Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

గుళి సామ.. ఎకరానికి 11 క్వింటాళ్లు!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 29, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gulisama_main.jpg

ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంట విస్తృతంగా సాగవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతర చిరుధాన్యాలతో పాటు సామలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గిరిజన రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ పంట విస్తీర్ణం కూడా విస్తరిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించడానికి శ్రమ, పెట్టుబడి పెద్దగా అవసరం లేనిది సామ. అందువల్ల గిరిజనులందరూ ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ పంటను పండించి, తాము తింటూ, మిగతా సామలు అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని  పొందుతున్నారు. 

పూర్వం సామ ధాన్యాన్ని తిరగలిలో మరపట్టి బియ్యంలా మార్చుకొని సామ అన్నం, ఉప్మా, జావ వంటి సాంప్రదాయ వంటలు వండుకునే వారు. ఈ మధ్య మైదాన ప్రాంతాల ప్రజల్లో కూడా చిరుధాన్యాల వినియోగం పెరగడం, వీటితో బిస్కట్లు, కేక్‌ వంటి వివిధ రకాల చిరు తిండి ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం వల్ల చిరుధాన్యాల ధరలు పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.

అప్పుడు చోడి, ఇప్పుడు సామ 
ఈ క్రమంలో వికాస స్వచ్చంద సంస్థ 2016లో చోడి /రాగి పంటలో గుళి సాగు పద్ధతిని ప్రవేశపెట్టింది. సాధారణంగా రైతులు చిరుధాన్యాల విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పండిస్తుంటారు. నారు పెంచి,  పొడి దుక్కిలో వరుసల్లో గుంతలు తీసి నాట్లు వేసుకునే పద్ధతిలో పండించడాన్నే ‘గుళి’ (గుళి అంటే గిరిజన భాషలో గుంట అని అర్థం) పద్ధతిగా పిలుస్తున్నారు. గుళి చోడిని పద్ధతిలో పండిస్తూ గిరిజన రైతులు దిగుబడిని ఎకరాకు 400 కేజీల నుంచి దాదాపు 1000 కేజీల వరకు పెంచుకోగలిగారు. ఈ క్రమం లోనే వికాస సంస్థ 2024 ఖరీఫ్‌ పంట కాలంలో గుళి పద్ధతిలో సామ పంటను సాగు చేయటానికి 54 మంది గిరిజన రైతులకు తోడ్పాటునందించింది.

30–35 రోజుల మొక్క నాటాలి
ప్రధాన పొలం చివరి దుక్కిలో 200 కేజీల ఘన జీవామృతాన్ని చల్లడం వల్ల భూమికి బలం చేకూరి, రైతులు మంచి దిగుబడి సాధించారు. సామ పంట ముఖ్యంగా పెద్ద సామ రకం బాగా ఎత్తు పెరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత 30 నుండి 35 రోజుల మధ్య వెన్ను రాక ముందే తలలు తుంచాలి. దీని వల్ల పంట మరీ ఎత్తు పెరగకుండా, దుబ్బులు బలంగా పెరుగుతాయి. గాలులకు పడిపోకుండా ఉంటుంది. 

దుంబ్రీగూడ మండలం లోగిలి గ్రామంలో కొర్రా జగబంధు అనే గిరిజన రైతు పొలంలో గుళి పద్ధతిలో పండించిన పెద్ద సామ పంటలో క్రాప్‌ కటింగ్‌ ప్రయోగాన్ని నిర్వహించారు. రైతులు, వికాస సిబ్బంది, నాబార్డ్‌ జిల్లా అధికారి చక్రధర్‌ సమక్షంలో సామలను తూకం వేసి చూస్తే.. ఎకరాకు దాదాపు 1,110 కేజీల (11.1 క్వింటాళ్ల) దిగుబడి నమోదైంది. ఈ పొలానికి పక్కనే రైత్వారీ పద్ధతిలో వెదజల్లిన సామ పొలంలో దిగుబడి ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీలు మాత్రమే! 

