Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఉమ్మనీరులోనే ఊపిరిపోశారు!

Family Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Chaos-Health-Image-2.jpg

అమ్మకడుపులో ‘కెయాస్‌’ను సరిదిద్దిన డాక్టర్లు!

ఇంగ్లిష్‌లో ‘కెయాస్‌’ (ఇఏఅౖ ) అనే మాట ఒకటుంది. దాని అర్థం గందరగోళం, అస్తవ్యస్తం, అల్లకల్లోలం అని. వైద్యపరిభాషలోనూ ‘కెయాస్‌’ అనే యాక్రనిమ్‌ ఉంది. ‘కంజెనిటల్‌ హై ఎయిర్‌ వే అబ్‌స్ట్రక్షన్‌ సిండ్రోమ్‌’ అనే వ్యాధి తాలూకు మొదటి అక్షరాలతో ఈ యాక్రనిమ్‌ రూపొందింది.  ‘కెయాస్‌’ అంటే... నిజంగా చిన్నారి జీవితాన్ని అల్లకల్లోలం చేసే రుగ్మతే అది. 20 వారాల గర్భస్థ శిశువుకు వచ్చిన వ్యాధి అది. చికిత్స చేయకపోతే పుట్టిన వెంటనే చిన్నారి చనిపోతాడు. చికిత్స చేయాలంటే ఆ బుడతడు తల్లిగర్భంలో ముడుచుకుని ఉన్నాడు. మరెలా? అందుకే ఆ (గట్టి) పిండం వయసు కేవలం 20 – 24 వారాలప్పుడే తల్లి గర్భంలోనే సర్జరీ నిర్వహించారు
డాక్టర్లు. ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ స్టోరీని మరపించేంత ఉత్కంఠభరితంగా, ఉద్వేగపూరితంగా సాగే ఈ ‘కెయాస్‌’ను సరిదిద్దడానికి జరిగిన ఓ సంయుక్త కృషిని చూద్దాం రండి.

తల్లి గర్భాన్ని తెరచి... ఓ బుడతడి తల, మెడ, ఛాతీని కొద్దిగా బయటకు తెచ్చి, చికిత్స చేసిన ఈ కేసు చాలా అరుదైనదీ, అపూర్వమైనదీ! ఇందులో అనేక వైద్యవిభాగాల సంయుక్త, సంక్లిష్ట కృషి ఉంది. అత్యంత సునిశితమైన శస్త్రచికిత్సా నైపుణ్యాలున్న డాక్టర్ల సునిశితమైన మునివేళ్ల కదలికలున్నాయి. ఓ పియానో మీదా, ఓ కీబోర్డు మీదా వాద్యకారుల వేలిచివరలు చక్కగా నృత్యించి సృష్టించిన మ్యూజిక్‌లా... ఆ సర్జన్ల అమృతాంగుళీకాలు తమ స్కాల్‌పెల్‌లూ, కత్తెర్లతో చేసిన మ్యాజిక్‌ను పరికిద్దాం పదండి.

సమస్య ఏమిటంటే... 
చైనాలోని చాంగ్‌ క్వింగ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రెన్స్‌ హాస్పిటల్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో...  తల్లి కడుపులో ఉన్న ఆ చిన్నారికి ‘కంజెనిటల్‌ ల్యారింజియల్‌ ఎస్ట్రేషియా’ అనే జన్యుపరమైన లోపముంది. ఈ లోకంలోని ఎవ్వరిలోనైనా గాలి ముక్కు నుంచి ట్రాకియా (ఒకే గొట్టంలా ఉన్న పైప్‌); అటు తర్వాత ల్యారింగ్స్‌ (స్వరపేటిక) ఆ పైన బ్రాంకై అనే రెండుగా చీలిన పైపుల ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కానీ ఆ బిడ్డలో ల్యారింగ్స్‌ పూర్తిగా మూసుకుపోయి ఉంది. ఆ బిడ్డ పుట్టాక శ్వాస తీసుకోవాలంటే ల్యారింగ్స్‌ బ్లాక్‌ అయి ఉంది కాబట్టి ఊపిరితీసుకోలేడు. కాబట్టి చనిపోతాడు. ఇదీ జన్యుపరమైన ఆ సమస్యతో ఉన్న ముప్పు. 

