Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

వైరుద్ధ్య భారతంలో జాతీయవాదమా?

Family Sakshi User Sakshi Sakshi Time Apr 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BhimraoRamjiAmbedkar.jpg

బాబా సాహెబ్‌ అంబే డ్కర్‌ ఒక సందర్భంలో గాంధీజీతో జరిపిన సంభా షణలో ‘నాకు మాతృ దేశం లేదు’ అంటారు.అందుకు గాంధీజీ ‘లేదు, మీకు మాతృ దేశం వుంది’ అని బదులిస్తే... ‘మమ్మల్ని కుక్కలు, పందు లకంటే హీనంగా చూసే దేశాన్ని చూసి ఏ అంట రానివాడైనా ఈ దేశం నాది అని ఎలా అనుకో గలడు?’ అని అంబేడ్కర్‌ పేర్కొనడం విశేషం.    

భారత్‌లో ఇటీవలి కాలంలో జాతీయవాదం లేదా దేశభక్తి అనే భావనలు తరచూ వివాదాస్పద చర్చలకు దారితీస్తున్న క్రమంలో అంబేడ్కర్‌ జాతీ యవాదంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను చర్చించడం అవసరం.  ఒకవైపు బ్రిటీష్‌ వలసవాదం అంతమై దేశానికి పాలనాధికారాలు బదిలీ అవుతున్న సందర్భంలో ఆయన జాతీయవాదంపై వ్యక్తపరి చిన అభిప్రాయాలు ఎంతో కీలకమైనవి. బ్రిటిష్‌ పాలన అంతమొందడంతోనే ఇక్కడి సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయని అంబేడ్కర్‌తో పాటు అణ గారిన కులాలు భావించకపోవడం గమనార్హం.

బ్రిటిష్‌ వారికంటే ఇక్కడ ప్రత్యక్షంగా తమపై కుల దాష్టీకాన్ని ప్రదర్శించే నల్ల దొరలే తమ ప్రధాన శత్రువులు అనే అవగాహన అణగారిన వర్గాల్లో  దేశ వ్యాప్తంగా పెంపొందింది. ఉత్తరాదిన పంజాబ్‌లో ‘ఆదిధర్మి’ ఉద్యమం, ఒరిస్సాలో ‘మహిమ ధర్మం’, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌ రాష్ట్రాలలో ‘ఆది హిందూ’, దక్షిణాదిలో ‘ఆది ద్రావిడ’, ‘ఆది ఆంధ్ర’, ‘ఆది కన్నడ’ వంటి ఉద్య మాలు దళితులు ఈ దేశ మూలవాసులనే ఆత్మ గౌరవ ప్రకటనలు వెలువడుతున్న కాలమది. ఆధి పత్య కులాలకు చెందిన కవి గరిమెళ్ళ సత్యన్నా రాయణ బ్రిటిష్‌ వలస పాలనను వ్యతిరేకిస్తూ ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే గేయాన్ని రాస్తే... కుసుమ ధర్మన్న అనే దళిత కవి ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయాన్ని రాసి స్వరాజ్యం, స్వతంత్రం అనే అంశాలలో దళితుల ఆకాంక్షలను వ్యక్తీక రించడం గమనార్హం. తమిళనాట పండిత అయోతీ దాస్, పెరియార్ల నాయకత్వంలో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం కూడా ఆధిపత్య కులాల జాతీ యోద్యమంలో భాగస్వామి కాకుండా తమదైన స్వతంత్ర ఆకాంక్షలను వ్యక్తపరచడం చూస్తాం.

ప్రాంతీయంగా వ్యక్తమవుతున్న అణగారిన కులాల స్వతంత్ర ఆకాంక్షలకు అంబేడ్కర్‌ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద కాన్వాసు మీద తమ జాతీయవాదం ఏమిటో నిర్మొహ మాటంగా చెబుతూ బ్రాహ్మణ బనియాల జాతీయవాద లొసుగులను దుయ్యబట్టాడు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ అస్తి త్వాలు, వాటిమధ్య వైరుద్ధ్యాలు గల భారతదేశం ఒక జాతిగా ఉండే అవకాశం లేదని చెబుతూ ఇక్కడ జాతీయతా భావన ఇంకా సాధించాల్సిన ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ ‘దేశభక్తులు’ ఎంత సేపటికీ తమకూ, తమ వర్గానికీ అధికారం దక్కా లని తాపత్రయ పడుతుంటారని అన్నారు. తన జాతీయవాదం అన్ని రకాల గుత్తాధిపత్యాలనూ తిరస్కరిస్తుందని అన్నాడు.

అంబేడ్కర్‌ జాతీయవాదంపై వెలిబుచ్చిన భావాలకు నేటికీ ప్రాసంగికత ఉంది. ఆయన ఒక సందర్భంలో తన కాలపు దేశ భక్తులను ఉద్దేశించి వీరికి తమ పూర్వీకులు అణగారిన ప్రజలపై సాగించిన దారుణాలపై ఎటువంటి ప్రాయశ్చిత్త ధోరణీ లేకపోగా రాబోయే కాలంలో తమ వారు గతంలో సాగించిన ధోరణినే తిరిగి ప్రదర్శించడానికి వెన కాడబోరు అని పేర్కొన్నారు. అది ఈనాటి దేశ భక్తుల విషయంలో అక్షర సత్యమని తెలు
స్తుంది. ఇప్పుడు అణ గారిన కులాలు, ఆది వాసులు, స్త్రీలు, మైనారిటీల పట్ల పెత్తందారీ కులాల వారు సాగించే హత్యలు, అత్యా చారాలు సమస్తమైన దౌర్జన్యాలకు వారు దేశభక్తినీ, దైవ భావ ననూ అడ్డు పెట్టుకోవడం కళ్ళారా చూస్తున్నాం. కుహనా జాతీయవాదుల రెండు నాల్కల ధోర ణిని ఆయన సరిగ్గానే అంచనా వేయడం గమ నార్హం. ఆయన చూపించిన వెలుగు దారిలో సమ కాలీన ప్రజా వ్యతిరేక శక్తుల ఆట కట్టించి సామా జిక, రాజకీయ వైరుద్ధ్యాలను పరిష్కరించుకోవడం మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. 
 

ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి 
వ్యాసకర్త ప్రముఖ దళిత కవి, రచయిత్రి 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ambedkar
jayanti
people
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏడుగురి సవారి.. ఏమవుతుందో మరి!

ఏడుగురి సవారి.. ఏమవుతుందో మరి!

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!

పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!

బహిరంగ సభలో ప్రజలపై రెచ్చిపోయిన బాబు..

బహిరంగ సభలో ప్రజలపై రెచ్చిపోయిన బాబు..

ఏనుగుల దాడి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఏనుగుల దాడి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.