గుళి సాగు ప్రత్యేకత ఏమిటి?
రైత్వారీ పద్ధతిలో ఎక్కువ విత్తనం వెదజల్లటం, నేలను తయారు చేసే సమయంలో ఎటువంటి ఎరువు వేయక΄ోవడం, ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండటంతో పంట బలంగా పెరగలేకపోతోంది. 

గుళి పద్ధతిలో లేత నారును పొలంలో వరుసల మధ్య అడుగున్నర దూరం, మొక్కల మధ్య అడుగు ఉండేలా నాటుతారు. రైత్వారీ వెద పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం. దీనికి బదులు మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం (దాదాపు పది శాతం మాత్రమే) సరిపోతుంది. నారు పెంచుకొని 15 నుంచి 20 రోజుల వయసు మొక్కల్ని  పొలంలో నాటుకోవడం వల్ల విత్తన ఖర్చు దాదాపుగా 90 శాతం తగ్గుతోంది. 

మొక్కల సాంద్రత తగినంత ఉండి, మొక్కలు పెరిగే సమయంలో ప్రతి మొక్కకూ చక్కగా ఎండ తగలుతుంది. ఘన జీవామృతం వల్ల నేల సారవంతమై సామ మొక్కలు బలంగా పెరిగి, మంచి దిగుబడి వస్తున్నట్టు గమనించామని వికాస సిబ్బంది వెంకట్, నాగేశ్వర రావు, తవుడన్న చెబుతున్నారు. 

దూరంగా నాటడం వల్ల దుక్కి పశువులతో కానీ, సైకిల్‌ వీడర్‌తో కానీ కలుపు తొందరగా, సులభంగా తియ్యవచ్చు.  మొక్కలు బలంగా , ఏపుగా పెరగటం వల్ల కోత సమయంలో వంగి మొదలు నుంచి కోసే బదులు, నిలబడి వెన్నులు కొయ్యడం వల్ల సమయం ఆదా అవడమే కాక సులభంగా పంట కోత జరుగుతుండటం మరో విశేషం.   


మున్ముందు వరిగ, ఊద కూడా..
అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంటను ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా గుళి పద్ధతిలో పండించిన గిరిజన రైతులకు ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైత్వారీ వెద పద్ధతిలో 2 క్వింటాళ్లకు మించలేదు. కనువిందు చేస్తున్న ఈ పొలాలను చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను, మహిళలకు చూపిస్తున్నాం. వారు కూడా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు నాటే పద్ధతిని అనుసరించేలా ్ర΄ోత్సహిస్తున్నాం. ఇప్పటికే గిరిజన రైతులు చోడి సాగులో గుళి పద్ధతిని ΄ాటిస్తున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే సామ రైతులు గుళి పద్ధతికి మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వరిగ, ఊద పంటల్ని కూడా గుళి పద్ధతిలో సాగు చేయిస్తాం. 
– డా. కిరణ్‌ (98661 18877), వికాస స్వచ్ఛంద సంస్థ, 
అల్లూరి సీతారామరాజు జిల్లా 

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Millets
Farming
Different
Yield
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం

ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం

సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ!

సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ!

భారీ సబ్సిడీ స్కీమ్‌.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!

భారీ సబ్సిడీ స్కీమ్‌.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!

వర్జిన్‌ కోకోనట్‌తో వండర్స్‌..!

వర్జిన్‌ కోకోనట్‌తో వండర్స్‌..!

నమో డ్రోన్‌ దీదీ స్కీమ్ గురించి తెలుసా?

నమో డ్రోన్‌ దీదీ స్కీమ్ గురించి తెలుసా?

బడ్జెట్ 2026లో వ్యవసాయానికి కొత్త దిశ!

బడ్జెట్ 2026లో వ్యవసాయానికి కొత్త దిశ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.