Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కృతజ్ఞత కనీస సంస్కారం

Family Sakshi User Sakshi Sakshi Time Mar 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-165667302.jpg

మంచిమాట

మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞులై ఉండడం మన కనీస ధర్మం... మనం ఎవరి నుంచైతే మేలు పొందుతున్నామో, వారు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా, వారి 
ఉదారతను గుర్తించి వారికి కృతజ్ఞతలు  తెలుపుకోవడం మన విధిగా భావించాలి.  ఎందుకంటే అలా కృతజ్ఞతలు తెలియ చేసినపుడే మన సంస్కారం ఏమిటో ఇతరులకు  అర్థమవుతుంది. అంతేకాదు అది మనసుకు కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

మనం ఇతరుల నుంచి ఎలాంటి సహాయం పొందినా వారికి కృతజ్ఞులై ఉండాలి. తల్లితండ్రులు మనకి జన్మనిస్తారు.. మన భవిష్యత్‌ కు పునాదులు వేస్తారు.. అందువల్ల మనం వారికి జీవితాంతం కృతజ్ఞులై ఉండాలి. మన గురువులు మన భవిష్యత్ కు దిశానిర్దేశం చేస్తారు, మన స్నేహితులు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు, ఇలా అనేక మంది పరోక్షంగా మన భవిష్యత్‌కు ఎంతగానో సహకరిస్తున్నారన్నమాట.. మన భవిష్యత్‌ను వారంతా తీర్చి దిద్దుతున్నపుడు వారికి మనం కృతజ్ఞతలు చూపించుకోవాలి కదా.. కృతజ్ఞతలు తెలియ చేయడం మన వ్యక్తిత్వాన్ని చాటి చెబుతుంది.. మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినపుడు నవ్వుతూ ధాంక్సండీ.. మీ మేలు మరచి పోలేను అని చెప్పి వారి కళ్లలోకి ఒక్కసారి తొంగి చూస్తే, వారి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం మనకు కనిపిస్తుంది.. వారికి మన పట్ల మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దానివల్ల అవతలి వారు భవిష్యత్‌లో వారితో మనకేదైనా పని పడ్డప్పుడు, వారు ఇక ఆలోచించకుండా మనకు సహాయం చేస్తారు.

శ్రీరామచంద్రుడ్ని మనం దేవుడిగా పూజిస్తాం.. అయితే రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్ముడే అయినా ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు తనను ఒక మానవమాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అలా రాముడు ప్రతీ విషయంలోనూ కృతజ్ఞతను చాటుకోవడం వల్లనే ఆయనను మనం పూజిస్తున్నాం.. ఆరాధిస్తున్నాం... మనం భూమి మీద నడుస్తున్నాం. పంటలను పండించుకుంటున్నాం... కనుక భూమిని భూదేవి‘ అనీ, మనం బతికుండడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న నీటిని ‘గంగాదేవి’ అనీ, గాలిని వాయుదేవుడు అనీ పిలుస్తూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాం.

 ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు  ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి. సమస్త ప్రకృతి మన భావాలను గ్రహించి తదనుగుణంగా స్పందిస్తుంది కనుక మనకు చక్కగా ఆక్సిజన్‌ ఇస్తున్న చెట్లకూ, నీటికీ కృతజ్ఞతలు చెప్పాలి. మన జీవితానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తికీ, వస్తువుకు, జీవికి మనం కృతజ్ఞులై ఉంటే, అదే మన భావి జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. మన జీవితాన్ని నందనవనం చేస్తుంది.
 

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు  ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి.

– దాసరి దుర్గా ప్రసాద్, ఆధ్యాత్మిక పర్యాటకులు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gratitude
culture
help
Life
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రయాణంలో సరైన బ్యాగ్‌ ఎంపిక..

ప్రయాణంలో సరైన బ్యాగ్‌ ఎంపిక..

పాప బతకాలంటే రూ .17 కోట్ల ఇంజెక్షన్ కావాలి!

పాప బతకాలంటే రూ .17 కోట్ల ఇంజెక్షన్ కావాలి!

జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం

జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం

‘గుర్రాల స్నానం’ 300 ఏళ్ల పాత పండగ గురించి తెలుసా?

‘గుర్రాల స్నానం’ 300 ఏళ్ల పాత పండగ గురించి తెలుసా?

‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ!

‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ!

యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!

యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.