Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

యుగళధారతో మ్యూజిక్‌ థె‘రఫీ’

Family Sakshi User Sakshi Sakshi Time Dec 24, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
with-lata-mangeshkar.jpg

రఫీ శత జయంతి 

రఫీ సోలోలు వేన వేలు... వాటికి అభిమానులు ఉన్నారు. రఫీ డ్యూయెట్లు వేలకు వేలు... వాటికీ అభిమానులు ఉన్నారు. ఈ స్వీటు కావాలా ఆ జున్ను కావాలా అంటే చాయిస్‌ ఏమైనా ఉంటుందా ఎవరికైనా? రెండూ కావాలి. కాని రఫీతో డ్యూయెట్లు పాడి సరిజోడుగా నిలిచి సంగీతాభిమానులను మెప్పించిన అద్భుత గాయనీమణులను రఫీతో పాటు స్మరించుకోవాలి. డిసెంబర్‌ 24 రఫీ శతజయంతి.  మరి ఆయనతో కలిసి పాడుదామా యుగళగీతం.

లాహోర్‌ నుంచి ఒక అన్నను తోడు చేసుకుని బాంబేకు బయలుదేరిన రఫీ (Mohammed Rafi) తాను గాయకుడిగా బతకాలంటే ముందు సంగీత దర్శకుణ్ణి మెప్పించాలని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో నౌషాద్‌ చాలా పెద్ద డిమాండ్‌లో ఉన్నాడు. కాని ఆయనను నేరుగా కలిసే శక్తి రఫీకి లేదు. అందుకని అన్నాదమ్ములు ఆలోచించి నేరుగా లక్నో వెళ్లారు. అక్కడ నౌషాద్‌ తండ్రి ఉంటారు. ఆయన దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకుని బాంబే తిరిగి వచ్చి అప్పుడు నౌషాద్‌ను కలిశారు. 

‘లాహోర్‌ నుంచి వచ్చావా? పాడతావా? ఏం పాడతావ్‌... నిన్ను వద్దనడానికి లేనంత పెద్ద రికమండేషన్‌ తెస్తివి’ అని నౌషాద్‌ రఫీని పరికించి చూసి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అప్పటికి తలత్‌ ఊపు మీదున్నాడు. అయినా సరే ‘దులారీ’ (1949)లో రఫీ పాడిన సోలో ‘సుహానీ రాత్‌ ఢల్‌ చుకీ నా జానే తుమ్‌ కబ్‌ ఆవొగే’ పాట పెద్ద హిట్‌ అయ్యి రఫీ దేశానికి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ రావలసినంత పేరు రాలేదు. అప్పుడు నౌషాదే ‘బైజూ బావరా’ (1952)లో మళ్లీ పాడించాడు. 

ఆ సినిమాలో రఫీ పాడిన సోలో పాటలు ‘ఓ దునియాకే రఖ్‌వాలే’, ‘మన్‌ తర్‌పత్‌ హరి దర్శన్‌ కో ఆజ్‌’ పాటలు ఇక రఫీని తిరుగులేని గాయకుని స్థానంలో కూచోబెట్టాయి. రఫీ రేంజ్‌ను తెలిపిన పాటలు అవి. అయితే అప్పటికే నూర్జహాన్‌ పాకిస్తాన్‌ వెళ్లిపోగా ప్రతిభను, ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టుకుంటూ లతా మంగేశ్కర్‌ ‘మహల్‌’ (1949)లో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ పాటతో స్థిరపడింది. రఫీ, లతా తొలి పాట కామెడీ సాంగ్‌ అయినా ఆ తర్వాత వారి డ్యూయెట్లు సరైన రొమాంటిక్‌ టచ్‌ను అందుకున్నాయి. అందుకు ‘బైజూ బావరా’లోని ఈ పాటే సాక్ష్యం.

తూ గంగాకి మౌజ్‌ మై యమునా కా ధార
హో రహేగా మిలన్‌ యే హమారా హో
హమారా తుమ్హారా రహేగా మిలన్‌...

