Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పని బంగారం, బతుకు నిస్సారం

Family Sakshi User Sakshi Sakshi Time Apr 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Goldsmith.jpg

పసిడి ధర భారీగా పెరగడంతో దిగజారిన కొనుగోళ్లు 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన ఆభరణాల తయారీ పనులు 

పనులు లేక అవస్థలు పడుతున్న   కార్మికులు

వేరే పనులు చూసుకుంటున్న స్వర్ణకారులు

బంగారం ధర ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకుంది. తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. ఎక్కడ చూసినా  దీని గురించే చర్చ.. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు బంగారు ఆభరణాల తయారీ కార్మికులు మాత్రం పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్మికులపై  దాని ప్రభావం అధికంగా పడుతోంది.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 40 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పాతబస్తీలో సుమారుగా 50 సముదాయాల్లో ఐదు నుంచి ఆరు వందలకు పైగా, గవర్నర్‌పేట బీసెంట్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరో రెండు వందలకు పైగా కార్ఖానాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 25 వేల మంది కారి్మకులు వీటిపై ఆధారపడి ఉన్నారు. ఇవి కాకుండా రెండు జిల్లాలో పెద్ద స్థాయిలో ఆభరణాల తయారీ చేసే మరో వంద వరకూ కార్ఖానాలు పని చేస్తున్నాయి. వీటిల్లో ఏడెనిమిది వేల మంది వరకూ కార్మికులు పని చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద ఆభరణాల తయారీ చేసే వారి సంఖ్య సైతం ఏడెనిమిది వేల వరకూ ఉంటుంది. వీరిలో సుమారు ఏడు నుంచి పది వేల మంది బెంగాల్‌ కార్మికులు ఉన్నట్లు అంచనా. 


పనులు లేక ఆత్మహత్యలు..  
పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. యనమలకుదురులో ఒక కార్మికుడు ఆభరణాల తయారీకి వినియోగించే సైనెడ్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఇతర రంగాలకు తరలిపోతున్నారని వారు వాపోతున్నారు.  


బహుళజాతి సంస్థలతో తీవ్ర ప్రభావం.. 
దశాబ్దం క్రితం వరకూ స్వర్ణకారుల (Goldsmith) జీవితాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోయాయి. దాదాపుగా అందరికీ చేతినిండా పనులు ఉండేవి. కానీ పది సంవత్సరాలుగా బహుళజాతి సంస్థల కారణంగా స్థానికంగా పనులు తగ్గి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. ముఖ్యంగా చాలా సంస్థలు ఉత్తరాది నుంచి ఆభరణాలను తయారు చేయించు కొని దిగుమతి చేసుకుంటున్నాయి. విస్తృత ప్రచార ఆర్భాటాలు, ఆకర్షించే దుకాణ సముదాయం, ఆకట్టుకునే రాయితీలు, భారీ పెట్టుబడులతో కార్పొరేట్‌ సంస్థలు ఈ రంగంలోకి రావటంతో స్వర్ణకారుల బతుకు చిత్రం భారంగా మారింది.  

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి: 
రోజూ బంగారం అమ్మకాలు:  250 కిలోలకు పైగా(అంచనా) 
ఆభరణాల తయారీ కార్మికులు: 40 వేలు


దారుణంగా  కొనుగోళ్లు.. 

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిత్యం 250 కిలోల బంగారం అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా.  

  • విజయవాడలో సుమారుగా 25 నుంచి 30 వరకూ కార్పొరేట్‌ బంగారం అమ్మకాల దుకాణాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో రోజూ దాదాపు

  • 125 నుంచి 150 కిలోల అమ్మకాలు జరుగుతుంటాయన్నది వ్యాపార వర్గాల   అంచనా. 

  • విజయవాడతో పాటుగా మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది వందల చిన్న దుకాణాలు బంగారం విక్రయాలు చేస్తుంటాయి. వీటిల్లో సుమారుగా మరో 25 నుంచి 40 కిలోల బంగారం విక్రయాలు జరుగుతుంటాయి.  

  • ఇవి కాకుండా విజయవాడలో దాదాపుగా ఏడెనిమిది వందల కార్ఖానాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో సుమారు వంద కిలోల మేర బంగారం నిత్యం వినియోగిస్తుంటారు.  

  • ఇవి సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలు. కానీ బంగారం విక్రయాలు వివాహాల సీజన్, అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజుల్లో మరింత అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ వినియోగం సగానికన్నా పడిపోయిందని వ్యాపార, కార్మిక   సంఘాల నేతలు చెబుతున్నారు.

 

వ్యాపారాలు పడిపోయాయి.. 
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో  బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. దీని ప్రభావంతో వ్యాపారులతో పాటుగా ఆభరణాల తయారీ చేసే  కార్మికులు  నానా తంటాలు పడుతున్నారు.  
– కోన శ్రీహరిసత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి, బెజవాడ జ్యూవెలరీ అండ్‌ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. 
బంగారు ఆభరణాల తయారీ కారి్మకులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు చేరుకున్నారు. ఇటీవల యనమలకుదురులో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు బంగారం ధరల (Gold Rate) పెరుగుదల ప్రధాన కారణం. చాలా మంది ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కార్మికులలుగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి. 
– తోలేటి శ్రీకాంత్, చైర్మన్, వైఎస్సార్‌ సీపీ చేతివృత్తుల విభాగం

పరిస్థితి దయనీయం.. 
ఆభరణాల తయారీ  కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. తులం బంగారం (Gold) లక్షకు చేరుకోవటంతో ఈ పరిస్థితులు చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. పనులు లేకపోవటంతో ఆదాయం లేక  పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. 
– మందారపు పోతులూరి ఆచారి, ప్రధాన  కార్యదర్శి, శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం

ఇదీ చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Akshaya Tritiya 2025
Gold prices
high
goldsmiths
hit
krishna distict
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పసిడి వరుస పతనం

పసిడి వరుస పతనం

వెండి ఢమాల్‌

వెండి ఢమాల్‌

మెరుస్తూనే ఉంటాయి... కానీ!

మెరుస్తూనే ఉంటాయి... కానీ!

పసిడి రీబౌండ్‌ 

పసిడి రీబౌండ్‌ 

Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..

Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..

పాత బంగారు లోకం

పాత బంగారు లోకం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.