Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?

Family Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
alcohol.jpg

జానకి ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్‌ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్‌ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్‌ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్‌ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్‌ వ్యసనంగా మారింది. 

అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్‌ డ్రింకింగ్‌ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్‌కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. 

అలవాటు కాదు.. జబ్బు

జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. 

తిడితే సరిపోదు.. చికిత్స అవసరం..

మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ లేదా క్లినికల్‌ సైకాలజిస్ట్‌ లేదా అడిక్షన్‌ ఎక్స్‌పర్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్‌ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 

వివిధ దశల్లో చికిత్స

మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్‌ కౌన్సెలింగ్‌.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. 

  • ఆల్కహాల్‌ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్‌ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి
  • కొన్ని టాబ్లెట్స్‌ తీసుకున్నప్పుడు ఆల్కహాల్‌ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్‌ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి
  • ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది
  • రీహాబిలిటేషన్‌ సెంటర్‌ లేదా సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్‌ అండ్‌ విత్‌ డ్రాయల్‌ చికిత్స అందిస్తారు. విత్‌ డ్రాయల్‌ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు
  • మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్‌ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్‌ కౌన్సెలర్లు, సోషల్‌ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు.

మద్యపాన వ్యసనం లక్షణాలు

మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్‌గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. 

  • ఆల్కహాల్‌ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం ·
  • తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం 
  • తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం
  • తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం
  • మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం
  • జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం
  • డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం

కారణాలు..

మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్‌ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్‌ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. 

--సైకాలజిస్ట్‌ విశేష్‌ 

psy.vishesh@gmail.com 

(చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్‌ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Alcohol
Disorder
Treatment
illness
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఊరంతా తోడై... అమ్మకు గూడయి...

ఊరంతా తోడై... అమ్మకు గూడయి...

మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు

మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు

నర్సు వైద్యం..తల్లీ శిశువు మృతి

నర్సు వైద్యం..తల్లీ శిశువు మృతి

సారం లేని సారా కథలు

సారం లేని సారా కథలు

బీచ్‌లలో బీరు.. బారు

బీచ్‌లలో బీరు.. బారు

మంత్రి భరత్‌ అనుచరుల అరాచకం

మంత్రి భరత్‌ అనుచరుల అరాచకం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.