మేల్‌ సింగర్‌ కొందరికి సరిపోతాడు.. కొందరికి సరిపోడు అనే ధోరణి ఉంది. రఫీ.. రాజ్‌కపూర్‌కు(Raj Kapoor) మేచ్‌ కాడు. దిలీప్‌ కుమార్, దేవ్‌ ఆనంద్‌లకు బాగా సరిపోయేవాడు. కాని లతాకు ఆ అడ్డంకి లేదు. ఏ హీరోయిన్‌ గొంతైనా లతా గొంతే. మీనా కుమారి, నర్గిస్, వైజయంతీ మాల, మాలా సిన్హా.. అందరికీ లతా గొంతు. అందువల్ల రఫీ, లతాల పాటలు రాజ్‌ కపూర్‌ సినిమాల్లో తప్ప తక్కిన అన్నింటిలో కొనసాగాయి. అందరు సంగీత దర్శకులు సరైన తీపితో తయారైన రవ్వలడ్ల వంటి పాటలను వారి చేత పాడించారు.

∙దో సితారోంకా జమీ పర్‌ హై మిలన్‌ ఆజ్‌ కీ రాత్‌ (కోహినూర్‌)
∙ఓ జబ్‌ యాద్‌ ఆయే బహుత్‌ యాద్‌ ఆయే (పరాస్‌మణి)
∙దిల్‌ పుకారే ఆరె ఆరె ఆరె (జువెల్‌ థీఫ్‌)
∙జిల్‌ మిల్‌ సితారోంక ఆంగన్‌ హోగా (జీవన్‌ మృత్యు)
∙వాదా కర్‌లే సాజ్‌నా (హాత్‌ కీ సఫాయి)..

వీటికి అంతే లేదు. రఫీ తన కెరీర్‌లో షమ్మీ కపూర్‌కు పాడటానికి ఎక్కువ సరదా చూపాడు. వాళ్లిద్దరిదీ హిట్‌ పెయిర్‌. షమ్మీ కపూర్‌ సినిమాలో రఫీ డ్యూయెట్లు ఎక్కువగా ఆశా భోంస్లేకు (Asha Bhosle) వెళ్లినా లతా కూడా పాడింది.  రఫీ–లతాల జోడి వెన్నెల–వెలుతురు లాంటిది. ఆ చల్లదనం వేరు.

→ ఆశా భోంస్లే
వ్యాంప్‌లకు పాడుతూ మెల్లమెల్లగా కుదురుకున్న గాయని ఆశా రఫీతో కలిసి గొప్ప పాటలు పాడింది. అన్నింటిలోకి కలకాలం నిలిచే పాట ‘అభీ నా జావో ఛోడ్‌ కర్‌ కె దిల్‌ అభీ భరా నహీ’ (హమ్‌ దోనో). ఈ పాటలో రఫీ బాగా పాడుతున్నాడా ఆశానా అనేది చెప్పలేం. ఓపి నయ్యర్‌ ఆశా చేత ఎక్కువ పాడించడం వల్ల ‘కశ్మీర్‌ కి కలీ’లో రఫీతో ‘దీవానా హువా బాదల్‌’, ‘ఏక్‌ ముసాఫిర్‌ ఏక్‌ హసీనా’లో ‘బహుత్‌ షుక్రియా బడీ మెహర్బానీ’ వంటి సూపర్‌హిట్లు సాధించింది. ఆర్‌.డి.బర్మన్‌ తన సంగీతంలో రఫీ, ఆశాలను అద్భుతమైన పాటల్లో కూచోబెట్టాడు. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ (తీస్రీ మంజిల్‌), ‘చురాలియా హై తుమ్‌నే జో దిల్‌కో’ (యాదోంకి బారాత్‌)... ఒంట్లో నిస్సత్తువను వదలగొట్టే పాటలు.

