Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు

Family Sakshi User Sakshi Sakshi Time May 8, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sindoor_0.jpg

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఒక సంచలనమైతే... ప్రెస్‌మీట్‌లో మిలిటరీ బ్రీఫింగ్‌ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి  జయించే మహిళాశక్తి కనిపించింది. 

ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం.  ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన  శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్‌కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్‌ సోఫియా ఖురేషీ,  వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌...

భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్‌ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్‌లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్‌ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్‌ను కొనసాగించడంలో ప్రొఫెషనల్‌ ఆఫీసర్స్‌ పాత్రను వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌ వివరించారు.

ఆ ఇల్లు సైనిక శిబిరం
అది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భారత  సైన్యంలో చేరారు.

చరిత్ర సృష్టించి...
పుణెలో జరిగిన ‘ఎక్సర్‌సైజ్‌ ఫోర్స్‌ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్‌సైజ్‌ ఫోర్స్‌ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్‌.

గర్వించదగిన కాలం
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.

ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్‌ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్‌. భారత పార్లమెంట్‌ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది.                                       

ఆకాశ పుత్రిక
ఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్‌. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!

‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్‌ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్‌ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్‌.

ఎన్‌సీసీ పునాదిపై...
ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పుడు ఎన్‌సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్‌ పైలట్‌గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్‌ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.
జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్‌లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్‌ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. 

కమాండర్‌ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌తో సహా సీనియర్‌ డిఫెన్స్‌ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలక రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం.    

ఆ ఇద్దరు... ది స్ట్రెంత్‌ ఆఫ్‌ ఇండియా
కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్‌ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్‌లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని  కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్‌ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్‌ ఆర్మీకి చెందిన కల్నల్‌ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్‌ గుర్మెహర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Wing Commander Vyomika Singh
Operation Sindoor
Colonel Sofiya Qureshi
army officers
Pahalgam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పహల్గామ్‌ నరమేధం..  సూత్రధారి ఇతడే!

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి ఇతడే!

భారత్‌ను దెబ్బకొట్టే ప్లాన్‌.. పాక్‌ కొత్త వ్యూహం!

భారత్‌ను దెబ్బకొట్టే ప్లాన్‌.. పాక్‌ కొత్త వ్యూహం!

High Alert In India : యుద్ధంలోకి భారత్

High Alert In India : యుద్ధంలోకి భారత్

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?

అమ్మో.. ఆ రోజు నేను చూసింది అదే!

అమ్మో.. ఆ రోజు నేను చూసింది అదే!

‘పహల్గాం’ దర్యాప్తు: ‘గోప్రో’లో కీలక రహస్యాలు?

‘పహల్గాం’ దర్యాప్తు: ‘గోప్రో’లో కీలక రహస్యాలు?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.