Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!

Family Sakshi User Sakshi Sakshi Time Jun 30, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mist.jpg

గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్‌ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్‌ మర్రిచెట్టు’  ఒకటి. సాలిగావ్‌ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్‌.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.

‘మే డి డ్యూస్‌’ క్యాథలిక్‌ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్‌ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.

ఆ ఏడాది చివరిలో సాలిగావ్‌కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్‌ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్‌ ఫాదర్‌.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్‌లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.

ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్‌ ఫాదర్స్‌ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.

పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్‌ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను  ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.

ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.

ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Funday Sunday
mistery
Goa
tree
Spirits
devils
horror
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కాలం మారుతోందా? నేరేడు చెట్టు చెబుతున్న నమ్మలేని నిజాలు

కాలం మారుతోందా? నేరేడు చెట్టు చెబుతున్న నమ్మలేని నిజాలు

 'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్!

భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్!

మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్

మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్‌ 

చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్‌ 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.