ఎలా గుర్తించారు? 
తల్లికి చేసే అల్ట్రాసౌండ్, ఫీటల్‌ ఎమ్మారైలతో సమస్యను గుర్తించారు. వాటిల్లో... ∙ఊపిరితిత్తులు చాలా పెద్దగా కనిపించాయి ∙డయాఫ్రమ్‌ సరిగా కనిపించలేదు ∙ట్రాకియా, బ్రాంకై చాలా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్లు సమస్యను ‘కంజెనిటల్‌ హై ఎయిర్‌ వే అబ్‌స్ట్రక్షన్‌ సిండ్రోమ్‌’ (కెయాస్‌)గా గుర్తించారు.

‘కెయాస్‌’ అంటే...? 
మిగతా అందరిలోలాగే తల్లికడుపులో ఉన్న చిన్నారి తాలూకు ఊపిరితిత్తులు కూడా గర్భంలో ఉన్నప్పుడే ఒక రకమైన ద్రవాన్ని (ఫ్లూయిడ్‌ను) తయారు చేస్తుంటాయి. ఆ ఫ్లుయిడ్‌ ఎప్పటికప్పుడు బయటకు రావాలి. కానీ చిన్నారి ‘ఎయిర్‌ వేస్‌’ బ్లాక్‌ అయిపోయి ఉన్నాయి. అలా బ్లాక్‌ అయితే ఫ్లూయిడ్‌ బయటకు రాదు. లంగ్స్‌లోనే పేరుకుపోతుంది. అందుకే లంగ్స్‌ రెండూ బెలూన్స్‌లా ఉబ్బిపోయి ఉన్నాయి. ‘కెయాస్‌’ అంటే ఇదే మరి!

మామూలుగానైతే ప్రసవం అయ్యాక... 
మామూలుగా అన్ని కేసుల్లో ప్రసవమై, బిడ్డ బయటకు రాగానే ΄్లాసెంటా – అంబలికల్‌ కార్డ్‌ (తల్లి నుంచి బిడ్డకు ఉండే పైప్‌) కట్‌ చేస్తారు. దాంతో ΄్లాసెంటా నుంచి బిడ్డకు అందే ఆక్సిజన్‌ ఆగిపోతుంది. ఇక ఇప్పట్నుంచి బిడ్డ స్వయంగా శ్వాస తీసుకోవాలి. కానీ ఈ చిన్నారికి ‘ఎయిర్‌వేస్‌’ మూసుకుపోయాయి. అంటే ΄్లాసెంటా అంబలికల్‌ కార్డ్‌ కట్‌ చేసిన వెంటనే బిడ్డకు ఆక్సిజన్‌ సప్లై ఆగిపోతుంది. ఊపిరి అందదు. ఇది ప్రాణాంతకం.

ఇక్కడ డాక్టర్లు ఏం చేశారంటే? 
ఈ కేసులో డాక్టర్లు ‘ఎక్సిట్‌’ అనే ఓ ప్రణాళిక రచించారు. ఈ ‘ఎక్సిట్‌’ కూడా ‘ఎక్స్‌ యుటెరో ఇంట్రాపార్టమ్‌ ట్రీట్‌మెంట్‌’ అనే శస్త్రచికిత్స తాలూకు యాక్రనిమ్‌యే. అందులో... బిడ్డను కనే తల్లులకు చేసినట్టే తొలుత సిజేరియన్‌ చేశారు. కాకపోతే ఈ ప్రణాళికలో డాక్టర్లు ఓ డిఫరెంట్‌ వ్యూహమనుసరించారు. 
తేడా ఏమిటంటే... బిడ్డను పూర్తిగా బయటకు తీయలేదు. కేవలం తల, మెడ, పై–ఛాతీ భాగాలు మాత్రమే బయటకు తీశారు. మిగతా ఆ లేత శరీరాన్నంతా గర్భసంచిలోనే ఉంచేశారు. ΄్లాసెంటా కట్‌ చేయలేదు. అంటే బిడ్డకు యథావిధిగా ఆక్సిజన్‌ అందుతూనే ఉంది. మామూలు ప్రసవాల్లో ముందుగా ΄్లాసెంటా కట్‌ చేసి, తర్వాత ఎయిర్‌వేస్‌ చూస్తారు. కానీ ‘ఎక్సిట్‌’లో ముందుగా ఎయిన్‌వేస్‌ను ఏర్పాటు చేసి / రిపేర్‌ చేసి... ఆ తర్వాత ΄్లాసెంట్‌ కట్‌ చేయాలి.

