Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 25, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
voodoo-festival.jpg

ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్‌ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్‌ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్‌’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ?

పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్‌ డాన్స్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట.

అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి.

అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక.

ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్‌లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్‌లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్‌ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్‌ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తుంటాయి. 

---సంహిత నిమ్మన

(చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్‌..!)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
africa
festivals
mysterious
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

విమానాశ్రయంపై దుండగుల దాడి.. 35 మంది మృతి

విమానాశ్రయంపై దుండగుల దాడి.. 35 మంది మృతి

ఎబోలా విలయ తాండవం 

ఎబోలా విలయ తాండవం 

ఎలాంటి ఒప్పందాలు మేలు?

ఎలాంటి ఒప్పందాలు మేలు?

ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్

ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్

ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త గురించి తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త గురించి తెలుసా?

మన భూమిపై జీవించలేని డేంజరస్ ప్రదేశాలు

మన భూమిపై జీవించలేని డేంజరస్ ప్రదేశాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.