Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఫోన్‌ ‘అక్కడి’ దాకా తీసుకెళ్తున్నారా?

Family Sakshi User Sakshi Sakshi Time Sep 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Cell-Phone.jpg

ఇంట్లో.. వీధుల్లో, క్లాసుల్లో.. ఆఫీసుల్లో కూడా.. మన చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ లేని సందర్భమంటూ ఉండదు. కానీ మనలో కొందరు ఇక్కడికే పరిమితం కావడం లేదు. ఉదయాన్నే బాత్రూమ్‌ల్లోకి వెంట తీసుకెళ్తున్నారు. రీల్స్‌ తిరగేస్తూ కాల కృత్యాలు తీర్చుకునే ఈ పద్ధతి కాస్తా డేంజర్‌గా మారుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేసే వారిలో కనీసం సగం మందికి ‘హెమరాయిడ్స్‌’ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎలా? ఏమిటి? అని అనుకుంటున్నారా?...

మలద్వారంలో ఒత్తిడి పెరిగిపోవడం, మంట/వాపులకు గురవడం వల్ల అక్కడి నరాలు వాచిపోతుంటాయి. వీటినే హెమరాయిడ్లు లేదా పైల్స్‌ అని పిలుస్తుంటారు. రోజంతా కూర్చొనే ఉండటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం, మలబద్ధకం, మహిళలైతే గర్భధారణ సమయంలో ఈ హెమరాయిడ్లకు కారణాలని వైద్యశాస్త్రం చెబుతోంది. బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అన్నది తాజాగా ఈ జాబితాలోకి చేరింది. బోస్టన్‌ (అమెరికా)లోని బెత్‌ ఇజ్రాయెల్‌ డెకోనెస్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మల విసర్జన సమయంలో స్మార్ట్‌ఫోన్లను వాడితే హెమరాయిడ్లు వచ్చే అవకాశం 46 శాతం వరకూ ఎక్కువ అని తేలింది. స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న దానిపై ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడతామన్నది అనూహ్యమైన పరిణామాలకు దారితీయవచ్చును అనేందుకు తాజా పరిశోధన ఒక నిదర్శనమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ త్రిషా పశ్రీచా అంటున్నారు.

సంబంధం ఏమిటి? 
స్మార్ట్‌ఫోన్లను బాత్రూమ్‌లలో వాడితే హెమరాయిడ్లు ఎందుకు వస్తాయన్న ప్రశ్నకు డాక్టర్‌ పశ్రీచా బదులిస్తూ.. ‘స్మార్ట్‌ఫోన్లల వాడకం వల్ల సమయం గుర్తుండకపోవడం చాలా సహజం. ఫలితంగా ఆ సమయంలో మలద్వారం వద్ద ఉన్న కండరాలు, నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఫలితంగా కాలం గడుస్తున్న కొద్దీ హెమరాయిడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి’ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు డాక్టర్‌ పశ్రీచా బృందం 45 ఏళ్లు పైబడ్డ వారు 125 మందిని పరిశీలించింది. వీరందరూ పేగుల పరీక్ష (కొలనోస్కోపీ)కి సిద్ధంగా ఉన్న వారు. ఆహార అలవాట్లు, ఉండేచోటు, బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్లు వాడతారా? లేదా? వంటి పలు వివరాలను వీరి నుంచి సేకరించారు.

అలాగే మల విసర్జన అలవాట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. కొలనోస్కోపీ సమయంలో వీరికి హెమరాయిడ్లు ఉన్నదీ లేనిది స్పష్టం కాగా.. స్మార్ట్‌ఫోన్లు వాడని వారితో పోల్చి చూసినప్పుడు వాడే వారిలో హెమరాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. పరిశీలించిన ఈ 125 మందిలో 66 శాతం మంది బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే వీరు ఐదు నిమిషాలు ఎక్కువ సమయం బాత్రూమ్‌లలో గడుపుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లను బాత్రూమ్‌ల వరకూ తీసుకెళ్లకూడదన్న సాధారణ సలహాకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోందని, మలవిసర్జనకు ఎక్కువ సమయం పడుతూంటే ఎందుకు అన్న ప్రశ్న వేసుకుని అలవాట్ల సరిచేసుకోవాలని డాక్టర్‌ పశ్రీచా సూచించారు. అయితే కొంతమంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు మాత్రం స్మార్ట్‌ఫోన్‌ వాడినా, వాడకపోయినా బాత్రూమ్‌లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం అంత ఆరోగ్యకరమైన అంశం కాదని స్పష్టం చేస్తున్నారు.
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Gopala Krishna G Mayya
cell phone
Wash Room
health issues
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సెల్‌ఫోన్‌ కోసం 262 అడుగుల ఎత్తులో..

సెల్‌ఫోన్‌ కోసం 262 అడుగుల ఎత్తులో..

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

ఎత్తైన దిండ్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే

ఎత్తైన దిండ్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే

పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

అమెరికా, ఫ్రాన్స్‌లు కాదన్నాయి.. భారత్‌ మాత్రం సాధించింది!

అమెరికా, ఫ్రాన్స్‌లు కాదన్నాయి.. భారత్‌ మాత్రం సాధించింది!

అంగట్లో ‘అండాలు’.. అందమైన అమ్మాయిలే టార్గెట్‌!

అంగట్లో ‘అండాలు’.. అందమైన అమ్మాయిలే టార్గెట్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.