Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ధర్మబద్ధమైన అధికారం

Family Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
For-Manchimata.jpg

సనాతన ధర్మం నాయకత్వాన్ని కేవలం అధికారం చలాయించే సాధనంగా చూడదు; అది ఒక పవిత్రమైన బాధ్యత, త్యాగంతో కూడిన ధర్మ నిర్వహణ. నాయకుడు అంటే ఆజ్ఞలు జారీ చేసే యజమాని కాదు, తన ఆచరణతో  దారి చూపే నిశ్శబ్ద విప్లవకారుడు. ఉత్తముడైన నాయకుడు ఏ మార్గంలో నడుస్తాడో, లోకం ఆ అడుగుజాడలనే అనుకరిస్తుంది. అధికార గర్వం దరిచేరనీయక, వినయంతో లోక కల్యాణం కోసం శ్రమించేవాడే అసలైన మహానాయకుడు.

నాయకత్వానికి మొదటి మెట్టు నిస్వార్థం. తన ప్రయోజనం కన్నా సామాజిక హితం గొప్పదని భావించే వ్యక్తి మాత్రమే ప్రజల అంతరంగంలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. చందన వృక్షం తనను తాను అరగదీసుకుంటూ చుట్టూ ఉన్న గాలిని సుగంధభరితం చేసినట్లు, నాయకుడు తన వ్యక్తిగత సుఖాలను త్యాగం చేస్తూ సమాజానికి మేలు చేకూర్చాలి. పదవి అంటే వ్యక్తిగత లాభాల కోసం లభించిన అవకాశం కాదు, అది ఆర్తుల కన్నీటిని తుడిచి ప్రజలకు సేవ చేసే అరుదైన సౌభాగ్యం. నిస్వార్థ ప్రయాణంం నాడు విలువల కోసం పదవులను తృణ్రపాయంగా వదులుకున్న మహనీయులు ఉండేవారు.

వివేచన
ధర్మబద్ధమైన నిర్ణయంం లక్ష్యాలు ఎంత గొప్పవో, వాటిని సాధించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. గమ్యం చేరుకోవడానికి అడ్డదారులు తొక్కడం నాయకత్వానికే కళంకం. పాలు తాగిన పాము విషాన్ని మాత్రమే చిమ్మినట్లు, దుర్మార్గమైన ఆలోచనలతో కూడిన అధికారం వినాశనాన్ని మాత్రమే మిగిలిస్తుంది. పాల నుండి వెన్నను వేరు చేసే మథనం వలె, నాయకుడు క్లిష్ట పరిస్థితుల్లోనూ నిజాన్ని, నిప్పును వేరు చేసే సునిశిత విచక్షణ కలిగి ఉండాలి. అధికారం ఆయుధం వంటిది; అది రక్షించడానికి వాడితే దైవత్వం, భక్షించడానికి వాడితే రాక్షసత్వం అవుతుంది. కలుషితమైన విత్తనం నుండి ఆరోగ్యకరమైన ఫలాలు ఆశించడం ఎంత భ్రమయో, అనైతిక మార్గాల్లో సాగే పాలన నుండి సుఖశాంతులు ఆశించడం కూడా అంతే అత్యాశ.

సమన్వయం: సమభావం – సంస్కారం 
ఉత్తమ నాయకుడు తన అనుచరులను బానిసలుగా కాకుండా, తన గమ్యంలో సమాన భాగస్వాములుగా చూస్తాడు. మన అరచేతికి ఉన్న వేళ్ళు అన్నీ ఒకే రీతిలో ఉండవు, ఒక్కో వేలుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ, ఆకలి తీర్చుకోవడానికి ఆ ఐదు వేళ్ళూ ఏకమైతేనే పట్టు దొరుకుతుంది. అలాగే, ఒక వ్యవస్థలో భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉండవచ్చు. వారందరినీ సమన్వయపరుస్తూ, వారిలోని వైవిధ్యాన్ని గుర్తించి ఏకతాటిపై నడిపించడమే నాయకత్వ వైశిష్ట్యం. ఉప్పు సముద్రంలో ఉన్నప్పుడు చేదుగా అనిపించినా, వంటకంలో చేరినప్పుడు రుచిని ఇస్తుంది. అలాగే నాయకుడు కఠినంగా కనిపించినా, ఆ క్రమశిక్షణ వ్యవస్థ బాగు కోసమేనని గ్రహించాలి. చిత్తశుద్ధి కలిగిన మనసు రాజ్యాన్ని రామరాజ్యంగా మారుస్తుంది.

ధర్మబద్ధమైన నాయకత్వం విశ్వశాంతికి మూలం. పదవి అనేది తాత్కాలికమైన విడిది వంటిది, అది ఏ క్షణమైనా ముగిసిపోవచ్చు. కానీ ఆ పదవిలో ఉండి చేసిన సత్కార్యాలు అజరామరంగా నిలిచిపోతాయి. బాధ్యతను విస్మరించి అధికార కాంక్షతో రగిలిపోయే వారికి కాలమే గట్టి బుద్ధి చెబుతుంది. పూలమాలలోని దారం కనిపించదు కానీ, అది పువ్వులన్నింటినీ కలిపి ఉంచుతుంది; అలాగే నాయకుడు కూడా తెరవెనుక ఉండి వ్యవస్థను సుస్థిరంగా నిలబెట్టాలి. మేఘం కరిగి వర్షమై నేలని పునీతం చేసినట్లు, నాయకుడి అధికార గర్వం కరిగి సేవాభావంగా మారినప్పుడే పాలకుడికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ప్రతి అడుగు ధర్మబద్ధం కావాలి, ప్రతి నిర్ణయం లోకహితం కోరాలి. భారతీయ నాయకత్వ విలువలు జగత్తుకు మార్గదర్శకం కావాలి. సత్యం వర్ధిల్లాలి, ధర్మం నిలవాలి, లోకమంతా శాంతి సౌఖ్యాలతో వెల్లివిరియాలి.

– కె. భాస్కర్‌ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
bhaskar
leadership
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నాయకి..

నాయకి..

అన్నల్లో.. ఆ ఇద్దరేనా!

అన్నల్లో.. ఆ ఇద్దరేనా!

సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?

సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?

ఒక్కటి కాదు.. వస్తున్నాయ్‌ 100 రిలయన్స్‌లు

ఒక్కటి కాదు.. వస్తున్నాయ్‌ 100 రిలయన్స్‌లు

హార్వర్డ్‌ వర్సిటీలో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి, సీఎం రేవంత్‌ ఏమన్నారంటే..

హార్వర్డ్‌ వర్సిటీలో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి, సీఎం రేవంత్‌ ఏమన్నారంటే..

పరేడ్‌లో దళనాయకి

పరేడ్‌లో దళనాయకి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.