→ గీతా దత్‌
ఎంతో గొప్ప గాయని అయి ఉండి తక్కువ కాలం పాడిన గీతా దత్‌ (గీతా రాయ్‌) గురుదత్‌ సినిమాల్లో రఫీతో మురిపమైన పాటలు పాడింది. ‘సున్‌ సున్‌ సున్‌ జాలిమా’ (ఆర్‌ పార్‌), ‘హమ్‌ ఆప్‌కే ఆంఖోమే ఇస్‌ దిల్‌ కో బసాదేతో’(ప్యాసా) ఇవి రెండు గురుదత్‌ మీద తీసినవి. ‘సిఐడి’లో దేవ్‌ ఆనంద్, షకీలా మీద తీసిన ‘ఆంఖోహి ఆంఖోమే ఇషారా హోగయా’..పెద్ద హిట్‌. గురుదత్‌ సినిమాల్లో కమెడియన్‌ జానీ వాకర్‌కు  పాటలు ఉంటాయి. జానీ వాకర్‌కు కూడా రఫీనే పాడతాడు. తోడు గీతా దత్‌. ‘అయ్‌ దిల్‌ ముష్కిల్‌ హై జీనా యహా’ (సిఐడి), ‘జానే కహా మేరా జిగర్‌ గయా జీ’(మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55)... ఇవన్నీ దశాబ్దాలైనా నిలిచి ఉన్న పాటలు. రఫీతో పాటు గాయనీమణులు నిలబెట్టిన పాటలు.

→ సుమన్‌ కల్యాణ్‌పూర్‌
రాయల్టీ విషయంలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) రఫీకు విభేదాలు వచ్చాయి. రాయల్టీ కావాలని లతా, అక్కర్లేదని రఫీ మూడేళ్లు విభేదించి పాడలేదు. 1961 నుంచి 63 వరకు సాగిన ఈ కాలంలో రఫీతో డ్యూయెట్లు పాడిన గాయని సుమన్‌ కల్యాణ్‌పూర్‌. ‘పూర్‌మేన్స్‌ లతా’గా పేరుబడ్డ సుమన్‌కు గొప్ప ప్రతిభ ఉన్నా తక్కువ అవకాశాలు దొరికాయి. అయినా సరే రఫీ, సుమన్‌ కలిసి మంచి హిట్స్‌ ఇచ్చారు. వీటిలో ‘బ్రహ్మచారి’ కోసం పాడిన ‘ఆజ్‌ కల్‌ తెరె మెరె ప్యార్‌ కే చర్చే హర్‌ జబాన్‌ పర్‌’, ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’లో ‘నా నా కర్తే ప్యార్‌ తుమ్హీసే కర్‌బైఠే’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ‘రాజ్‌ కుమార్‌’లోని ‘తుమ్‌నే పుకారా ఔర్‌ హమ్‌ చలే ఆయే’ కూడా పెద్ద హిట్టే. అయితే లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్‌ వెనక్కు వెళ్లిపోయింది.

వీళ్లే కాదు ఎందరో గాయనులతో రఫీ డ్యూయెట్స్‌ పాడాడు. షంషాద్‌ బేగంతో ‘లేకె పెహలా పెహలా ప్యార్‌’, ముబారక్‌ బేగంతో ‘ముజ్‌కో అప్‌నే గలే లగాలో’, హేమలతాతో ‘తూ ఇస్‌ తర్హా మేరి జిందగీమే’... లాంటి ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. సుశీలతో ‘ఇద్దరి మనసులు ఒకటాయె’, జానకితో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... ఈ పాటలు అపురూపం. రఫీ ఘనతలో రఫీ ఫ్రతిభకు మరో సగమై నిలిచిన గాయనీమణులందరికీ రఫీ శతజయంతి సందర్భంగా జేజేలు పలకాలి. రఫీకి జిందాబాద్‌లు కొట్టాలి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mohammad rafi
rafi
centenary birth anniversary
latha mangeshkar
Asha Bhosle
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆ పాట లతాజీది కాదండీ.. నాదే!

ఆ పాట లతాజీది కాదండీ.. నాదే!

ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్‌

ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్‌

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం

 లతా మంగేష్కర్ జయంతి.. స్పెషల్ టీజర్‌తో నివాళి!

లతా మంగేష్కర్ జయంతి.. స్పెషల్ టీజర్‌తో నివాళి!

భార్యకు విడాకులు.. దుబాయ్‌కు వెళ్లిందంటే అమ్మాయి చెడిపోయినట్లేనా?

భార్యకు విడాకులు.. దుబాయ్‌కు వెళ్లిందంటే అమ్మాయి చెడిపోయినట్లేనా?

నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్‌ ఒప్పుకోలేదు: సింగర్‌

నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్‌ ఒప్పుకోలేదు: సింగర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.