ బ్రో తిప్పలు చూడండి!

అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అదీ గ్లాస్‌ బ్రిడ్జ్‌..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!

అదీ గ్లాస్‌ బ్రిడ్జ్‌..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.