Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..

Family Sakshi User Sakshi Sakshi Time Jul 31, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
crime2.jpg

న్యాయ విచారణలో తీర్పులెప్పుడూ బలహీనుల పక్షమే ఉండాలి... నేరానికి బలైనా, నేరం చేసినా! ఆ బలహీనుల వర్గంలో పిల్లలు, మహిళలు ముందుంటారు!  అందుకే... హనీమూన్‌ మర్డర్‌ మొదలు ఆడవాళ్లు చేసినట్టుగా నమోదవుతున్న ఆ తరహా నేరాల విషయంలో వాటి వెనుకున్న సామాజిక ఒత్తిళ్ల మీద చర్చ జరగాలి.. ఆ వాతావరణాన్నివిశ్లేషించాలని సోషల్‌ ఇంజినీర్స్, సైకాలజిస్ట్‌లు అంటున్నారు. వాటిని సుప్రీంకోర్ట్‌ కూడా పరిగణనలోకి తీసుకుంది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు దాన్నుంచితప్పించుకోవడానికి చేసిన నేరాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఓ అభిప్రాయాన్ని వెల్లడించింది.

సమాజంలోని లింగవివక్ష, సామాజిక నిబంధనలు చాలావరకు స్త్రీని పరాయిగా చూస్తూ.. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దూరం చేస్తూ ఆమెను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ అణచివేత, నిస్సహాయతే నేరాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంతో నేరం చేసిన స్త్రీల విషయంలో కఠినమైన శిక్షలకన్నా సంస్కరణ దృక్పథాన్ని అనుసరించాలని ఉద్ఘాటించింది సుప్రీం కోర్ట్‌.

ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం.. 
కర్ణాటకకు చెందిన శుభ అనే కాలేజ్‌ స్టూడెంట్‌.. తన స్నేహితుడు అరుణ్‌ వర్మతోపాటు వెంకటేశ్, దినేశ్‌ అనే ఇంకో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన కాబోయే భర్తను హత్య చేసింది. నిజానికి శుభకు ఆ పెళ్లి ఇష్టంలేదు. అయినా తల్లిదండ్రులు బలవంతపెట్టడంతో ఆ విషయాన్నే తన స్నేహితుడు అరుణ్‌కి చెప్పి, పెద్దలు నిశ్చయించిన ఆ వరుడి హత్యకు కుట్ర పన్నింది. ఈ కేస్‌ పూర్వపరాలను పరిశీలించిన సుప్రీంకోర్ట్‌.. ‘లింగవివక్ష, ఏళ్ల నుంచి పాతుకుపోయిన జెండర్‌ రోల్స్‌ వంటివన్నీ మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకెళ్లుగా మారుతూ వారిని అణచివేస్తున్నాయి. 

అది వాళ్లలో ధిక్కార ప్రవర్తనకు కారణమవుతోంది. ఫలితంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక మహిళలు చాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ హక్కును ఆస్వాదించాలనుకుంటున్నారు. ఉదాహరణకు.. చదువుకున్న అమ్మాయి ‘ఆశలు’ అనే రెక్కలు తొడుక్కోవాలనుకుంటుంది. ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటుంది. ఈ క్రమంలో బలవంతపు పెళ్లి తన జీవిత లక్ష్యానికి విడాకులు ఇప్పిస్తుంది. 

పై చదువులకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది కచ్చితంగా ప్రతి చర్యకు దారితీస్తుంది. అయితే ఈ రియాక్షన్స్‌ మహిళ మహిళకు మారుతుంటాయి.. వాళ్ల నేపథ్యం, స్నేహాలను బట్టి. ఉదాహరణకు మధ్యతరగతికి చెందిన అమ్మాయి.. పేదింటి లేదా ధనిక కుటుంబపు అమ్మాయిల కంటే భిన్నంగా రియాక్ట్‌ కావచ్చు. తీసుకునే నిర్ణయాన్ని అది ప్రభావితం చేయొచ్చు’ అని విశ్లేషించింది. 

నేరస్తులు అందరిపట్లా...
స్త్రీలకు సంబంధించి.. నేరానికి ఉసిగొల్పిన సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నేరస్థుల సంస్కరణ దిశగా తీర్పులు ఉండాలన్న సుప్రీంకోర్ట్‌ అభిప్రాయం హర్షించదగ్గది. అయితే దాదాపుగా నేరాలన్నిటికీ సామాజిక పరిస్థితులే కారణాలుగా ఉంటాయి. నేరస్థుల అందరిపట్లా ఇలాంటి అప్రోచే ఉండాలి. శిక్ష తర్వాత సమాజంలోకి వచ్చిన వాళ్లను సానుకూల దృక్పథంతో చూడాలి. సహానుభూతి ఉండాలి. 
– ప్రొఫెసర్‌ బీనా చింతలపురి

సంస్కరించడమే పరిష్కారం
మన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్‌ లేకపోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. 

ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో  వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.
– రాజ్‌ రాచకొండ, సినీ దర్శకుడు
కారణాలను పరిగణించాలి... 
సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు మహిళలు/అమ్మాయిల స్వేచ్ఛను అడ్డుకోవడమేకాక వాళ్లను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు నేరాలకు దారితీయొచ్చు. కాబట్టి వారిలో పరివర్తన తీసుకురావడం ఎంత అవసరమో.. ఆ సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని వారికి క్షమాభిక్ష పెట్టడమూ అంతే అవసరమంటూ సుప్రీంకోర్టు చేసిన సిఫార్సు ఆహ్వానించదగినది. అలాగని సుప్రీంకోర్టు నేరాన్ని సమర్థించట్లేదు. 

నేరస్థులను చంపితే నేరం చావదని, నేరస్థుల పరివర్తన మీద దృష్టిపెట్టి.. నేర స్వభావానికి కారణమైన సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరానికీ, నిస్సహాయ స్థితిలో ఒక అమ్మాయి చేసిన నేరానికి చాలా తేడా ఉంటుంది. రెండింటిలో శిక్ష ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, వారిలో తేవాల్సిన పరివర్తన ధోరణి, అలాగే క్షమాభిక్ష పెట్టేప్పుడు పరిగణించాల్సిన అంశాలు వేరేగా ఉండాలి.
– మామిడి సుధేష్ణ, హైకోర్ట్‌ అడ్వకేట్‌

సంస్కరించడమే పరిష్కారం
మన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్‌ లేక΄ోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. 

ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో  వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.
– రాజ్‌ రాచకొండ, సినీ దర్శకుడు 

(చదవండి: కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Crime -free society
Supreme Court
crime against woman
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ విచారణ జూలైకి వాయిదా!

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ విచారణ జూలైకి వాయిదా!

సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.