ఎయిర్‌వే ఏర్పాటు చేశారిలా... 
మొదట చిన్నారికి ల్యారింగోస్కోపీ చేశారు. ల్యారింగ్స్‌ పూర్తిగా మూసుకుపోయి కనిపించింది. అంటే లంగ్స్‌నుంచి ఫ్లూయిడ్‌ బయటకు తీయడానికి పైప్‌ వేయడం (ఇన్‌ట్యూబేషన్‌) అసాధ్యం. అప్పుడు పీడియాట్రిక్‌ సర్జన్‌ రంగంలోకి దిగారు. తొలుత ట్రకియాస్టమీ చేశారు. అంటే గొంతు దగ్గర రంధ్రం పెట్టి అందులోంచి పైప్‌ పెట్టి చూశారు. లంగ్స్‌లోకి గాలి వెళ్తోంది. అంటే లంగ్స్‌ వెంటిలేట్‌ అవుతున్నాయని తెలుసుకున్నారు. ఇప్పుడు ΄్లాసెంటా కట్‌ చేశారు.

మరి సమస్య తీరిందా? 
లేదు. ఇది ఎమర్జెన్సీ రెస్క్యూ మాత్రమే. ఇంకా అసలు సమస్య ఉండనే ఉంది. అంటే... ల్యారింగ్స్‌ ఏర్పడలేదు కాబట్టి ఇప్పుడు పేషెంట్‌ను ఎన్‌ఐసీయూ అనే నియోనేటల్‌ ‘ఇంటెన్సివ్‌ కేర్‌’ యూనిట్‌కు తరలించారు. ఇక్కడ ‘ఎయిర్‌ వేస్‌ రీ–కన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ’ ద్వారా ‘ఎయిర్‌ వేస్‌’ను పునర్నిర్మించారు.

ఈ కేసు ఎందుకింత ప్రత్యేకమంటే...
గతంలో అంటే ఇరవై ఏళ్ల క్రితం కడుపులో ఇలాంటి బిడ్డ ఉంటే... పుట్టాక నిమిషాల వ్యవధిలోనే మరణం తప్పదు. ఎందుకంటే... సమస్య నిర్ధారణ జరిగే సరికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. కానీ ఇప్పుడు...

⇒ ప్రీ–నేటల్‌ అల్ట్రాసౌండ్‌
⇒ ఫీటల్‌ ఎమ్మారై 
⇒ ఎక్సిట్‌ ప్రొసిజర్‌ 
⇒ పీడియాట్రిక్‌ ఎయిర్‌వే రీ కన్‌స్ట్రక్షన్‌ సర్జరీ వంటి వైద్యపరీక్షలూ, అధునాతన చికిత్స ప్రక్రియలతో చిన్నారికి గర్భసంచిలోనే శస్త్రచికిత్స చేసి బతికిస్తున్నారు. 
ఆధునిక వైద్యశాస్త్ర పురోగతి దృష్ట్యా చూస్తే... ఫీటల్‌ మెడిసిన్, ఆబ్‌స్టెట్రిక్స్, అనస్థీషియా, నియోనేటాలజీ, పీడియాట్రిక్‌ ఈఎన్‌టీ సర్జరీ... ఇలా ఎన్నో అద్భుత వైద్యవిభాగాల సమన్వయంతో సుసాధ్యమైన ఓ మెడికల్‌ మిరాకిల్‌ ఇది.
– యాసీన్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
chaos
fetus
doctors
Surgery
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అత్యంత బాధాకరం

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అత్యంత బాధాకరం

‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!

‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!

ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్‌

ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్‌

మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..

మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..

కడుపులు కోసెయ్‌... కాసులు దోసెయ్‌

కడుపులు కోసెయ్‌... కాసులు దోసెయ్‌

‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’

‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.