Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

భద్ర హరి పాట శాలలో తొలకరి

Family Sakshi User Sakshi Sakshi Time Jun 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
454545.jpg

న్యూస్‌మేకర్‌ భద్ర హరి

జూన్‌ 2న కేరళలో  బడులు తెరుచుకోనున్నాయి. ఒకటో క్లాసులో చేరే పిల్లల కోసం అన్ని స్కూళ్లలో ‘ప్రవేశోత్సవం’ చేయడం కేరళ విద్యాశాఖకు ఆనవాయితీ. అయితే ఈసారి ఆ ఉత్సవానికి పాట రాయించాలనుకున్నారు. ప్రకటన ఇస్తే ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న భద్ర హరి రాసింది. ఎంపికైన ఆ పాట అన్ని స్కూళ్లలో స్వాగత గీతం కానుంది.

కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఉదంతం చెబుతోంది. అక్కడ జూన్‌ 2 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఆ వేళ విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు, కొత్త విద్యార్థులను స్కూల్లో చేరేలాప్రోత్సహించేందుకు ‘ప్రవేశోత్సవం’ నిర్వహిస్తారు. ఇది ప్రతి ఏట కేరళ విద్యాశాఖ నిర్వహించే వేడుక. కాని ఈసారి స్వాగత గీతాన్ని తయారు చేసి పిల్లలకు వినిపించాలని సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో పాటను ఆహ్వానిస్తూ పేపర్‌ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను అదూర్‌లో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న భద్రహరి చూడటంతో మన కథ మొదలవుతుంది.

రెండు రోజుల్లో పాట రాసింది
భద్రహరి ఐదో క్లాస్‌ నుంచి కవిత్వం రాస్తోంది. వాళ్ల నాన్న హరీంద్రనాథ్‌ అదూర్‌లో డిప్యూటీ తాసిల్దార్‌గా పని చేస్తున్నారు. అమ్మ సుమ టీచర్‌. పదో తరగతిలో ఉండగా ‘ధనుర్మాస పౌర్ణమి’ పేరుతో కవితా సంకలనాన్ని వెలువరించిన భద్రహరి కేరళ ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ‘కళా ఉత్సవం’లో కవిత్వం రాసి బహుమతులు పొందింది. ప్రభుత్వ ప్రకటన చూశాక బడికి వచ్చే పిల్లల కోసం పాట రాయాలనుకుంది. ‘మజా మేఘంగళ్‌’... పల్లవితో మొదలెట్టి రెండు రోజుల్లో పాట పూర్తి చేసింది. 

‘నేను పదేళ్ల క్రితం మొదటిసారి బడికి వెళ్లడం గుర్తుకొచ్చింది ఈ పాట రాసేప్పుడు. కేరళలో చినుకులు మొదలైన వేళే బడులు తెరుచుకుంటాయి. పిల్లలు రంగురంగుల రెయిన్‌ కోట్లలో బడికి వస్తారు. కొందరు గొడుగులు తెస్తారు. మొదటిసారి చేరే పిల్లలు తల్లిదండ్రుల చేయి పట్టుకుని మొదటి అడుగు వేస్తారు. అదంతా నా మొదటి చరణంలో రాశాను. రెండో చరణంలో కేరళలో జరుగుతున్న శాస్త్ర, సాంకేతిక పురోగతిని చె΄్పాను. మూడో చరణంలో వ్యవసాయంలోను, సాంస్కృతికంగాను కేరళ ఘనతను చాటాను’ అని తెలిపింది భద్రహరి.

ముఖ్యమంత్రితో కలిసి...
పాట రాశాక భద్రహరికి ఎటువంటి రెస్పాన్స్‌ రాలేదు. అయితే వారం రోజుల క్రితం ఆమెకు విద్యాశాఖ నుంచి ఫోన్‌ వచ్చింది ‘మీ పాట స్వాగత గీతంగా ఎంపికైంది’ అంటూ. ‘ఆ రోజున నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంది భద్రహరి. 

‘నేను రాసిన పాటకు నేనే ట్యూన్‌ కట్టి మొదట మా అమ్మానాన్నలకు వినిపించాను. వారు చాలా బాగుందని అన్నారు. అయితే ప్రభుత్వ కోరిక మేరకు సంగీత దర్శకుడు అల్ఫాన్స్‌ జోసఫ్‌ ఆ పాటకు తన ట్యూన్‌ కట్టి పాడారు. పాట చాలా బాగా వచ్చి వైరల్‌ అయ్యింది. జూన్‌ రెండున ముఖ్యమంత్రి విజయన్‌ కలవూర్‌లో జరిగే ప్రవేశోత్సవంలో ఈ పాటను ఆవిష్కరిస్తారు. ఆ వేడుకకు ఆయనతో పాటు పాల్గొనమని నాకు ఆహ్వానం అందింది’ అంది భద్రహరి.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ ఎం.పి.సి, బై.పిసిల వైపే ఇంకా మొగ్గుతున్నా పదో క్లాస్‌లో టాప్‌ మార్కులతో పాసైన భద్రహరి ఇంటర్‌లో ఆర్ట్స్‌ తీసుకుంది. మలయాళ భాషలో పై చదువు చదివి లెక్చరర్‌ కావాలనుకుంటోంది. కవయిత్రిగా గుర్తింపు పొందాలనుకుంటోంది. సమాజం కవిత్వానికి విలువ ఇవ్వకపోయినా పిల్లలకు తెలుసు కవిత్వం ఎంత గొప్పదో. దానిని ఎలా గౌరవించాలో. భద్రహరి వంటి విద్యార్థులే నిజమైన సాహిత్య, సాంస్కృతిక పరిరక్షకులు.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kerala
Education Department
School Education Department
ssc student
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

స్వీడన్ సంచలన నిర్ణయం.. డిజిటల్ చదువులకు గుడ్‌బై!

స్వీడన్ సంచలన నిర్ణయం.. డిజిటల్ చదువులకు గుడ్‌బై!

 దేశాన్ని ఏలే పాలకులు కావాలి

దేశాన్ని ఏలే పాలకులు కావాలి

తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు

తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.